శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా ఉపయోగపడుతాయో విశ్లేషించి రాయండి. మనకు తెలుగు శతకాలు వేమన శతకం, సుమతీ శతకం తదితర శతకాలు చాలా ప్రసిద్ది. కవులు రచించిన శతకాలు లేదా కవుల చేత చెప్పబడిన శతకాలు వారి వారి దృష్టికోణంలో సామాజిక స్థితిగతులకు అద్దం పడుతూ ఉంటాయి.

ఇంకా వారి దృష్టికోణంలో సమాజంలో వారికెదురైన వివిధ వ్యక్తుల స్వభావం లేదా వారు గమనించిన మనో ప్రవృత్తులపై కూడా కవుల సామాజిక దృష్టి ప్రభావితం అవుతూ, సామాజిక స్థితిని తెలియజేసే అవకాశం ఉంటుంది.

సమాజంలో ఉండే వివిధ వ్యక్తులలో ఉండే వివిధ గుణాలు సమాజంలో ఉండే ఇతరులపై ప్రభావం చూపుతుంటాయి. కావునా మంచి గుణములు గల వ్యక్తుల వలన వారి చుట్టూ ఉండేవారిపై ప్రభావం పడుతుంది. అలాగే చెడు గుణముల గల వ్యక్తుల వలన కూడా వారి ప్రభావం ఇతరులపై ఉండే అవకాశం ఉంటుంది.

శతక పద్యాలు నీతిని సూచిస్తాయి.

మంచి పురుషుల వలన మంచి ప్రవర్తన అంటే ఇతరులకు ఆసక్తి కలగవచ్చును. చెడు గుణములు గలవారి వలన చెడు విషయాలు వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండవచ్చును. కావునా మంచి చెడు ప్రభావములు వ్యక్తుల స్వభావమలు బట్టి సమాజంపై పడుతుంటే, అటువంటి సమాజంలో నివసించే మనపై కూడా సామాజిక దృక్కోణం నుండి మన మనసు ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది. అలా సహజంగా ఉండే మంచి-చెడు గుణముల గురించి, స్వభావాల గురించి తెలుగు శతకాలు చక్కగా చెబుతూ ఉంటాయి. కావునా శతక పద్యాలలోని నీతులు నిత్య జీవితంలో మార్పు కొరకు ప్రయత్నం చేసేవారికి బాగా ఉపయోగపడవచ్చును.

చూడటానికి అంతా ఒక్కటే అన్నట్టుగా లోకం కనబడుతుంది. కానీ పరిచయం పెరుగుతున్న కొలది వివిధ భావనలు వ్యక్తపరిచే సమయంలో వ్యక్తుల స్వభావం బయటపడుతుంటుంది. సమాజంలో అందరూ ఎవరో ఒకరితో అనుబంధం ఉంటే, అప్పుడప్పుడు పరిచయం అయ్యేవారు కూడా ఉంటారు. అలా పరిచయం అయ్యేవారి నుండి ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో అవగాహనకు శతక పద్యాలలో నీతులు ఉపయోగపడవచ్చును.

వ్యవస్థలో వివిధ గుణముల గురించి, వాటి ఫలితాల గురించి ముందుగానే ఒక వ్యక్తి సరైన అవగాహన ఉంటే, అతను ఆయా గుణముల గల వ్యక్తుల నుండి ఎదురయ్యే స్థితిగతుల గురించి అవగాహన ఉండే అవకాశం ఉండవచ్చును. తెలుగు శతక పద్యాలు నీతులు గురించి బాగుగా సూచిస్తాయి.

ఉదాహరణకు ఈ క్రింది వేమన శతక పద్యం చూడండి!

ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు
చూడ చూడ రుచులు జాడ వేరు
పురుషులందు పుణ్య పురుషులు వేరయా
విశ్వదాభిరామ, వినుర వేమా!

పై తెలుగు వేమన శతక పద్యంలో వేమన అంటున్నారు. ”ఉప్పు మరియు కర్పూరం ఒకే రంగులో ఉంటాయి కానీ వాటి రుచులు వేరుగా ఉంటాయి. అలా ఉప్పు, కర్పూరం ఒకేవిధంగా కనబడుతున్నట్టుగానే మనుషులంతా ఒకేవిధంగా కనబడతారు కానీ వారి వారి గుణములను బట్టి ఉత్తములు వేరుగా ఉంటారని అంటారు. అంటే సమాజంలో ఉండే వివిధ వ్యక్తుల స్వభావాలు వివిధ రకాలుగా ఉంటుందని ఈ పద్యం సూచిస్తుంది.

అలాగే ఈ క్రింది తెలుగు శతకం సుమతీ శతకంలోని తెలుగు పద్యం గమనించండి!

వినదగు నెవ్వరుచెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
కనికల్ల నిజము దెలిసిన
మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతీ!

ఎవ్వరూ చెప్పినా వినవచ్చును. కానీ విన్నవెంటనే తొందదరపడవద్దు…. విన్న విషయంలో వాస్తవం పరిశీలించి ప్రవర్తించడం శ్రేయష్కరం అని అంటున్నారు. ఈ పద్య భావం మనసులో బాగా ఉంటే, తొందరపాటు చర్యలు అలవాటుపడవు. అందువలన కార్య నిర్వహణ శక్తి బాగుంటుందని అంటారు.

సమాజంలో వ్యక్తి ప్రవర్తనకు సమాజం మరియు సమాజంలోని వ్యక్తుల ప్రవర్తన కారణం అవుతున్నప్పుడు, సామాజిక స్థితులను, సమాజంలోని వివిధ స్వాభావిక గుణాలు గురించి తెలియజేసే తెలుగు శతకాల నీతులు బాగుగా ఉపయోగపడతాయని చెప్పవచ్చును.

తెలుగురీడ్స్

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు