శ్రావణమాసం మనకు పండుగలతో కొత్త ఉత్సాహం

శ్రావణమాసం మనకు పండుగలతో కొత్త ఉత్సాహం కలుగుతుంది. మన సంప్రదాయంలో ప్రతి నెలకూ ప్రత్యేకత ఉంటుంది. కానీ శ్రావణమాసంలోనే ప్రతియేడాది పండుగలు కొత్తగా ప్రారంభం అవుతున్నట్టుగా అనిపిస్తుంది. వర్షాకాలంలో వచ్చే పండుగలలో శ్రావణమాసంలోని పండుగల తర్వాత వినాయక చవితి నుండి శ్రీరామనవమి వరకు పండుగలు వరుసగా వస్తూనే ఉంటాయి.

చాంద్రమానం ప్రకారం శ్రావణమాసం ఐదవమాసంగా చెప్పబడుతుంది. ఈ శ్రావణమాసంలోనే మహిళలు వ్రతదీక్షలకు శ్రీకారం చుడతారు. చక్కగా మహిళల మహాలక్ష్మీ అవతారం ధరించినట్టేగానే ఉంటుంది.

ఈ మాసంలో పౌర్ణమి తిధినాడు, చంద్రుడు శ్రవణా నక్షత్రంతో ఉంటాడు. కాబట్టి ఈమాసానికి శ్రావణమాసంగా చెబుతారు.

ఇంకా శ్రవణా నక్షత్రమే శ్రీమహావిష్ణువుకు జన్మనక్షత్రం. కాబట్టి భర్త జన్మించిన నక్షత్రం కాబట్టి శ్రీమహాలక్ష్మీకి కూడా శ్రావణమాసం ప్రీతికరం అంటారు. ఈ శ్రావణమాసంలో వచ్చే మంగళవారాలు, శుక్రవారాలు పరమ పవిత్రంగా భావిస్తారు. తిధిలను బట్టి ఆయా వారాలలో వ్రతదీక్షలు ఉంటాయి. వాటి ఫలితాలు కూడా అద్భుతమేనని అంటారు.

కాబట్టి శ్రావణమాసం పవిత్రమైన మాసంగా చెప్పబడుతుంది. ఈ నెలలో మహిళల వ్రతదీక్షలు ప్రారంభం అవుతాయి. మహాలక్ష్మీ అమ్మవారి అనుగ్రహం సంపాదించడానికి శ్రావణమాసం మంచికాలం….

సంతోషం కలిగినప్పుడు మనస్ఫూర్తిగా ఆనందించగలిగే అవకాశం అమ్మవారి అనుగ్రహం ఉండడం వలననే ఉంటుందని అంటారు. మహాలక్ష్మీ అమ్మవారి అనుగ్రహం మీతో బాటు మీ కుటుంబ సభ్యులందరిపై కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ….

శ్రావణమాసం మనకు పండుగలతో కొత్త ఉత్సాహం ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు

telugureads