By | July 10, 2024
నేటి సమాజంలో ఉపాధ్యాయుని ప్రభావం

నేటి సమాజంలో ఉపాధ్యాయుని ప్రభావం! విద్యాలయంలో విద్యను బోధించే ఉపాధ్యాయుడి ప్రభావం ప్రతి వ్యక్తిపై బాల్యంలోనే పడుతుంది. ఉపాధ్యాయుడు ఏమి విద్యార్ధులకు బోధిస్తాడో, విద్యార్ధులు దానిని మనసులో పెట్టుకునే ప్రయత్నం చేస్తారు.

అంతకన్న ముందు ప్రతి వ్యక్తికి అప్యాయతను, అమృతమైన ప్రేమను పంచే అమ్మ తొలి గురువుగా ఉంటుంది. తర్వాత తండ్రి ఆదర్శవంతంగా గురువుగా ఉంటాడు. ఇది ఇప్పటి నుండి ఉంది కాదు. పురాణాలలో కూడా మనకు ఋషుల సంప్రదాయం గమనిస్తే కనబడుతుంది. వ్యాసుడు, పరాశరుడు, శక్తి, వశిష్ఠుడు… అలా తండ్రి గురువుగా ఉన్నట్టుగా ప్రాచీన సంప్రదాయం ఉంది. అయితే ఋషి సంప్రదాయం అంతా ఆద్యాత్మికంగా ఉంటుంది. గురువు ఉపదేశిస్తే, చాలు శిశ్యుడు విజ్ఙాన సముపార్ఝను కృషి చేసేవారని అంటారు.

తర్వాతి కాలంలో విద్య పుస్తకాల రూపంలో ఉండి, ఆచరణకు దూరంగా ఉండడం చేత, ప్రత్యేకంగా గురువు అవసరం… ప్రస్తుత కాలంలో ఎన్నెన్నో విద్యలు వివిధ విభాగాలు మారిపోవడం, ప్రతి విషయంలో ప్రత్యేక కోర్సులు రావడం… ఇలా విద్య నూతన విధానంతో సాంకేతిక రూపంలోకి మారడం జరుగుతుంది. గురువు లేకుండా కూడా విషయాలను తెలుసుకునేంతగా నేడు సాంకేతిక విజ్ఙానం పెరిగింది.

అంతెందుకు మహాభారతంలో కూడా ఏకలవ్యుడు గురువు దగ్గర ప్రత్యక్షంగా కాకుండా, పరోక్షంగా ద్రోణాచార్యుని విగ్రహం ముందు సాధన చేసి, విశేషమైన ధనుర్విద్యను అభ్యాసం చేసి, విశేష ప్రతిభను కనబరిచాడు. కానీ గురువు దగ్గర అభ్యాసం లేని కారణంగా, ఆ విద్య దుర్వినియోగం అవుతుందనే వాదన ఉంటుంది.

అందుకే ఎంత సాంకేతికంగా విషయాలు తెలుసుకునే సౌకర్యం ఉన్నా, గురువు దగ్గర క్రమశిక్షణతో విద్యను అభ్యసించడం చాలా చాలా ప్రధానమని పెద్దలు చెబుతారు. కావునా ఉపాధ్యాయుని పాత్ర చాలా ప్రధానం.

విద్యార్దిఎల్.కె.జి నుండి అక్షరాలను, అంకెలను గుర్తించడం దగ్గర నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో ఒక విషయంపై లోతైన అధ్యయనం చేసేవరకు ఉపాధ్యాయుని బోధన ప్రభావం అతనిపై ఉంటుంది.

నేటి సమాజంలో ఉపాధ్యాయుని ప్రభావం విద్యార్ది పై హైస్కూల్ విద్యా సమయంలో బాగా పడుతుంది. ఎందుకంటే, ఆ సమయంలోనే విద్యార్ధి స్యయంగా ఆలోచన చేయడానికి అలవాటు పడతాడు. విషయాలు తెలుసుకునే ఆసక్తి కనబరచే సమయం కూడా అదే.

కాబట్టి నేటి సమాజంలో విద్యార్ధికి బోధించే విషయాలు విద్యార్ధి ఆలోచనలపై ప్రభావం చూపగలవు.

ఇప్పుడు సాంకేతిక విజ్ఙానం మరియు పరికరాలు అందుబాటులో ఉండడం వలన, ఉపాధ్యాయుడు చెప్పే బోధనాంశాలపై విద్యార్ధికి వచ్చే సందేహాలకు సమాధానాలు కనుగొనడం తేలిక…

అందుకే విద్యార్ధి వాస్తవికత, విషయంపై సమగ్ర అవగాహన కల్పించగలిగితే, నేటి సమాజంలో విద్యార్ధులు అనేక అంశాలలో నైపుణ్యతను సాధించగలరు.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరు?

నేటి నీ కృషి రేపటికి నీకు

అబద్దం చెప్పిన వారి విలువను తగ్గిస్తుంది?

అభివృద్దికి ఆటంకాలు అంటే ఏవి?

అసత్య ప్రచారాలు వాస్తవాలు గురించి

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు