జ్ఙాన సముపార్జన అంటే అర్ధం ఏమిటి? జ్ఙానం అంటే తెలిసి ఉండడం అయితే అర్జన అంటే సంపాదించడం అంటారు. అంటే విషయ విజ్ఙానమును సంపాదించుకొనుటగా చెబుతారు. వ్యక్తికి ఏ అంశంలో అమితమైన ఆసక్తి ఉంటే, ఆ అంశంలో సదరు వ్యక్తి జ్ఙానమును తెలుసుకోగోరుతాడు.
కొందరికి సామాజిక విజ్ఙానము అంటే, వారు సామాజిక స్థితిగతులపై పరిశీలన చేస్తూ చరిత్ర తెలుసుకుంటూ…. తమ జ్ఙానమును పెంచుకుంటూ ఉంటారు. కొందరికి సైన్సు అంటే ఆసక్తి… వారు సైన్సులో విజ్ఙానమును పెంచుకోవడానికి కృషి చేస్తూ ఉంటారు.
సమాజంలో వివిధ వ్యక్తులు వివిధ ఆసక్తులు ఉంటే, తమ ఆసక్తి మేరకు జ్ఙానమును సంపూర్ణంగా పెంచుకోవడానికి కృషి చేయడాన్ని జ్ఙాన సముపార్జన చేయడంగా భావిస్తారు. వారు పూర్తి పరిజ్ఙానం కలిగేవరకు కృషి చేస్తూనే ఉంటారు.
తెలుగు పదాలు వాటికి అర్ధాలు అంటూ శాస్త్రీయ నిర్వచనం చేయడం లేదు. కేవలం ఒక పదానికి ఆపాదించే బావము అర్ధం అయితే, పదం గురించిన అర్ధం గోచరించవచ్చును. కావునా శాస్త్రీ అర్ధమును తగు నిఘంటువును పరిశీలించండి.