చాకచక్యం అంటే ఏమిటి?

చాకచక్యం అంటే ఏమిటి? చాకచక్యం పదానికి అర్ధం ఏమిటి? కొన్ని పదాలకు అర్ధం వ్యాక్యములు చదివితే బాగా అవగతం కావచ్చును. ఆపదలో ప్రదర్శించే తెలివిని చాకచక్యంగా చెబుతారు. అంటే ఆపద వంటి సంఘటనలలో వ్యక్తి ప్రదర్శించే చురుకుతనం చాకచక్యంగా చెబుతారు.

అంటే వాహనము నడిపే డ్రైవర్ ప్రమాదం ఎదురైనప్పుడు, ఆ ప్రమాదం నుండి వాహనమును, వాహనములోని ఉన్నవారిని రక్షించే ప్రయత్నంలో ప్రదర్శించే చురుకుతనం చాకచక్యం అనవచ్చును.

ఆపద కానీ కష్టకాలం కానీ సమయస్ఫూర్తితో రక్షణ చేసే తెలివిని ప్రదర్శించేవారి గురించి చెబుతూ అతను చాలా చాకచక్యం వ్యవహరించాడు అని చెబుతూ ఉంటారు. అతని చాకచక్యం వలననే మేమంతా ఆపద నుండి బయటపడ్డాం అని ఆపద నుండి బయటపడ్డవారు మాట్లాడుతూ ఉంటారు.

బుద్దిబలం ఉన్నవారు చాలా చాకచక్యంగా వ్యవహరించి కార్యములు నిర్వహించగలరు. తగు సమయానికి అనుకూలంగా కార్యచరణలో వ్యక్తి ప్రదర్శించే బుద్ది బలం కూడా చాకచక్యంగా చెబుతారు.

తెలుగువ్యాసాలు TeluguVyasalu