By | October 12, 2021

తెలుగులో బమ్మెర పోతన గురించి రాయండి. ఈయనను బమ్మెర పోతనామాత్యులుగా పండితులు ఎక్కువగా సంభోదిస్తూ ఉంటారు. పోతనామాత్యులు గారికి సహజ పండితుడు అను బిరుదు కూడా కలదు. ఈయన రచించిన భాగవతం కాసుల కోసమని రాజులకు అంకితం ఇవ్వలేదు.. తన మనసంరాజ్జ్యంలో కొలువై ఉన్న రాముడికే అంకితమిచ్చాడు. ఎటువంటి ప్రలోభాలకు కానీ బెదిరింపులకు కానీ లొంగలేదు… ఈ రామభక్తుడు.

బమ్మెర పోతరాజు పోతనగా బాగా పరిచయం కలిగిన పేరు. కారణం ఈయన రచించిన శ్రీమద్భాగవతం భక్తులపాలిట కల్పవృక్షం. అయితే ఈ భాగవతం సంస్కృతంలో వ్యాసుడు రచించాడు. ఆ సంస్కృతంలో ఉన్న భాగవతం తెలుగులో తెలుగువారికి అందించాలనే శ్రీరాముడు తలంపును పోతన స్వీకరించాడు. సహజ పాండిత్యం కలిగిన పోతనామాత్యులు భాగవత అనువాదం తెలుగులో రచన చేసారు.

ఈయన రచించిన భాగవతంలో పద్యాలూ ఎప్పటికి భక్తుల పాలిట కల్పవృక్షమే అంటారు. ఎందుకంటే ఈయన రచించిన భాగవతం అప్పటి సాదారణ వాడుక భాషలో వాడె పదప్రయోగాలూ ఎక్కువ అని అంటారు.

“అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె
ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్….”

“ఇందు గలఁ డందు లేఁ డని
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెం దెందు వెదకి చూచిన
నందందే కలఁడు దానవాగ్రణి! వింటే.”

చాలా చాలా ప్రసిద్ది చెందిన పోతనగారి పద్యాలు పడుకోవడానికి బాగుంటాయి… ఇంకా అనుషంగికంగా పుణ్యమును కూడా కట్టబెడతాయని పండితుల మాట.

గజేంద్ర మోక్షం, ప్రహ్లాదోపాఖ్యనం, అజామిలోపాఖ్యానం, దక్షయజ్ఞం, శ్రీకృష్ణ లీలలు తదితర ఉపాఖ్యానాలు భాగవతంలో చాలా ప్రసిద్ది… ఇవి వింటూ భక్తులు తరిస్తూ ఉంటారు… వీటిని చదువుతూ తరిస్తూ ఉంటారు… బమ్మెర పోతన తెలుగులో అందించిన భాగవతం ఇలా ప్రజలకు శాంతిని అందిస్తుందని అంటారు.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు