మధువు మీనింగ్ ఇన్ తెలుగు

మధువు మీనింగ్ ఇన్ తెలుగు మధువు అంటే తేనే అంటారు. తెలుగు పదములు సందర్భమును బట్టి దాని భావము మారవచ్చును. మధు పానము అంటే తేనేను సేవించుట అని అర్ధము. ఇంక వ్యసనములలో అయితే మధువును మత్తు అందించే పానీయముగా కూడా చెబుతారు. ఇక్కడ మధుపానము అంటే మత్తు పానీయము సేవించువారు అని భావిస్తారు.

మితంగా స్వీకరించేది ఔషధం మాదిరి పనిచేస్తే, అపరిమితంగా స్వీకరించేది హానికరంగా పనిచేస్తుంది. కాబట్టి తేనేను కూడా పరిమిత మోతాదులో స్వీకరించడం ఔషధంగా ఉపయోగించడం అవుతుంది.

అలవాటు శృతిమించితే వ్యవసనం. మత్తుపానీయములు మొదట్లో ఆసక్తిని పెంచే అలవాటుగా ఉండి ఆపై వ్యసనంగా మారుతుంది. వ్యసనం బారిన పడడం అంటే జీవితం గతితప్పుతున్నట్టేనని అంటారు. మొత్తానికి మధువు అంటే తేనే అని లేక మత్తు పానీయము అని కూడా చెబుతారు.

మధువు పదమునకు పర్యాయ పదాలు అంటే మదిరము, మద్యపానము, మద్యము, మధుపానము, సారా, సారాయి తదితరములు.