యద్భావం తద్భవతి అంటే ఏమిటి

మనిషి మనస్ఫూర్తిగా తలచిందే జరుగుతుందని చెప్పడానికి ఆద్యాత్మికంగా ఈ మాట ‘యద్భావం తద్భవతి’ అని పెద్దలు అంటూ ఉంటారు. యద్భావం తద్భవతి అంటే ఏమిటి? అర్దం చూస్తే ఏదైతే బలంగా భావిస్తావో అదే జరుగుతుంది…

మన సినిమాలలో కూడా డైలాగ్స్ వింటూ ఉంటాము… ఫిదా సినిమాలో హీరోయిన్ ‘గట్టిగా అనుకో…. అయిపోద్ది’ అంటూ ఉంటుంది… మనసులో బలంగా భావించే భావనలు మనసులో బలపడి మనసు చేత చేయించడానికి సమాయత్తమవుతూ ఉంటాయి….

యద్భావం తద్భవతి అను మాట చాలా విలువైనది. ఎందుకంటే మన చేసే పనులు వలన మనకు మనమున్న చోట ఒక గుర్తింపు వస్తుంది. అలా వచ్చిన గుర్తింపు జీవితాంతము కొనసాగుతుంటుంది… కావునా మంచి భావనలు మనసులో చేరితే, మంచి పనులు చేయాలనే తపన పుడుతుంది… లేకపోతే ఏదో కావాలనే తాపత్రయంతో మనసు చెదురుతుంది….

లోకం అద్దం వంటిది… నీ పనులను బట్టి నీకు మరలా ప్రతిఫలం అందిస్తూ ఉంటుంది…. నీ పనులు నీవు చూసే దృష్టిని బట్టి ఉంటాయి…. కావునా లోకాన్ని ఏవిధంగా చూడాలి… లోకంతో ఎలా మమేకం కావాలనే జ్ఙానము అందరికీ అవసరం… చదువుకుంటున్న కాలం అయినా…. చదువు అయిపోయాకా… జీవితం లోకం తీరుతోనూ, లోకాన్ని చూస్తున్న దృష్టి ఆధారంగా సాగుతూ ఉంటుంది. కాబట్టి యద్భావం తద్భవతి అంటే ఏవిధంగా లోకాన్ని నీవు పరిశీలిస్తున్నావో… ఆవిధమైన ఆలోచనలు పెరిగి, ఆ ఆలోచనలకు అనుగుణంగా లోకంతో మన సంబంధం ఉంటుంది…