Telugu Bhāṣā Saurabhālu

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో మీరు ఊహించి రాయండి. గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారంటే, గొప్పవాళ్ళు కాకముందు, వారు ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉంటారు. మానవ సమాజంలో, ఎంతో మంది అలానే కష్టపడుతూ పైకి రావాలని ఆశిస్తారు. కావున వారు ఎన్నో మంచి ఉపయోగ పడే కార్యాలు చేస్తూ, సమాజానికి ఉపయోగపడుతూ ఉంటారు.

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు పూనుకుంటారు?

సాధన చేసే సమయంలో వారికి సహాయపడినవారికి తిరిగి సహాయం చేయాలని ఆలోచనతో ఉంటారు. అలా వారికి ఉపయోగపడుతూ మిగిలినవారికి కూడా సాయం చేయాలనే సత్సంకల్పం బలంగా ఉంటుంది. ఎందుకంటే సాధన చేయడానికి అవసరమైన తోడ్పాటు విలువ వారు గుర్తిస్తారు. తమలాగే ఆలోచించేవారి కోసం, వారికి ఉపయోగపడే జనుల మేలు కోసం, తాము లోకహితంమైన కార్యాలలో పాల్గొనటం చేస్తారు. అందరికీ సహాయపడటం అనేది గొప్ప ఆలోచన, కానీ వారు గొప్పకోసం చేయరు. వారు ఆలోచన గొప్పగా ఉండడం వలన వారి పనులు కూడా గొప్పగానే కొనియాడబడతాయి. ఇంకా కష్టపడి పైకి వచ్చినవారికి, తమలాగే కష్టపడి పైకి వచ్చేవారంటే మక్కువ ఎక్కువ… అలాంటి వారికోసం లోకహితమైన కార్యాలు చేస్తూ ఉంటారు. కష్టం విలువ తెలిసినవారు శ్రామికుల కష్టాలను గుర్తించినట్టే. ఏదైనా సాధించడానికి లక్ష్యం ఉన్నవారి యొక్క స్థితి గురించిన ఆలోచన కూడా గొప్ప గొప్ప విజయాలు సాధించినవారికి తెలుస్తుంది. కాబట్టి తమలాగా మంచి సంకల్పం గలవారికి ఎటువంటి అడ్డంకులు రాకూడదని లోకహితమైన కార్యాలకు పూనుకుంటారు. మంచి ఆలోచన నుండి మంచి పనులు ప్రారంభం అవుతాయి. సమాజం గురించి మంచి అవగాహన ఉండడం గొప్పవారికే సాధ్యం. అలా గొప్పవారి మంచి ఆలోచనల నుండి మంచి పనులు ప్రారంభం అయి, అవి అందరిచేత మన్ననలు పొందుతాయి. గొప్ప లోకహిత కార్యములుగా కీర్తిని పొందుతాయి. వాటిని ప్రారంభింనవారికి కీర్తిని ఆపాదిస్తాయి.

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం? జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు? దానం గురించి దానం గొప్పతనం సన్మాన పత్రం ఇన్ తెలుగు వేచి ఉండడాన్ని నిర్వచించండి పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి? పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి? అవతారం అర్థం ఏమిటి తెలుగులో తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు లీడర్ అంటే ఎలా ఉండాలి ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి? ప్రేరణ తెలుగు పదము అర్ధము గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి? నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

0 responses to “గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Go to top