దీపావళి పండుగ ఎప్పుడు ఎందుకు చేసుకుంటారు. దీపావళి పండుగ ప్రతియేడాది తెలుగు పంచాంగం ప్రకారం ఆశ్వయుజ అమావస్యనాడు వస్తుంది. ఇంగ్లీషు కేలండర్లో ఒక్కోయేడాది ఒక్కో తారీఖున వస్తుంది. అయితే ఎక్కువగా నవంబర్ మాసంలోనే ఈ దీపావళి పండుగ వస్తుంటే, దీపావళి ఎందుకు చేసుకుంటారు?
పురాణ ప్రవచనాలు లేదా పురాణ కధనాలు ప్రకారం నరకాసురుని వధించిన తర్వాతి రోజు లోకాన్ని పట్టి పీడించిన నరకాసురుడు మరణం సందర్భంగా సాధు జనుల సంతోషంగా దీపాలను వెలిగించి పండుగ జరుపుకుంటున్నట్టుగా చెబుతారు. లోకకంఠకుడుగా మారితే కన్నతల్లే సంహరిస్తుంది… కాబట్టి లోకాన్ని పీడించేవిధంగా మారకు ప్రకృతి స్వరూపమైన మాత సైతం లోకాన్ని పీడిస్తే, కన్న కొడుకైనా క్షమించదనే భావన ఈ నరకాసురుడి వధ ద్వారా తెలియబడుతుందని అంటారు. ఇది ద్వాపరయుగంలో జరిగినది చాలా ప్రసిద్దమైనది.
దీపం వెలుగును వెదజల్లుతుంది. మనసు ఆజ్ఙానంతో కూడి ఉంటే, అది అమావాస్య మాదిరిగా ఉంటుంది. అదే మనసులో జ్ఙానమనే దీపం వెలిగిస్తే, అమావాస్యరోజున వెలిగించిన దీపం ఎలా కాంతిని వెదజల్లుతుందో? అలాగే మనసులో జ్ఙానదీపం వెలిగిస్తే, అది లోపల ఉండే అజ్ఙానాన్ని పటాపంచలు చేస్తుందని తాత్విక బోధ చేస్తూ ఉంటారు.
మనిషిలో విషయ పరిజ్ఙానం పెంచుకోవడంలోనూ, కోరిక తాపత్రయం పెంచుకోవడంలోనూ ప్రధాన పాత్ర మనసు అయితే అటువంటి మనసు దీపం వంటిది అని అంటారు. తెలిసి దీపాన్ని ముట్టుకున్నా కాలుతుంది. అలాగే తెలియక దీపాన్ని ముట్టుకున్న కాలుతుంది. మనసు కూడా అంతే దానిని జ్ఙానమనే నేత్రంతో చూడడం అలవాటు చేసుకుంటే, అది జ్ఙానాన్ని మరింతగా వెదజల్లుతుంది. అజ్ఙానమనే విషయాలతో మగ్గితే, అజ్ఙానంతోనే అలమటిస్తుంది. కాబట్టి జీవన పరమార్ధం అయిన మనోవిజ్ఙానం పెంపొందించుకోవాలని చెబుతూ ఉంటారు.
కుటుంబ జీవనంలో మనిషికి ఏర్పడిన బంధాలతో సహజీవనం చేస్తూ, పరమార్ధిక విషయంవైపు దృష్టి మరల్చేలాగా అంత:దృష్టిని ఏర్పరచుకోవాలని తాత్వికులు చెబుతూ ఉంటారు. అలా దీపావళి జ్ఙాన దీపానికి ప్రతీకగా చెబుతారు.
ఇంకా దీపాలలో వాడే తైలం వలన కూడా ప్రకృతికి మేలు అంటారు. దీపావళి పండుగ రోజున వెలిగించే దీపాల వరుస కార్తీకమాసం అంతా కంటిన్యూ చేసేవారు ఉంటారు.
చలికాలంలో తైల దీపాలు వెలిగించడం కూడా శాస్త్ర ప్రకారం మేలైన విషయంగా చెబుతూ ఉంటారు.
దీపావళి గురించి వీకీ చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
వాతావరణం మారే రోజులలో దీపావళి పండుగ గురించి కొందరి అభిప్రాయాలు రీడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
తాత్విక చింతన దీపావళితో ఆరంభం తాత్విక వ్యాసం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
పండుగ సరికొత్త ఉత్సాహం తెస్తుంది.
ఒక సంవత్సరంలో వచ్చే పండుగ ఏదైనా కొత్త వస్తువులు కొత్త విధానం కొత్త బట్టలు అన్నట్టుగా వ్యక్తి దైనందిన జీవితంలో మార్పును తీసుకువచ్చే విధంగా ఉంటుంది. దసరా వస్తే సంబరాలు నవరాత్రులు పూజలు, అమ్మను ఆరాధించడం… వినాయక చవితి వస్తే పత్రులు, పండ్లతో దేవుడిని ఆరాధించడం… దీపావళి వస్తే దీపాలను ప్రధానంగా వరుసగా వెలిగించడం… లక్ష్మీ పూజ చేయడం…
ఇలా దీపావళి పండుగ నూతన ఉత్తేజాన్ని వ్యక్తి కుటుంబంలో కలుగజేస్తుంది. పండుగ రోజున ఇంటిల్లాపాది ఆనందంగా సంతోషంగా గడపడం కుటుంబ సభ్యులలో నూతన ఉత్తేజం కలుగజేస్తుంది.
ఆచారంగా వచ్చినా అదొక సంతోషకరమైన కాలాన్ని పండుగ అందిస్తుంది. దీపావళి మాత్రం తైల దీపాలతో ఇంటిని, జ్ఙాన దీపంతో వ్యక్తిని వెలుగులోకి తీసుకురావడానికేనని అంటారు.
సమాజంలో ఒకరి నమ్మకాలను ఒకరు గౌరవించుకుంటూ బ్రతుకుతూ ఉండే మనిషికి అనేక సమస్యలు ఉంటాయి. పండుగలు ఆ సమస్యలు వలన వచ్చే ఒత్తిడిని వ్యక్తి నుండి కొంతసేపు దూరం చేసే అవకాశం ఉంటుందని అంటారు. అంటే మనసును కొంతసమయం మళ్లించడం వలన అది మరలా నూతనోత్తేజం పొందగలదని అభిప్రాయం ఉంటుంది.
మానవ మనుగడ కోసమే మనిషికి కాసేపు సంతోషం తెచ్చే పండుగలలో ఒక్కో పండుగ ఒక్కో ప్రత్యేకత ఉంటే, దీపావళి రోజు మాత్రం చీకటిని ప్రారద్రోలే వెలుగు గురించి చెబుతుంది. అది ఇంటిలో దీపం కావచ్చును… మనసులో జ్ఙానదీపం కావచ్చును.
మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలువిద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?
జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?
పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?
పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
0 responses to “దీపావళి పండుగ ఎప్పుడు ఎందుకు చేసుకుంటారు”