By | August 8, 2024
పాఠశాల గురించి తెలుగులో వ్యాసం

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి? వ్యక్తి జీవితంలో పాఠశాల ఒక గుడి వంటిది. ఎందుకంటే వ్యక్తి జీవితంలో సాధించిన అభివృద్దికి పునాది పడేది, పాఠశాలలోనే. ఒక వ్యక్తి సమాజంలో గొప్ప పారిశ్రామికవేత్త అయితే, అందుకు అతనికి పునాదులు పడేది పాఠశాలలోనే. మరొక వ్యక్తి మంచి వైద్యుడిగా పేరు సంపాదిస్తే, అందుకు అతనికి పునాది పాఠశాలలోనే. ఇంకొకరు ఒక ఐఏఎస్ అధికారి అయితే, అందుకు పాఠశాల విద్య, అందులో క్రమశిక్షణ అతనికి పునాది… కావునా సమాజంలో ఉన్నత స్థితికి వెళ్లిన ఎవరిపైనా అయినా పాఠశాలలోనే పునాదులు పడతాయి.

వ్యక్తి జీవితంలో ఆర్ధిక అవసరాలు తీరడానికి మరియు సంఘంలో ఒక హోదాను సంపాదించుకోవడానికి విద్య అవసరం అయితే, అందుకు పునాదులు పడేది పాఠశాలలోనే.

ఉన్నవారు, లేనివారు, హోదాలు, కులమతాలకు సంబంధం లేకుండా పిల్లలందరూ కలిసిమెలిసి ఉండే పవిత్రమైన ప్రదేశం పాఠశాలం. కాబట్టి పాఠశాలలో క్రమశిక్షణ, వినయం, విద్య అనేక విషయాంలో జ్ఙానం వ్యక్తి కలగడానికి పునాది పాఠశాల.

పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

ఇప్పుడు జ్ఙానం ఎక్కడ కావాలంటే అక్కడే సాంకేతిక పరికరాల సాయంతో తెలుసుకోవచ్చును కానీ క్రమశిక్షణతో కూడిన విద్య నేర్చుకోవాలంటే మాత్రం పిల్లలు పాఠశాలకే వెళ్లాలి. ఎందుకంటే పాఠశాలలో విద్యార్ధులంతా ఒకే తరగతిలో ఒకే విధంగా కలిసిమెలిసి ఉంటారు. వారిలో సమైక్యభావననే ఉపాధ్యాయుడు బోధిస్తారు. కాబట్టి రేపటి సమాజంలో మంచి వ్యక్తులుగా ఎదగడానికి, నేడు పిల్లలు పాఠశాలకు వెళ్లాల్సిందే.

పాఠశాలలో చెప్పే నీతికధలు ఎవరో ఒకరిపై మంచి ప్రభావం చూపి, అతను రేపటి సమాజంలో మంచి విలువలు గల నాయకుడుగా మారవచ్చును. అప్పుడు అతని వలన సమాజంలో శాంతి, మార్గదర్శకత్వం ఉంటాయి.

చారిత్రక అంశాలు, చరిత్రను మార్చిన నాయకులు గురించి పాఠశాలలో బోధిస్తారు. అందువలన ఎవరో ఒకరు ప్రభావితం అయి, ఏదో ఒక సామాజిక సమస్యకు పరిష్కారమే అందించేస్థాయికి చేరవచ్చును.

ఇతిహాసములలోని విషయాలు కూడా పాఠశాలలో బోధిస్తారు. అందువలన ఎవరో ఒకరు ప్రభావితం కాబడి సమాజంలో మత సామరస్యం పెంచగలిగే స్థాయిలో తాత్వికవేత్తగా మారవచ్చును.

అందుకే పిల్లలు పాఠశాలకు వెళ్లడం వలన పాఠశాలలో బోధించే విషయాలకు పిల్లలు ప్రభావితం అవుతారు. ఇంకా క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తారు.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు