గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి ! గుణపాఠం అంటే గుణమునకు పాఠం. ఎవరి గుణమునకు పాఠం అంటే, చెడుగుణం కలిగిన వ్యక్తికి గుణపాఠం అంటారు.
ఒక వ్యక్తిని మోసం చేస్తూ, మరొక వ్యక్తి జీవిస్తూ ఉంటే, మోసం చేసిన వ్యక్తికి గుణపాఠం చెప్పే అవకాశం మోసపోయిన వ్యక్తికి కాలం కల్పిస్తుంది…
కానీ గుణపాఠం త్వరగా ప్రారంభం కాకపోవచ్చు… కానీ గుణపాఠం ఎదురయితే జీవితంపై ప్రభావం పడుతుంది…. సమాజంలో గుర్తింపు మారుతుంది.
సమాజంలో వివిధ రకాల స్వభావాలతో వ్యక్తులు కలిసి ఉంటారు. అందరి స్వభావం ఒకేవిధంగా ఉండకపోవచ్చు. అలాగే వివిధ వ్యక్తులు వివిధ రకాల గుణాలను కలిగి ఉంటారు.
ఒకరి గుణం వలన మరొకరికి మేలు జరగవచ్చు. ఒకరి గుణం వలన మరొకరికి నష్టం కలగవచ్చు. కానీ ఒకరి గుణం వలన మరొకరికి చేటు కలిగితే, సదరు వ్యక్తికి గుణపాఠం కాలమే చెబుతుందని అంటారు.
అంటే కాలంలో మరొక వ్యక్తి రూపంలోనో మరొక సంఘటన ద్వారానో చెడు గుణాలు కలిగిన వ్యక్తికి కాలం గుణపాఠం చెబుతుందని పెద్దలు అంటారు.
గుణాలు మారే స్వభావం ఉన్నవారికి, చెడు ప్రవర్తన కలిగిన వారికి కూడా కాలం ద్వారా సమాజంలో గుణపాఠం ఉంటుందని చెబుతారు. సమాజంలో సహజీవనం చేసే వ్యక్తులు మంచి గుణాలు కలిగి ఉంటే, సమాజం చేత కాలంలో కీర్తింపడతారు. అదే చెడు ప్రవర్తన కలిగి ఉండీ, ఇతరులకు చేటు చేసేవిధంగా ప్రవర్తించేవారికి సమాజం కాలంలో గుణపాఠం చెబుతుంది.
జీవితంలో ఎదురైన సంఘటనల ద్వారా గుణపాఠం నేర్చుకున్న వ్యక్తి, తన జీవన మార్గాన్ని మంచివైపు నడిపించగలడు. గుణపాఠం నేర్వని వ్యక్తి స్వీయపతనానికి కారణం కాగలడు.
ఒక వ్యక్తి ఏదైనా పని చేసేటప్పుడు, ఆ పని వలన సామాజిక విధానానికి విఘాతం కలిగిస్తుందంటే, విజ్నులు సదరు పనిని మానుకుంటారు.
అలాగే ఎవరైనా ఒక వ్యక్తి తన స్వార్ధ ప్రయోజనం కోసం సామాజికమైన నష్టం ఉన్నా, సామాజిక ప్రయోజనలు ప్రక్కనపెట్టి తన స్వార్ధ ప్రయోజనం గురించే చూసుకునేవారికి సమాజం చేత కాలంలో గుణపాఠం ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
తన గుణాలు తాను పరిశీలన చేసుకోవడానికే కాలం పరిస్థితుల ద్వారా వ్యక్తికి జీవన పాఠాలు చెబితే, గుణపాఠం నేర్చుకున్నవారు. జీవితగమ్యాన్ని చేరగలరని పెద్దలంటారు.
జీవనపోరాటంలో సామాజిక పరిస్థితులు ఎప్పుడూ అనుకూలం కాదు… అలాగే ఎప్పుడూ ప్రతికూలం కాదు. అలాంటి కాలంలో సద్గుణాలతో నడుచుకునేవారి ప్రవర్తన మిగిలినవారికి ఆదర్శప్రాయంగా ఉంటుంది.
సహజీవనంలో సహచరులను ఇబ్బందులకు గురిచేస్తూ, ఇతరుల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, కేవలం వ్యక్తిగత స్వార్ధం కోసం వ్యవస్థాగత ప్రయోజనాలు కూడా ప్రక్కన పెట్టేసేవారు జీవితంలో గుణపాఠం ఎదురౌతుందని అంటారు.
ప్రకృతి నియమాలు పక్కకు పెట్టి, ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తే, సదరు ప్రాంతం కాలంలో గుణపాఠం పొందుతుందని అంటారు. అంటే పర్యావరణం విషయంలో ప్రకృతిని అసహజమైన పద్దతిలో ఉపయోగించుకోవడం కూడా ప్రకృతి నుండి గుణపాఠం ఎదుర్కోవడానికి కారణం కాగలదు.
అపకారికి ఉపకారం చేయమని సూచించే పద్యం మనకు బాగా ఫ్యామస్…
తనకు అపకారం చేసినవారికి సాయం అవసరం అయితే, అలాంటి అపకారికి కూడా ఉపకారమే చేయమని నీతిని తెలియజేసే పద్యం.
అంటే ఈ పద్యం యొక్క భావమును పరిశీలిస్తే, సమాజంలో ఒకరు మరొకరికి అపకారం చేయకుండా ఉండాలనే భావనకు బలం చేకూరుతుంది.
ఒక వ్యక్తికి అపకారం చేసిన వ్యక్తికి కూడా ఉపకారమే చేయమని అంటే, తనకు అపకారం చేయకుండా ఉన్నవారికి, ఉపకారం చేసిన వారికీ ఉపకారమే చేయాలి… ఇక అపకారం ఎవరికి చేయాలి?
పద్య భావం ప్రకారం అపకారం చేయాలనే ఆలోచన రాకుండా ఉంటే, అటువంటి వ్యక్తి ఉత్తమ గుణమే కలిగి ఉన్నట్టు.
ఒక వ్యక్తికి సమాజంలో అపకారం చేయనివారు, ఉపకారం చేసినవారు కూడా ఉంటారు. కానీ ఆ ఒక వ్యక్తి తన స్వార్ధం కోసం తెలిసి తెలిసి అపకారం తలపెడితే, మాత్రం అటువంటి వ్యక్తి గుణపాఠం కాలంలో ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది.
ప్రకృతిలో కాలంలో చర్యకు ప్రతిచర్య జరుగుతూనే ఉంటుంది. ఎవరు ఎలా జీవనం సాగిస్తూ ఉంటే, అలాంటి జీవనం వలన ఏర్పడే పరిస్థితులు మరలా ఎదురయ్యే అవకాశం కాలంలో కలుగుతూ ఉంటుంది.
కాబట్టి వ్యక్తికి చుట్టూ ఉండే వ్యక్తుల ద్వారా మంచిచెడులు సూచించబడుతూ ఉండే అవకాశం ఎక్కువ… వ్యక్తుల ద్వారా సూచించబడే సమయం మనల్ని మనం మార్చుకునే సమయంగా అవకాశంగా భావిస్తే, వ్యక్తి జీవనం శాంటిమయం అవుతుంది… అంటారు.
శ్రుతిమించిన వ్యవహారం బెడిసికొడుతుంది… అలా పదే పదే అలాంటి వ్యవహారాలు నిర్వహించేవారికి కాలమే గుణపాఠం చెబుతుందని అంటారు…
ఎవరికైనా గుణపాఠం ఎవరైనా చెప్పే అవకాశం కాలం భవిష్యత్తులో కల్పిస్తుందని అంటారు… అయితే అప్పటికి ఆ వ్యక్తిలో కూడా దోషం ఉండకుండా స్వీయపరిశీలన అవసరం అని అంటారు.
గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం…
మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు
విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?
జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?
పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?
పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
0 responses to “గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి”