పండుగ అంటే ఏమిటి వివరించండి?

పండుగ అంటే ఏమిటి వివరించండి? ప్రతి సంవత్సరం తెలుగు కాలమానం ప్రకారం తెలుగు మాసములలో గల పక్షములో, నిర్ధిష్ట తిధి ఆధారంగా వచ్చే పండుగలు కొన్నింటిని పర్వదినాలుగా చెబుతారు… ఆయా రోజులలో ప్రత్యేకంగా దైవపూజలు చెబుతూ ఉంటారు.

ఉదాహరణ: చైత్రమాసంలో తొలి తిధి ఉగాది పరిగణించబడుతుంది. ప్రతిసంవత్సరం చైత్రమాసంలో వచ్చే మొదటి తిధి ఉగాది పండుగ జరుపుకుంటూరు. అలా తెలుగు కాలమానం ప్రకారం కొన్ని ప్రత్యేక తిధులలో పండుగలు జరుపుకుంటారు.

అయితే ఈ పండుగలలో శారీరకంగా, మానసికంగా శుద్దిగా ఉండమని సూచిస్తూ ఉంటారు. ఇంకా నివసిస్తున్న ఇంటిని పండుగకు ముందే శుభ్రపరచుకోవడం ఒక అలవాటుగా ఉంటుంది. ఒక నీట్ నెస్ అనేది మన పండుగల వలన ప్రతివారు పాటించవలసిన స్థితి ఆచారంలో ఉంటుందని అంటారు. ప్రతి పండుగకు తప్పనిసరిగా నివసిస్తున్న ఇంటిని పరిశుభ్రం చేయమని సూచిస్తారు. ఇంకా ఆ తర్వాత పండుగ రోజు శరీరమును శుద్ది చేసుకునే కొన్ని కార్యములను చెప్పి ఉంటారు. తర్వాత మనసును ఏకాగ్రతతో ఉండేందుకే అన్నట్టుగా పూజా విధివిధానాలు సూచించబడి ఉంటాయి… ఆలోచిస్తే… పండుగలు వ్యక్తిగత శుభ్రత, మనోల్లాసంగా ఉండడానికి పరిసరాలను ముందుగానే శుభ్రం చేసుకోవడం… వ్యక్తి తనగురించి తను మరింతగా పట్టించుకునే విధంగా పోత్సహించడానికే అన్నట్టుగా పండుగలు ఉంటాయనిపిస్తుంది.

ఇంకా పరిసరాల శుభ్రత కూడా పండుగల వలన జరుగుతూ ఉంటాయి. అయితే అనవసర పదార్ధాలు తెచ్చుకుని వీధులవెంట పడేవేసే సంస్కృతి కాకుండా… పెద్దలు సూచించిన మేరకు నేటి సామాజిక పరిస్థితులననుసరించి… పండుగలు జరుపుకోవడం మనిషి మనసుకు ఉత్సాహం అందిస్తాయి…

ఇష్టపడి కష్టపడితే, కష్టం కూడా సునాయసంగా అనిపిస్తుందంటే…

అలా మనసును ప్రిపేర్ చేయడానికి పండుగ సంప్రదాయం… పెట్టి ఉంటారేమోనని కూడా అనిపిస్తుంది… కారణం ప్రతి పండుగకు ఉన్నంతలో కొత్త బట్టలు కొనుక్కోమని చెబుతారు. బలవర్ధకమైన పిండి వంటలు సూచిస్తారు… అంటే మనిషికి అవసరమైన శక్తినిచ్చే పదార్దములు పండుగ రోజున ఇష్టంగా తయారు చేసుకుంటారు.

పండుగ అంటే ఏమిటి వివరించండి?
పండుగ అంటే ఏమిటి వివరించండి?

ఇంకా కొత్త బట్టలు మనసుకు కొంగ్రొత్త ఉత్సాహాన్నిస్తాయి… పండుగవేళ కొత్త శారీకర శుద్ది చేసుకుని కొత్త దుస్తులు ధరించిన మనసు సంతోషంగా ఉంటుంది.. కొత్త దుస్తులు ధరించి, దేవుడికి పూజ చేసుకుని మనసారా పరమాత్మను తలచుకుని పరమ ప్రీతితో ఇష్టమైన వంటకం తింటే, అది మనసుకు ఉత్సాహం… శరీరానికి బలం… కాబట్టి పండుగ మనిషికి మేలు చేసేవిధంగా పూర్వీకులు చెప్పి ఉంటారు.

ఒక పండుగ వస్తుందంటే, ఇంటిల్లిపాది సంతోషంగా ఉండేందుకు ప్రతి కుటుంబ సభ్యుడు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కష్టములు వెన్నంటి ఉన్నా పండుగరోజున సంతోషం తెచ్చుకుని మరలా మనసుకు కొత్త ఉత్సాహం తెచ్చుకునే ప్రయత్నం పండుగలవేళల్లో చేయవచ్చని అంటారు.

కాలానుగుణంగా వాతావరణంలో మార్పులు వస్తాయి… కాలక్రమంలో ఒక్కొక్కమాసంలో ఒక్కొక్క తిధి ప్రకారం ఒక్కో పండుగ ఒక్కో విధానంతో ఉంటుంది.

పండుగలలో పిండి వంటకాలు

పండుగలలో వండే వంటకాలు కూడా వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగానే ఉంటాయని చెబుతారు.

పండుగుల చేసుకోవడంలో ఆంతర్యం ఏమిటి?

వినాయక చవితి పండుగ నాడు పూజ చేసి పత్రి అంతా ఔషధ గుణాలు కలిగి ఉంటాయని అంటారు. కేవలం మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమను, పెద్దలు సూచించిన వివిధ రకాల పత్రితో పూజ చేసిన తర్వాత… ఆ పత్రిని ఏదైనా నీటి చెరువులో కలిపితే, ఆ నీరు కూడా ఔషధమయం అవుతుందని అంటారు. అంటే ఒక ఊరిలో జనులంతా పూజి చేసుకున్న వినాయకుడి ప్రతిమ మరియు పత్రిని చెరువులో కలిపితే, చెరువు నీరు ఔషద గుణంతో ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా విష సర్పాల విష ప్రభావం కూడా పోయే అవకాశం ఎక్కువ… ఎందుకు వినాయక చవితి రోజు ఈ పూజాపత్రిని, మట్టి వినాయకుడి(రంగులు పూయని)ని చెరువులో కలపడం అంటే, పూర్వంలో చెరువులలో నీటి త్రాగునీటిగా ఉపయోగించేవారని… కాబట్టి వర్షకాలంలో నీరు వచ్చ చేరుతున్న సమయంలో వినాయక చవితి పండుగ పూజ ఈ విధంగా ఊరి జనులకు ఉపయోగపడుతుందని అంటారు. అయితే నేడు ఇళ్ళల్లోకే త్రాగునీరు చేరుతుంది…

మనకు పండుగలు ఇంటిల్లిపాదికి సంతోషం తెచ్చే కార్యములుగా పెద్దలు నిశ్చయించి ఉన్నారు. వాటిని ఆచరించి… ఆనందంగా జీవించేవారు సంప్రదాయంలో అనేకమంది ఉంటారు…

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు