దీర్ఘకాల విరోధము మంచిది కాదు ఎక్కువ కాలం వైర భావన బలమైన శత్రువును తయారు చేస్తుంది. బలనమైన శత్రువు వలన వ్యక్తి, ఆ వ్యక్తిని నమ్ముకుని ఉన్నవారిపైనా పడుతుంది.
ధర్మాత్ములైనవారు మంచి వచనములే చెబుతారు. తమకు నష్టం జరుగుతున్నా సరే సామాజిక ప్రయోజనాలకు పెద్ద పీఠ వేస్తూ మంచి మాటలు పలుకుతూ ఉంటారు. అటువంటి మహానుభావులలో ధర్మరాజు గొప్పవానిగా కీర్తింపబడ్డాడు.
క్షత్రియ ధర్మం ప్రకారం రాజ్యాధికారిగా ఉండేకాలంలో రాజుగా ఉండాలి కాబట్టి శ్రీకృష్ణునితో ధర్మరాజు చెప్పే మాటలు చాలా ప్రశస్తమైనవి. యుద్ధం చేసుకుంటే జరిగే ప్రాణనష్టం ఎక్కువ. శాంతి వలన ప్రజలు సుభిక్షంగా ఉంటారు. నిత్యం ప్రజాక్షేమం ఆలోచించే ధర్మరాజు యుధ్దం కన్నా సంధియే మిన్నగా భావించాడు.
అందుకనే అర్ధరాజ్యం అడిగే హక్కు ఉన్నా అర్ధరాజ్యం ఇవ్వకపోయినా కనీసం ఐదూళ్ళు ఇచ్చినా చాలు సర్దుకుంటామని ధర్మరాజు చెప్పడం గమనార్హమైన విషయం. దీర్ఘకాల వైరం వలన ఒరిగేదేముంటుంది?
సర్దుకుపోతే శత్రువు కూడా మిత్రుడు అవుతాడు అని ధర్మరాజు కోణాన్ని బట్టి చూస్తే అర్ధం అవుతుంది. దుర్యోధనుడికి కూడా సర్దుకు పోయే గుణం ఉండి ఉంటే, భారతంలో యుద్దమే లేదు.
పగపెంచుకుంటే బంధువులు కూడా శత్రువులుగానే కనబడతారని ధుర్యోధనుడి దృష్టినుండి చూస్తే అర్ధం అవుతుంది. ధర్మరాజు ఎప్పుడూ శాంత దృష్టితో చూస్తే, ధుర్యోధనుడు ఎప్పుడూ రాజ్య కాంక్షతో, ఈర్శ్యతో ఉండడం వలనే యుద్ధానికి బీజాలు పడ్డట్టుగా చెప్పబడుతుంది.
ధర్మరాజు దృష్టితో ఆలోచనలు పెంచుకుంటే దీర్ఘకాలం శాంత స్వభావముతో ఉండవచ్చును. జీవితంలో శాంతి ఉండాలి. వ్యక్తి శాంతిగా ఉంటే, వ్యక్తిపై ఆధారపడ్డవారు శాంతంగా ఉంటారు.
ధర్మరాజు శాంతంగా ఉండడం వలన పాండవులంతా అడవులలోనే ఉన్నా, చాలా ప్రశాంతమైన జీవనం సాగించారని భారతం తెలియజేయబడుతుంది. శత్రుభావనతో ఉండే ధుర్యోధనాదులు అంత:పురంలో ఉన్నాసరే, మనసు అశాంతితోనూ పగతోనూ రగిలిపోవడం వలన చివరికి బంధుమిత్రులను పోగొట్టుకున్నారు.
దీర్ఘకాల విరోధం వ్యక్తి పతనానికి నాంది అయితే అది అతనిపై ఆధారపడివారిపైన కూడా పడుతుంది. కాబట్టి ఎప్పటికీ ఉండే, వైర భావన మంచిదికాదు. దీర్ఘకాల శత్రుత్వం పతనానికి పునాది అవుతుంది.
మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు
విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?
జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?
పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?
పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
0 responses to “దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం”