By | January 11, 2022

సమర్ధులకు క్షమ అవసరం వ్యాసం వివరించండి!బలవంతుడు భరిస్తాడు… బలహీనుడు అరుస్తాడు” అంటూ ఒక తెలుగు సినిమా డైలాగ్ ఉంది. కాబట్టి సహజంగానే సమర్ధుడుకి సహనం ఎక్కువగా ఉంటుందని అంటారు. ఎట్టి పరిస్థితులలోనూ సమర్ధుడు తన సహనాన్ని కోల్పోకుండా విచక్షణతో ఉండాలని పెద్దలంటారు.

బలవంతుడు భరించే సహన గుణం లేకపోతే, అతని కోపానికి అర్ధం లేకుండా పోతుంది. సమర్ధత అనేది వ్యక్తి యొక్క నైపుణ్యానికి సంబంధించినది అయితే, ఆ వ్యక్తి ఎంతటి నైపుణ్యతను కలిగి ఉంటే, అతడు ఆ రంగంలో అంతటి సమర్ధుడు…

సమాజంలో సమర్ధతగలవారికి ఆయా రంగాలలో మంచి స్థాయిని అందుకుని ఉంటారు. తన ఉంటున్న రంగంలో పొరపాట్లు జరిగినప్పుడు, నాయకుడు క్షమతో కూడిన భావ ప్రకటన కలిగి ఉండడం చేత సమస్యలు జఠిలం కాకుండా పరిష్కారం వైపు సిబ్బంది ఆలోచనలు చేయగలరు.

కానీ సమాజంలో ప్రతిరంగంలోనూ సమస్య పుడుతూనే ఉంటుంది. అలా పుట్టే ప్రతి సమస్యకు కారణం ఎవరో ఒకరు కాగలరు… సమస్యను ఎదుర్కొనే సమర్ధుడుకి మొదటి లక్షణం సమస్యను సహిస్తూ, కారణం అయినవారి యందు క్షమతో కూడిన భావన పొంది ఉండడం ప్రధానం అంటారు.

సమస్యకు పరిష్కారం కనుగొనడమే సమర్ధుడు ప్రధాన లక్షణం అయినప్పుడు క్షమా గుణం లోపించిన బలవంతుడు సమస్యకు పరిష్కారం చేయలేక సమస్యను మరింత జఠిలపరచవచ్చును.

సహజంగా క్షమా గుణం కలవారు ప్రశాంత చిత్తంతో ఆలోచన చేయగలరు. ఇంకా పొరపాటు చేసిన వారియందు దయతో ఉండగలరు. కావునా సమర్ధులకు క్షమ చాలా అవసరమనే అంటారు.

అర్హతను బట్టి అందలం అందితే, అర్హతకు క్షమ మరొక భూషణంగా ఉంటుందని అంటారు. అటువంటి గుణాలు సమస్య పరిష్కారం సమయంలో ప్రకాశిస్తాయని పెద్దలు చెబుతారు. కనుక వ్యవస్థ యొక్క ప్రయోజనార్ధం సమర్ధులకు క్షమ అవసరం అని అంటారు.

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు