ప్రేరణ తెలుగు పదము అర్ధము

ప్రేరణ తెలుగు పదము అర్ధము. తెలుగులో కొన్ని పదాలు అద్భుతమైన భావనను అందిస్తూ ఉంటాయి. అటువంటి పదాలకు అర్ధం తెలిస్తే చాలు మనసులో ఏదో తపన పుడుతుందని అంటారు. అటువంటి పదాలలో ప్రేరణ పదం కూడా ఉంటుందని అంటారు.

మనసుకు ఉత్సాహం కలిగించే విధంగా ఒక మాట కానీ ఒక దృశ్యం కానీ ఒక వ్యక్తి కానీ కారణం కావచ్చును. అంటే ఒక అంశములో ఒక విధానము అనుసరించి, దానిని సాధించాలి అనే ప్రక్రియ మనసులో మెదలడానికి ఒక దృశ్యం కానీ ఒక వ్యక్తి కానీ ఒక మాట కానీ ప్రేరణ కల్పించవచ్చును. ఒక ఆశయానికి మొదటిగా పుట్టే ఆలోచనకు మూలం ఎక్కడ పుడుతుందో, ఆ మూలానికి కారణం ఏదో అదే ప్రేరణగా పాల్గొనవచ్చును.

ప్రేరణ తెలుగు పదము అర్ధము

ఒక నాయకుడి మాట విన్నవారి మనసులో ఆలోచన పుట్టించవచ్చును.

గురువుగారి మాట శిష్యుడి మనసులో నాటుకోవచ్చును.

అమ్మమాట మనసులో మెదులుతూ ఉంటుంది.

నాన్న ఆశయం కొడుకుకి అనుసరించాలనే ఆలోచనను పుట్టించవచ్చును.

స్నేహితుడి ఆలోచన సహచరుడిని ప్రభావితం చేయవచ్చును.

ఒక మంచి సినిమా ప్రేక్షకుడిలో ఆలోచనలను సృష్టించవచ్చును. ఇలా ప్రకృతిలో ఏదో ఒక రూపంలో ప్రతి వ్యక్తి జీవితంలో ఏదైనా సాధనకు ప్రేరణ కల్పించవచ్చును.

పలువురిచేత గుర్తింపు పొందబడిన వ్యక్తిగానీ ప్రాచుర్య పొందిన నూతన వస్తువు కానీ నూతన సేవ కానీ ప్రకృతి నుండి ఒక వ్యక్తికి కల్పించబడిన భావన మూలం అయితే అటువంటి భావమునే ప్రేరణగా పాల్గొనవచ్చును.

ప్రేరణ తెలుగు పదానికి పర్యాయ పదాలు అంటే స్ఫూర్తి, చైతన్యవంతం, అనుసరణీయం, లక్ష్యం, ఊహ, ఆశయం, ఆదర్శం వంటి పదాలు చెప్పవచ్చును.

తెలుగు వ్యతిరేక పదాలు

ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు వర్డ్స్

తెలుగురీడ్స్.కమ్

తెలుగు పర్యాయ పదాలు వివిధ రకాలు

ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా

telugureads

బాధ్యత అంటే ఏమిటి?

పద్దతి తెలుగు పదానికి పర్యాయపదాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *