బాధ్యత అంటే ఏమిటి? ఈ పదం తెలుగులో చిన్నదే అయినా దాని యొక్క ఫలితం పెద్దదే.
కొన్ని పదాలకు అర్ధం కన్నా భావమే బలంగా అవగతం అవుతుంది. ఆ పదం యొక్క భావం మనసుకు అర్ధం అవుతుంది… కానీ దాని నిర్వచనం కష్టం అవుతుంది.
అయితే తెలుగులో పదాలకు అర్ధాలు తెలుగు నిఘంటువులలో లభిస్తాయి. బాధ్యత భావం ఏమిటి అని పరిశీలిస్తే…
ఇప్పుడు బాధ్యత అనే పదం తెలుగులో ఉపయోగించే సందర్భం బట్టి ఆ పదం యొక్క అర్ధం ఏమి అయ్యి ఉంటుందో… ఆలోచన చేయవచ్చు.
ఒక వ్యక్తి కానీ ఒక వ్యవస్థ కానీ ఒక పనిని ఇంకొక వ్యక్తికి కానీ ఇంకొక వ్యవస్థకు అప్పగిస్తూ “ఇది మీ బాధ్యత” అంటారు.
కొందరు కుటుంబంలో వ్యక్తికి పని అప్పగిస్తూ “ఇది నీ బాధ్యత” అంటారు.
ఏదైనా పనిని స్వీకరిస్తూ కూడా “ఆ పనిని పూర్తి చేసే బాధ్యత నాది” అని పలుకుతూ ఉంటారు.
ఈ విధంగా ఒక పనిని స్వీకరిస్తూ లేదా అప్పగిస్తూ ప్రమాణ భావనను బాధ్యత అనవచ్చు.
అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఒక వాహనమును ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్ కు తరలించడానికి పూనుకుంటే… ‘అతను ఆ యొక్క వాహన రక్షణను గురించిన హామీ, ఆ వాహనం యొక్క యజమానికి ఇచ్చే క్రమంలో… “మీ వాహనం జాగ్రతగా గమ్యానికి చేరుస్తానని చెబుతాడు. ఆ మాటను యజమాని విశ్వసించే విధంగా మాట్లాడుతూ ‘మీ వాహనం యొక్క బాధ్యత నాది‘ అని అంటాడు.
బాధ్యత నాది అని ఎవరైనా అంటే, అది ఒక హామీ క్రిందగా పరిగణింపబడుతుంది. అంటే బాధ్యతకు హామీ ఒక పర్యాయ పదం కూడా కావచ్చు.
అలాగే ఒక వ్యవస్థ కూడా ఒక వ్యక్తికి పనిని కానీ అధికారం కానీ అప్పగిస్తూ… “ఈ పనికి మీరే సమర్ధులు అందుకే మీకు ఈ పని బాధ్యత అప్పగిస్తున్నాం” అని అంటూ ఉంటారు. అంటే బాధ్యత అనేది ఒకరికి హామీ ఇవ్వడం కావచ్చు… ఒకరి దగ్గరి నుండి హామీ తీసుకుంటున్నట్టు కావచ్చు… అయితే ఇది బౌతికంగా కాదు భావనామాత్రపు హామీ కింద వ్యక్తిచేత ప్రకటితం అయ్యే భావన అవ్వవచ్చు.
బాధ్యత అంటే బరోసా కావచ్చు. ఒక వ్యక్తికి మరొక వ్యక్తి బరోసాగా మాటలు పని బాద్యతలు స్వీకరిస్తూ ఉంటారు.
సందర్భం బట్టి బాద్యత మాత్రం హామీ అనే భావన వచ్చే విధంగా ఉంటుంది.
ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు వర్డ్స్
తెలుగు పర్యాయ పదాలు వివిధ రకాలు