By | November 29, 2021

సామాజిక ఆస్తుల పరిరక్షణ విషయంలో బాధ్యతను గుర్తెరగడం. సామాజిక ఆస్తుల మనవి, మన ఆస్తులను మనం రక్షించాలే కానీ వాటికి హాని తలపెట్టరాదు. తమ వంతు ప్రయత్నంగా సామాజిక ఆస్తుల పరిరక్షణకు కృషి చేయాలని పెద్దలు చెబుతూ ఉంటారు.

సమాజంలో వివిధ వ్యవస్థలు లేక సంస్థలు మానవుల అవసరాలు తీర్చడానికి ఉపయోగపడుతూ ఉన్నాయ. వాటిని కాపాడడం అందరి సామాజిక బాధ్యత. సమాజంలో ఏ వ్యవస్థకు నష్టం జరిగినా, తిరిగి ఆనష్ట భారం మనపైనే పడుతుందనేది వాస్తవం. కాబట్టి ఎటువంటి ప్రవేట్, పబ్లిక్ ఏ ఆస్తికి నష్టం వాటిల్లినా, తిరిగి వాటి భారం మనందరిపైనా పడుతుంది… కాబట్టి వాటికి హాని తలపెట్టడం అంటే మనకు మనం నష్టం చేసుకుంటున్నట్టేనని అందరూ గుర్తెరగాలని అంటారు.

ఏవిధంగా సామాజిక ఆస్తులకు నష్టం జరిగితే, మనకు నష్టం జరిగినట్టు

ఒక పాఠశాలలో పగలంతా పాఠాలు జరుగుతూ ఉంటాయి. కానీ కొన్ని కొన్ని చోట్ల పాఠశాలలో పాఠాలు ముగిశాకా, కొందరు ఆకతాయిలు పాఠశాలలో కానీ పాఠశాల ఆవరణలో కానీ చేయకూడని పనులు చేస్తూ ఉంటారు. ఇది ఖచ్చితంగా తప్పని తెలిసి నిర్లక్ష్యధోరణిలో నడిచేవారు శిక్షార్హులు. దురలవాట్లున్నవారు పాఠశాలలో చేరి జూదం ఆడడం, మద్యం సేవించడం చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటిని జరగకుండా చూసుకోవాలసిన బాధ్యత అందరిపైనా ఉంటుంది. పాఠశాల కూడా మన సామాజిక ఆస్తి.

ఇక రాజకీయ నిర్ణయాలననుసరించి ఎప్పుడైనా బంద్ జరిగినప్పుడు, మొదట అందరి దృష్టి ఆర్టీసి బస్సులపై పడుతుంది. వాటిని నిలుపుదల చేయడం, వాటిని ద్వంసం చేయడం చేస్తూ ఉంటారు. ఆర్టీసి బస్సులు ఒకరోజు నిలిచిపోతేనే కోట్లలో నష్టం వాటిల్లుతుంది. ఇంకా వాటిని ద్వంసం చేయడం వలన ఆ నష్టం మరింత పెరుగుతుంది. ఆ తర్వాత నష్ట నివారణ చర్యలలో బాగంగా టిక్కెట్ ధరలు పెరిగితే, టికెట్ ధర చెల్లించేది ప్రయాణించే మనమేనని గుర్తెరగకపోవడం అజ్ఙానం. ఒకవేళ ప్రభుత్వమే ఆనష్ట నివారణకు సొమ్ములు చెల్లించినా, అది కూడా పన్నుల రూపంలో మనం చెల్లించిన సొమ్మే కానీ ఏ రాజకీయ నాయకుడి జేబులో సొమ్ము కాదని గుర్తెరగకపోవడం దురదృష్టకరం. బంద్ కు పిలుపిచ్చినప్పుడు ఆర్టీసి లాంటి సామాజిక ఆస్తులను ద్వంసం చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలి.

ఇంకా ఇలా బంద్ లు ర్యాలీలు జరిగినప్పుడు ఏదైనా సామాజిక ఆస్తులు ద్వంసం చేసినా, దానికి కూడా నష్ట నివారణ ప్రజల దగ్గరనుండే వసూలు చేయబడుతుంది. కారణం వారు ఇన్సూరెన్స్ చేసి ఉంటే, ఆ ఇన్సూరెన్స్ సొమ్ములు వారికి వస్తాయి… కానీ ఇన్సూరెన్స్ పాలసీదారుగా మనం కూడా ఉంటాము. అంటే మనం కూడా చెల్లిస్తున్నట్టే… అంతేకాకుండా భవిష్యత్తులో ఇలాంటి విపత్తులలో రక్షణ కొరకు సొమ్ములు భద్రపరచడం కోసం సదరు సంస్థ తయారు చేసే వస్తువు ధర కూడా పెంచుతుంది. తత్ఫలితంగా నిత్యం కొనుగోలు చేసే వస్తువును ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేయడం ద్వారా మనం ఆర్ధికంగా ధనం కోల్పోతున్నట్టేనని గుర్తించకపోవడం అజ్ఙానం.

సామాజిక ఆస్తులు సవ్యంగా ఉన్నంతకాలం మన జీవితము సవ్యంగానే

ఏదైనా మన చుట్టూ ఉండే ప్రకృతి కానీ సామాజిక ఆస్తులు కానీ సవ్యంగా ఉన్నంతకాలం మన జీవితము సజావుగా సాగుతుందనే కనీస జ్ఙానం కలిగి ఉండాలి. తత్కారణంగా ప్రకృతిపై జాగురత ఉంటుంది. సామాజిక ఆస్తులంటే గౌరవ భావం పెరుగుతుంది. అప్పుడు వాటి పరిరక్షణకు మనసు కదులుతుంది.

ఒక వస్తువు తయారి పరిశ్రమ, ఒక సేవా సంస్థ, ఒక కిరాణా షాపు, ఒక మెడికల్ షాప్, ఒక గ్రంధాలయం ఏదైనా వాణిజ్య వ్యాపార లావాదేవీలు సవ్యంగా సాగుతున్నంత కాలం మన ఆర్ధిక స్థితిలో మార్పు ఉండదు. కానీ అవి డిస్ట్రబ్ అయితే మన ఆర్ధిక స్థితి కూడా మారుతుందనే వాస్తవం.

సమాజంలో ఒకరికి నష్టం చేస్తే, ఆ వ్యక్తి తిరిగి నష్టపరచాలనే భావావేశం పొందడం సహజం అయినప్పుడు, ప్రతికారేచ్చ కలిగి ఉండడం సహజం అయినప్పుడు… వ్యవస్థలు అయినా సంస్థలు అయినా తమకు నష్టం ఎక్కడ ఎలా జరిగితే, అలానే తిరిగి రాబట్టుకోవడం సహజం కదా… ఈ ఆలోచనను మనిషి భావావేశంలో మరిచిపోయి ప్రవర్తించడం వలన తమకు తామే నష్టపరుచుకునే ప్రక్రియలో పాల్గొనడం జరుగుతుందని అంటారు.

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు