వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

వ్యక్తి శరీరంలోనే అనేక వ్యవస్థలు ఉంటాయి. జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ… తదితర వ్యవస్థలు. ఇలా వ్యక్తి శరీరంలో ఉండే అన్ని వ్యవస్థల పనితీరు సక్రమంగా ఉంటేనే, ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఆయుష్సు ఉన్నంతవరకు జీవించగలడు. లేకపోతే ఆ వ్యక్తి అనారోగ్యపాలు అవుతాడు… అలాగే సమాజం కూడా అనేక వ్యవస్థలతో కలిసి ఉంటుంది. వ్యక్తిలో వ్యవస్థల మాదిరిగానే, సమాజంలో వ్యవస్థల పనితీరు సమాజంపై పనిచేస్తుంది… ఇటువంటి వ్యవస్థ అంటే ఏమిటి… వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం.

ఒకప్పుడు రాచరిక వ్యవస్థ ఉంటూ, రాజు అధికారిగా ఉండే కాలంలో, రాజుకు రాజ్యాధికారం అప్పగించేముందు, ఆ రాజ్య పెద్దలు… రాజును యువరాజు కాకముందే అన్ని రకాలు పరిక్షించి, అతనికి విద్యాబుద్దుల చెప్పి, సకల శాస్ర్రపరిజ్ఙానం అందించేవారని, సకల శాస్త్రములు చదివిన వ్యక్తి బుద్దికుశలతతో రాజ్యంలోని ప్రజలను పిల్లల మాదిరిగానే భావించి, చక్కగా పాలించేవారని చరిత్రకారులు లేక ప్రవచనకారులు చెబుతూ ఉంటారు. అయితే కాలంలో రాజ్యవ్యవస్థలో రాజు నియంతృత్వ పోకడల పెరగడం వలన రాజుల కాలం నుండి ప్రజాస్వామ్య వ్యవస్థగా రూపాంతరం చెందిందని అంటారు.

ఒకప్పటి కాలంలో ఒక దేశం వారు ఇంకొక దేశపు పాలకుల పాలనలో ఉండేవారు… తర్వాతి కాలంలో ఎవరికివారికే స్వాతంత్ర్యం లభించడం జరిగింది… ఇలా స్వాతంత్ర్యం పొందిన దేశాలలో భారతదేశం కూడా ఉండడం జరిగితే మనకు స్వాతంత్ర్యం లభించింది… ఆగష్టు 15, 1947 అయితే…. పాలనా పరంగా మన రాజ్యంగం అమలులలోకి వచ్చనది జనవరి 26, 1950…. అలా గణతంత్ర దినోత్సవం మన భారతావనిలో జరుపుకుంటున్నాము.

రాజ్యంగ వ్యవస్థ వలన వ్యక్తి స్వేచ్ఛ హరించకుండా

అయితే పరుల పాలన నుండి స్వేచ్ఛ కోసం పోరాడి… మరలా మనపై మనవారిలో ఒకరికి పెత్తనం కట్టబెట్టే ఈ రాజ్యంగ వ్యవస్థ ఏమిటి? ఈ ప్రశ్న సహజంగానే పుట్టవచ్చును… అయితే ఇష్టారీతిని జీవించడంలో బలవంతుడు బలహీనుడిని పడగొట్టవచ్చును… అది శరీర బలంతో కావచ్చును. ధన బలంతో కావచ్చును. అధికార బలంతో కావచ్చును… కావునా వీటిని సమన్వయపరుస్తూ…. సామాన్యుడు సైతం తన పరిధిలో తాను స్వేచ్ఛగా జీవించగలిగే ఏర్పాటు రాజ్యంగ వ్యవస్థ అందిస్తుంది.

ఇతరుల జోలికి పోకుండా తనకున్న ఆస్తిని కానీ, తనకున్న మాట శక్తిని కానీ, తన కున్న అంగ బలము కానీ, తనకున్న ధన బలమును కానీ ఉపయోగించుకుంటూ… మరొక వ్యక్తి స్వేచ్ఛను హరించ కుండా ఉండే విధంగా వివిధ రకాల సెక్షన్ల ద్వారా రాజ్యాంగం రక్షణ కల్పిస్తుందని అంటారు.

వ్యక్తిగతంగానూ, వ్యవస్థాగతంగానూ శాంతిభద్రతలకు భంగం కలగకుండా కాపాడే రక్షణ వ్యవస్థల వంటి అనేక వ్యవస్థలను నియంత్రించే రాజ్యంగ వ్యవస్థను రక్షించే వ్యవస్థలుగా న్యాయవ్యవస్థ, పార్లమెంట్ వ్యవస్థ వంటి తదిరత వ్యవస్థలు కీలక పాత్రను పోషిస్తాయి.

ఒక వ్యక్తిపై ఒక వ్యక్తి సంరక్షకుడిగా ఒక కుంటుంబలో ఉన్నట్టే, ఒక వ్యవస్థపై మరొక వ్యవస్థ సంరక్షణ వ్యవస్థగా సమాజంలో ఉంటుంది.

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం
వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

కుటుంబంలోని ఎదుగుతున్న పిల్లల సంరక్షణ బాద్యత, ఆకుటుంబ పెద్ద చేతిలో ఉన్నట్టే… సమాజంలో కార్యకలాపలు నిర్వహించే వ్యవస్థలపై కొన్ని వ్యవస్థల నియంత్రణ ఉంటుంది. నియంత్రించే వ్యవస్థలపై నియంత్రణ ఉండే వ్యవస్థలుగా పార్లమెంట్ మరియు న్యాయ వ్యవస్థలు కీలకం…

ఒక వ్యక్తి నిర్ణయం ఆ వ్యక్తి మరియు ఆ వ్యక్తికి సంబంధించిన కుటుంబంపై ప్రభావం చూపితే, ఒక వ్యవస్థ నిర్ణయం… ఆ వ్యవస్థపై, ఆపై ఆ వ్యవస్థలో ఉండే ఉద్యోగులపై, ఆ వ్యవస్థకు సంబంధించిన వ్యవస్థలపై… ఆ వ్యవస్థ ఉన్న సామాజిక పరిస్థితులపై ప్రభావం చూపగలవు… కావునా వ్యవస్థాగత నిర్ణయాల కొరకు సదరు వ్యవస్థల కమిటీలు ఉంటాయి… కమిటీలలో నిపుణుల సలహాలను స్వీకరిస్తూ, నిర్ణయాలు తీసుకోవడం వ్యవస్ధాధికారుల తీసుకుంటూ ఉంటారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆర్దిక అసమానతలను తగ్గించడానికి ప్రభుత్వ వ్యవస్థల పనితీరు ఉంటే, వాటిని అమలు చేసే పాలక వ్యవస్థ ఉంటుంది.

ఇలా ఏదైనా ఒక వ్యవస్థ భవిష్యత్తు సామాజిక ప్రయోజనాలే పరమార్ధంగా ప్రణాలికలు కలిగి ఉంటాయి. వాటిని అమలు చేయడంలో ఆయా వ్యవస్థలలో అధికారుల పాత్ర కీలకంగా ఉంటుంది.

వ్యక్తిగత, వ్యవస్థాగత రుణాలు ఇచ్చే బ్యాంకింగ్ వ్వవస్థ….

ఆర్ధిక స్థితిని లెక్కకట్టే ఆదాయపు పన్ను వ్యవస్థ…

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం
వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

వాణిజ్య పను నిర్వహించే వ్యాపార వ్యవస్థలు… అనేక వ్యవస్థలు వ్యవస్థాగతంగా మంచి భవిష్యత్తు కోసం ప్రణాలికలు రచిస్తూ, వాటిని అమలు పరుస్తూ…. సామాజిక అభివృద్ది కొరకు పాటుపడతాయి…

వ్యవస్థలపై నియంత్రణాధికారం ప్రజల ద్వారా రాజకీయ నాయకులకు లభిస్తూ ఉంటుంది.

అయితే వ్యవస్థలపై పట్టు ఉన్న నాయకులు కానీ, అధికారలు కానీ తప్పుదారి పడితే, సమాజంలో వ్యవస్థలు గాడి తప్పుతాయి…

నియంత్రణాధికారం నియంతృత్వ పోకడలకు పోకుండా ఉండేందుకు ప్రతి అయిదేళ్లకు ఒకమారు జరిగే ఎన్నికలు, రాజకీయ నాయకుల పనితీరుకు పరీక్ష వంటివి. ఇక్కడ న్యాయమూర్తులు ప్రజలే… వారు ప్రతి ఐదేళ్ళకు ప్రభుత్వ పనితీరును చూసి, తర్వాత అధికారం ఇవ్వాలో వద్దో నిర్ణయించుకుని తమ నిర్ణయం ఓటు ద్వారా తెలియజేస్తూ ఉంటారు.

అలా అందరి ఆలోచనలు ఒకేలాగా ఉండవు కాబట్టి మెజారిటీ ఓట్ల ప్రకారం రాజకీయ నాయకుడి గెలుపును ఎన్నికల వ్యవస్థ ప్రకటిస్తుంది. ఆ ప్రకారం ఒక రాజకీయ నాయకుడి పనితీరు ప్రతి ఐదేళ్ళకు పరీక్షకు గురవుతుంది.

ఇలా సమాజంలో అనేక వ్యవస్థలు, ఆ వ్యవస్థలపై అధికారం ఉండే ప్రభుత్వ వ్యవస్థలు… ఆ ప్రభుత్వ వ్యవస్థలపై నియంత్రణాధికారం ఉండే రాజకీయ పార్టీల భవిష్యత్తును నిర్ణయించే అధికారం ప్రతి ఐదేళ్లకు ప్రజల చేతికి వస్తుంది.

అంటే వ్యక్తిగా మన సమాజం,మన వ్యవస్థలు ఏరకంగా ముందుకు వెళ్ళాలో మన ఓటు ద్వారా మన రాజకీయ పార్టీలకు ఓట్లు వేసి గెలిపిస్తున్నప్పుడు, మన భవిష్యత్తుకు మనమే ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నామో… ఓటు వేసే సమయంలో ఆలోచించాలని పెద్దలంటారు.

వ్యవస్థ అంటే ఏమిటి… సామాజిక, వ్యక్తిగత భవిష్యత్తు ప్రయోజనాల కొరకు వర్తమానంలో తప్పులను సరిదిద్దేందుకు ఒక వ్యవస్థ ఉంటే, సదరు వ్యవస్థ పనితీరును గమనించే మరొక వ్యవస్థ ఉంటే, వ్యవస్థలో వ్యక్తుల తప్పులను ఎంచే వ్యవస్థ ఒక్కటి ఉంటే, ఎంచిన తప్పులకు శిక్షలు విధించే వ్యవస్థ మరొకటి ఉంటే, విధించిన శిక్షను అమలు చేసే ఇంకొక వ్యవస్థ…. ఇలా వ్యవస్థ ఏది అయినా భవిష్యత్తు ప్రయోజనాల కొరకు ప్రస్తుత కాలపు ప్రయోజనాలను రక్షిస్తూ, వాటిని నియంత్రించేవిగా ఉంటాయి….. వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల వలన మనకు మేలు జరుగుతూ మన భవిష్యత్తు సామాజిక ప్రయోజనార్ధం కృషి చేస్తూ ఉంటాయి.

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు