నీటి ప్రాముఖ్యత తెలుపుతూ వ్యాసం రాయండి. మనకు, మనతో కలిసి జీవించే జీవులకు, భూమిపై ప్రాణం ఉన్న అన్ని జీవులకు, ఇంకా కదలని మొక్కలకు, చెట్లకు అన్నింటికీ ఆధారం నీరు. భూమిపై నీరు లేకుండా మనుగడ లేదు.
పురాణ కాలం నుండి ఇంకా భవిష్యత్తు కూడా పంచ భూతాలలో ప్రధానమైన నీరు లేకుండా మనిషి బ్రతుకు లేదు. సకల జీవుల ప్రాణాలను నిలబడడానికి నీరు ఆధారం. మనిషి ఆహారం తీసుకోకుండా కొన్ని రోజులు మాత్రమే బతకగలడు, కానీ నీరు త్రాగకుండా కొన్ని రోజులు కూడా జీవించలేడు. నీరు కేవలం తాగడానికి మాత్రమే కాదు, జీవనంలోని జీవనంలో చాలా కార్యాలలో నీరు అవసరం. అందుకే నీటిని “జీవనాధారం” అని అంటారు,
జీవనంలో నీటి ప్రాముఖ్యత
మనిషి శరీరంలో సగానికి పైగా నీరు ఉంటుంది. మనిషి శుచికి, శుబ్రతకు నీరు ప్రధానమైనది. మనిషి ఆరోగ్యంలో నీరుకు చాలా అవసరం. శరీరంలోని ప్రతి అవయవం పనితీరు నీటిపైనే ఆధారపడి ఉంటుంది. చెమట, శ్వాస, రక్తప్రసరణ, జీర్ణక్రియ – అన్నింటికీ నీరు ప్రధానమైనది. ప్రతి రోజు తగినంత నీరు తాగకపోతే శరీరం బలహీనపడుతుంది.
వ్యవసాయం, పరిశ్రమలలో నీటి ప్రాముఖ్యత
మనిషికి అవసరమైన ఆహారం కూడా నీరు వలననే భూమిపై పండుతుంది. ఆహార పంటలకు నీరు ప్రధానమైనది. వర్షాలు లేకుండా సాగు సాగదు. సాగు లేకుండా అన్నం ఉండదు. వర్షం వనాల చెరువులు, కాలువలు, నదులు నీటితో పుష్కలంగా ఉంటాయి. సదరు నీటితో సాగు సాగుతుంది. కేవలం వ్యవసాయానికే కాదు, పరిశ్రమల్లో యంత్రాలు నడపడానికి, ఉత్పత్తులు తయారు చేయడానికి కూడా నీరు అవసరం ఉంటుంది. విద్యుత్ ఉత్పత్తిలోనూ నీటి ప్రాముఖ్యత అమోఘం.
నీటి కొరత సమస్య
చెట్లు నరుకుతారు. మొక్కలు నాటరు. ఇలాంటి వాతావరణంలో ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది. ముఖ్యంగా వర్షాలు కురవకపోవడం ఉంటుంది. ఇంకా జనాభా పెరుగుతున్న కొద్దీ, నీటి అవసరం పెరుగుతుంది… అంటే చెట్లు ఎక్కువగా ఉండాలి కానీ చెట్లు తగ్గకూడదు. వర్షాలు లేకపోతె నదులలో, చెరువులలో, కాలువలలో నీరు ఉండదు. ఇంకా నదులు, చెరువులు కాలుష్యం చెందుతున్నాయి.
నీటి సంరక్షణ అవసరం
నీటిని పొదుపుగా వాడుకోవడం ప్రధానం.
నీరు పెరిగే విధంగా వర్షాలు పెరగాలి.
భూమిలో నీరు ఇంకిపోకుండా, ప్రకృతి సమతుల్యత పాటించాలి.
చెట్లు నరకడం ఉండకూడదు. మొక్కలు విరివిగా నాటాలి.
వాతావరణం కాలుష్యం తగ్గించాలి.
నీరు అమూల్యం. ఒకసారి వృథా అయితే తిరిగి దానిని సులభంగా పొందలేము. కాబట్టి మనందరం నీటిని ఆదా చేయాలి.
ముగింపు – నీటి ప్రాముఖ్యత
మనుషులు, మొక్కలు, జంతువులు బ్రతకడానికి నీరు అవసరం. ఇంకా అవి శుభ్రం కావాలంటే కూడా నీరే అవసరం. కాబట్టి నీరు లేకుండా భూమిపై, జీవుల మనుగడ ఉండదు. ఎప్పటి నుండో నీరు ప్రకృతిలో ఉంది, ఎప్పటికి నీరు పుష్కలంగా ఉండేవిధంగా మన జీవనం ఉండాలి.
