ఒక చిన్న నిర్ణయం… జీవితాన్ని మార్చింది. ఓ చిన్న కధ. జీవితంలో ఫస్ట్ ఫెయిల్యూర్ అంటే మన ప్రయత్నం ఎంతవరకు చేసామో? అది మనకు పరిచయం అవ్వడం మాత్రమే.

kadha vinadaniki ee krindi play button click cheyandi. ఆడియో కధ కోసం ఈ క్రింది ప్లే బటన్ క్లిక్ చేయండి.

సాయంత్రం సూర్యాస్తమయం. ఆకాశంలో సూర్యుబింబం నారింజ రంగులో మెరిసిపోతుంది. లుంబిని పార్క్ జనంలో కళకళలాడుతుంది. ఆ పార్కులో ఒక పక్కగా ఉన్న చిన్న బెంచ్ మీద కూర్చొని ఉన్నాడు నరేష్. అతని కళ్ళల్లో బాధ, మనసులో గందరగోళం కనబడుతుంది.

“ఏమిటి, ఎందుకు ఇలా జరిగింది? తెలుగు రీడింగ్ బాగా చేశాను కానీ తెలుగులోనె ఎందుకు తక్కువ మార్కులు” అనే ప్రశ్న అతన్ని లోపల నుంచి తినేస్తోంది.

పరీక్షల్లో తక్కువ మార్కులు రావడంతో అమ్మా నాన్న చివాట్లతో పాటు , స్నేహితులు తనను చుసిన తీరు అతన్ని మరింత బాధ పెట్టింది—అన్నీ కలిసి అతనికి బాధ ఎక్కువైంది.

జీవితంలో ఒకరి మాట వినడం చాలా ప్రధానం

ఆ సమయంలో, అతని పక్కన ఒక పెద్దాయన వచ్చి కూర్చున్నాడు.

“ఏమైంది బాబూ? ఎందుకు ఇలా దిగులుగా ఇక్కడ ఒంటరిగా కూర్చుని ఉన్నావు?” అని సున్నితంగా అడిగాడు.

మొదట నరేష్ ఏమీ మాట్లాడలేదు. కానీ కొద్దిసేపటికి ఆ పెద్దాయన ముందు, తన బాధ అంతా బయటపెట్టాడు.

ఆ పెద్దాయన చిరునవ్వుతో ఇలా అన్నాడు—

“జీవితం అంటే కేవలం పరీక్షలో పాస్ కావడం కాదు బాబూ… ఇది ఒక ప్రయాణం ఆరంభం మాత్రమే. ఫస్ట్ ఫెయిల్ అంటే, మొదటి ప్రయత్నంలో ఏవిధంగా ఉన్నాం అని మనకు మనం పరిచయం కావడం మాత్రమే. మనల్ని మనం మార్చుకోవడానికి ఫెయిల్యూర్ ఒక అవకాశం. ఎదో ఒక పరీక్షలో ఫెయిల్ అవ్వడం లేదా అనుకున్న మార్కులు రాకపోవడం జరిగితే, అది జీవితంలో ఫెయిల్ అయినట్టే కాదు. కేవలం ఒక హెచ్చరిక, మరింతగా సాధన చేసి చూడు, ఇప్పుడు నీ స్నేహితుల మధ్య నీ పరిస్థితి ఇలా ఉంది, భవిష్యత్తులో నీవు చేసే సాధన, భవిష్యత్తులో నీ పరిస్థితి వారి కన్నా ఒక మెట్టుపైనే ఉంటుంది. ఓడినప్పుడు దిగులు పడాలి కానీ దిగులుతోనే బ్రతక కూడదు… మనసుకు సర్ది చెప్పుకుని, మరొక గొప్ప ప్రయత్నానికి సాధన ప్రారంభం చేయాలి. ”

పెద్దల మాటలతో ప్రేరణ పొందితే అది మార్పుకు నాంది.

ఆ మాటలు నరేష్ మనసుకు ప్రేరణ కలిగించాయి.

“అయితే నేను ఇప్పుడు ఏమి చేయాలి?” అని అడిగాడు.

అప్పుడు పెద్దాయన చెప్పాడు—

“ఒక చిన్న నిర్ణయం తీసుకో… ప్రతి రోజు ఒక కొత్త విషయం నేర్చుకోవాలని.”

ఆ మాటలు చాలా సింపుల్‌గా అనిపించినా, నరేష్ జీవితాన్ని మార్చే మలుపు అయ్యాయి.

మార్పు ప్రారంభం

మరుసటి రోజు నుండే నరేష్ తన మంచి నిర్ణయాన్ని అమలు చేయడం మొదలుపెట్టాడు.

ఒక రోజు ఓ మంచి తెలుగు పుస్తకం చదవడం (Telugu Book Reading) ప్రారంభం చేసాడు… ఆ పుస్తకం రోజు చదవడంతో (Book Reading) పాటు, అందులోని సారాంశం అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించడం చేసాడు.

ఇంకో రోజు కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి సాధన చేసాడు.

ప్రతి రోజు వ్యాయామం చేయడం ప్రారంభం చేసాడు.

అతను చేసింది రోజూ, చిన్న చిన్న మార్పులే… కానీ పెద్ద ఫలితాలు అవి నాంది.

కొద్ది రోజుల్లోనే అతని ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇంట్లో వాళ్లు కూడా అతని మార్పును గమనించారు.

అతను విజయం వైపు ప్రయాణం

కొన్ని నెలల తరువాత, నరేష్ ఒక కాంపిటిషన్ లో పాల్గొన్నాడు. ఈసారి అతను గెలిచాడు కాదు… కానీ అతని ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంది.

అతను గ్రహించాడు—

“గెలవడం కాదు… సాధన చేయడం ముఖ్యం, మనస్పూర్తిగా ప్రయత్నం చేస్తే, ఫలితంగా బాగుటుంది.”

ఈ కథలోని నీతి

ఒక చిన్న నిర్ణయం… గొప్ప ప్రయత్నం… మంచి మార్పు… మన జీవితాన్ని పూర్తిగా మార్చగలవు.

వర్షాలు – వేసవి మధ్య ఆకస్మిక మార్పులు

బయట ఆటలు ఆడండి

పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి

కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి

బంధనం అర్ధం : పర్యాయ పదాలు

ఒక చిన్న కధ: పరిక్షల ఫలితం అంటే కేవలం మార్కులే కాదు.

అందలం అర్ధం : పర్యయ పదాలు

ఈరోజు పది పర్యాయపదాలు

యుద్ధం ఫలితాలు : ప్రపంచంపై ప్రభావం

ఎటునుండి చదివినా ఒకే విధంగా ఉండే తెలుగు పదాలు తెలుగు వ్యతిరేక పదాలు అంబుజం అర్ధం + 10 పర్యాయ పదాలు + ఉదాహరణలు

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

తెలుగురీడ్స్ హోం పేజి వెళ్ళండి

కథ: “నిజాయితీ నమ్మకం విలువ వెలకట్టలేనిది”

కొన్ని అసందర్భ పదాలు + వ్యాక్యాలు

చిన్న కథ: ఓర్పు విలువ

కథ: అంతులేని ఆలోచనలు అడ్డంకి అవుతాయి.

Leave a Reply