ధోరణి అంటే అర్ధం ఏమిటి?

ధోరణి అంటే అర్ధం ఏమిటి? ధోరణి పదమునకు అర్ధం తెలుసుకోవడానికి చూద్దాం. మనకు తెలుగు పదాలకు అర్ధం తెలుసుకునే ముందు మనకు ఇంగ్లీషు పదాలు బాగా అలవాటు ఉంటుంది కాబట్టి ధోరణి పదమునకు ఇంగ్లీషు మీనింగ్ చూస్తే…. ట్రెండ్….

సమాజంలో కొన్ని కొన్ని విదానాలు ప్రసిద్ది చెందుతూ ఉంటాయి. ఒక్కొక్క కాలంలో ఒక్కో విధానం ఎక్కువమంది అనుసరిస్తూ ఉంటే, ఒక్కొక్కసారి ఒక్కొక్కరి పద్దతిని అనుసరిస్తూ ఉంటారు…. ఇలా మార్కెట్లో ఎక్కువమంది ఆసక్తి చూపించడానికి కారణం అయ్యే విషయం కావచ్చును.

ఎక్కువమంది అనుకరించడానికి ఆసక్తిని కలిగిస్తూ ఎక్కువమంది దృష్టిని ఆకర్షించే విషయం చాలామందిలో వ్యాప్తి చెందుతుంది. అలా వ్యాప్తి చెందుతున్న విషయం ఒక ట్రెండుగా ఆంగ్లంలో పిలిస్తే, దానిని తెలుగులో ధోరణిగా భావిస్తారు.

అలాగే ధోరణి ఒక వ్యక్తి యొక్క పద్దతిని కూడా ఇలానే ధోరణిగా చెప్పవచ్చును. ఒక వ్యక్తి తనకు తెలిసిన వ్యక్తి విభిన్న పద్దతి గురించి మరొకరికి చెప్పడానికి… అతని ధోరణి వేరు అంటూ చెప్పబడుతుంటుంది. కావునా ధోరణి అనే పద్దతిగా కూడా భావించవచ్చును.

తెలుగులో వ్యాసాలు