స్మార్ట్ ఫోన్ సమస్యగా మారుతుందా? ఉపయోగపడుతుందా? పూర్వం పెద్దలు వస్తువు మన్నిక మరియు నాణ్యతతో బాటు వస్తువు ద్వారా కలగబోయే చేటును కూడా అంచనా వేసి, వస్తువులను ఇంటికి తెచ్చుకునేవారని పెద్దలు చెబుతూ ఉంటారు.
కానీ ఇప్పుడు ఈ వస్తువు కొనండి… ఈ వస్తువు వలన కలుగు ప్రయోజనాలు ఇవి… ఈ వస్తువుతో మీకు పనులు చాలా సులభం… అంటూ తదితర విషయాలతో వివిధ వస్తువుల మార్కెటింగ్ మనపై జరుగుతుంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగాకా, మార్కెటింగ్ చాలా సులభంగా మారుతుంది. ఎక్కువమంది షాపింగ్ స్మార్ట్ ఫోన్ నుండే చేస్తుంటారు… గమనిస్తే… కొంత ధనం వెచ్చించి స్మార్ట్ ఫోన్ చేతిలోకి తీసుకుంటే, అది ఆ తర్వాత కూడా ఖర్చు చేయించే పనిలో ఉంటుంది.
ఏదేని కానీ స్మార్ట్ ఫోన్ సౌకర్యవంతంగా ఆకర్శణీయంగా మారుతూ… వివిధ రకాల గేమ్స్ మరియు యాప్స్ ద్వారా స్మార్ట్ ఫోనుతో ఎక్కువసేపు గడిపే అలవాటు అందరికీ ఏర్పడుతుంది. గ్యాప్ దొరికితే స్మార్ట్ ఫోన్ లో వీడియో చూడడమో, గేమ్ ఆడడమో చేయడం అలవాటుగా మారుతుంది.
పరిమితమైన పనులు శరీరానికి ఆరోగ్యకరమైన శ్రమను కలిగిస్తే, అపరిమితమైన పనులు శరీరానికి ఇబ్బందులు తెచ్చి పెడతాయి… అయితే శరీరానికి వచ్చే ఇబ్బంది… గుర్తించి మెడిసన్ వాడగలం… కానీ స్మార్ట్ ఫోన్ విషయంలో అలా కాదు…. అది శరీరంపై ప్రభావం చూపుతూ మనసుపై బలమైన ప్రభావం చూపగలదు.
అలవాటుగా మారిన స్మార్ట్ ఫోన్, ఇప్పుడు జేబులో లేకపోతే బయటకు వెళ్ళలేనిస్థితిలో సమాజం ఉంటుందంటే, అది స్మార్ట్ ఫోన్ వలన సమస్య ఉందనే భావన బలపడుతుంది.
సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం
సమాజంలో ఎటువంటి సౌకర్యాలు అయినా మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే, ముఖ్యంగా మనసు బాగున్నప్పుడే… కానీ అదే మనసుపై ప్రభావం చూపే స్మార్ట్ ఫోన్ మనిషికి చేసే నష్టం ఏమిటి?
దీర్ఘకాలంలో స్మార్ట్ ఫోన్ సమస్యగా
స్మార్ట్ ఫోన్ దీర్ఘకాలంలో ప్రభావం చూపుతాయని అంటారు. స్మార్ట్ ఫోన్ వాడుకకు అలవాటు అయినవారికి సరిగ్గా నిద్ర పట్టదని అంటారు.
స్మార్ట్ ఫోన్ ఉపయోగాలు చాలామందికి తెలుసు… చాలామంది వాడుతున్నారంటే, వాటి ఉపయోగాలు పొందేవారు ఉండవచ్చును. అయితే స్మార్ట్ ఫోనుతో ఎక్కువ సమయం గడపడమే ప్రధానంగా దీర్ఘకాలంలో అది దష్ప్రభావం చూపగలదని అంటారు.
పదే పదే చేసే పనులలో మనసు శరీరమును యాంత్రికముగా మార్చగలదు… కాబట్టి అదేపనిగా స్మార్ట్ ఫోనులో గేమ్స్ ఆడడం అంత శ్రేయష్కరం కాదని అంటారు. స్మార్ట్ ఫోన్ సమస్యగా మారుతుందా? ఉపయోగపడుతుందా? చాలా విషయాలలో ఉపయోగపడుతుంది అలాగే దీర్ఘకాలంలో అది అలవాటుగా మారి సమస్యగానూ మారగలదు.
బ్లేడుకు రెండు వైపులా పదును, అది అజాగ్రత్తగా ఉంటే, ఉపయోగపడుతూనే చేతి వ్రేళ్ళను కట్ చేయగలదు… స్మార్ట్ ఫోన్ కూడా అంతే, ఉపయోగపడుతూ సమస్యగా మారగలదు… కాబట్టి స్మార్ట్ ఫోన్ వినియోగం నియంత్రించుకోవలసిన ప్రధాన చర్యగా చెప్పబడుతుంది.
మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు
విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?
జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?
పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?
పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
0 responses to “స్మార్ట్ ఫోన్ సమస్యగా మారుతుందా? ఉపయోగపడుతుందా?”