స్మార్ట్ ఫోన్ టచ్ చేయడమే పనిగా

స్మార్ట్ ఫోన్ టచ్ చేయడమే పనిగా ఉండవలసిన అవసరం రోజు రోజుకి పెరుగుతుంది.

పేమెంట్స్ చేయడం, మెసేజులు రీడ్ చేయడం, గేమ్స్ ఆడడం ఇలా రకరకాలుగా ఫోనుపై ఆధారపడడం జరుగుతుంది. అవసరానికి స్మార్ట్ ఫోన్ వినియోగించడం తప్పదు కానీ అనవసరంగా ఫోను టచ్ చేయడానికి అలవాటు పడితే….

టచ్ చేసి చూడు మెసేజ్ చదువు, టచ్ చేసి చూడు న్యూస్ చదువు, టచ్ చేసి చూడు సినిమా చూడు, టచ్ చేసి చూడు, వీడియో వాచ్ చేయి, టచ్ చేసి చూడు గేమ్ ఆడు, టచ్ చేసి చూడు ఏదైనా చేయి… ఫోను ఒత్తుతూ ఫోనులో లీనమవుతూ, పరిసరాలు కూడా పట్టించుకోని పరిస్థితి ఏర్పడుతుందా?

అవును స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక సమాజంలో అందరి తీరు మారుతుంది. పలకరింపులతో కబుర్లు చెప్పుకునే స్థానంలో ఫోనులో సందేశాలు చూస్తూ కాలక్షేపం చేసే కాలం వచ్చింది.

ఫోను టచ్ చేయడం ఫ్రెండ్ పంపిన సందేశం చదవడం… ఇక గర్ల్ ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ కానీ అయితే…. వారి సందేశాల కోసం వేచి చూడడం… యువతలో ఈ పాషన్ వస్తుంది. టచ్ చేయడం సోషల్ మీడియాలో ప్రవేశించడం. టచ్ చేసి లైక్ చేయడం, టచ్ చేసి కామెంట్ చేయడం… ఇలా ఫోన్ టచ్ చేయడం చేతికి ఒక అలవాటుగా అవుతుంది.

స్మార్ట్ ఫోన్ టచ్ చేయడమే పనిగా మరి అది అలవాటుగా మారుతుంది.

స్మార్ట్ ఫోన్ టచ్ చేసి చూడడం వీడియో బ్రౌజింగ్ చేయడం. పేపర్ చదివే అలవాటు ఉన్నావారు కుడా వార్తల వీడియోలు చూడడానికి అలవాటు పడుతున్నారు. పేపర్ అయితే చదివి అర్ధం చేసుకుని మైండును కొంచెం కష్టపెట్టాలి. అలా కాకుండా కేవలం ఒకసారి టచ్ చేసి చూసి అనేక వార్తా వీడియోలను బ్రౌజ్ చేయవచ్చు.

ఫ్రెండ్ సందేశాల కోసం, నచ్చిన అంశంలో వీడియోల కోసం, నచ్చిన గేమ్స్ ఆడటం కోసం టచ్ ఫోన్ టచ్ చేస్తూ… చేస్తూ… అదే అలవాటుగా మారుతూ… అనుకోకుండా ఫోన్ టచ్ చేస్తూ ఉండడం కూడా జరిగే అవకాశం లేకపోలేదు. అంతలా స్మార్ట్ ఫోన్ మనిషిపై ప్రభావం చూపుతుంది.

అనుక్షణం ఎదో వ్రాస్తూ ఉండేవారికి, మాట మాటకు జేబులో పెన్ను తీయడం అలవాటు అయ్యినట్టు… టచ్ చేసి చూస్తూ చూస్తూ… ఫోన్ టచ్ చేయడం ఒక అలవాటు అయినా ఆశ్చర్యపడక్కర్లేదు.

అందరికీ ఎదో అలవాటు ఉంటుంది. పుస్తకాలు ఎక్కువగా చదివే వారిని చూసి, అలంటి వారిని ఎక్కువమంది పట్టించుకోరు. ఎందుకంటే పుస్తకాలు అదేపనిగా చదివేవారికి లోకంతో కన్న పుస్తకంలో అంశాలే మైండుపై ప్రభావం చూపుతాయి. వారి లోకం వారిది అన్నట్టుగా ఉంటే, మరి స్మార్ట్ ఫోన్ అదే పనిగా వాడేవారి స్థితి?

కొందరికి అతి ఆహారం అలవాటుగా ఉంటుంది. సాదారణంగా భోజనం మనిషికి బలమైతే, అతిగా తినడం అనారోగ్యానికి కారణం కాగలదు. అలాగే అవసరానికి, కాసేపు కాలక్షేపానికి స్మార్ట్ ఫోన్ అవసరం కానీ అదే పనిగా దానితో లీనమవ్వడం కొరకు కాదు.

అలవాటుగా మారుతున్న స్మార్ట్ ఫోను వ్యసనంగా మారకూడదు అంటే ఏం చేయాలి?

ఏదైనా అలవాటు వ్యసనంగా మారకూడదు అంటే, ముందుగా ఆ అలవాటును గుర్తించాలి. ఆ అలవాటు వలన కలిగిన నష్టం ఏమిటో ప్రధానంగా గుర్తించాలి.

అలవాటు తాత్కాలికంగా మనసుకి ప్రియంగా ఉంటుంది కానీ దీర్ఘ కాలంలో అది నష్టమే అవుతుంది.

ఫోనులో కనబడే అనేక అంశాలలో అనేక విషయాలు ఆకట్టుకునే ప్రక్రియలో ప్రయత్నం చేస్తుంటాయి.

స్మార్ట్ ఫోనులో ఉపయుక్తమైనవి ఉంటాయి… అలాగే కేవలం ఆకట్టుకునేవి మాత్రమే ఉంటాయి. ఉపయోగపడనివి ఉంటాయి.

ఉపయోగపడే విషయాలు అంటే సమయానికి నడుస్తున్న పనికి సహాయకారిగా ఉండేవి. అంటే…

పేటియం కెవైసి చేయడం ఎలా? అని సెర్చ్ చేస్తే, పేటియం కెవైసి చేయడం పూర్తిగా వివరించే పోస్టులు, వీడియోలతో బాటు… ఇతర విషయాలు స్మార్ట్ ఫోను స్క్రీనుపై ప్రదర్శితం అవుతాయి. ఇందులో పేటియం కెవైసి గురించి పూర్తి వివరణ ఉన్న వీడియో ఉపయోగకరం.

అలాగే మనకు అవసరం మేరకు సహాయపడే విషయ సూచన మనకు ఉపయోగం సమయం సేవ్ అవుతుంది.

ఆకట్టుకునే విషయాలు మాత్రం మరింత ఆకర్షణీయంగా మారుతూ మనసుని ఆకట్టుకునే ఉంటాయి… మన సమయం ఖర్చు అవుతూ ఉంటుంది.

ఇదే గుర్తించాలి… మన టచ్ చేస్తూ…. చేస్తూ... బ్రౌజ్ చేస్తున్న విషయాలు వలన ఏమిటి తెలియబడుతుంది. అక్కడ అప్పుడు తెలియబడే అంశం చాలా చాలా మార్గాలలో చేరుతూనే ఉంటుంది.

ఒక సినిమా చూడాలి అంటే అది థియేటర్లో చూడవచ్చు. టి‌విలో చూడవచ్చు. కంప్యూటర్లో చూడవచ్చు. లాప్ టాప్లో చూడవచ్చు. చివరికి స్మార్ట్ ఫోనులో కూడా చూడవచ్చు. అంటే ఒక సినిమా చూడదగిన మార్గాలు ఉన్నట్టే మిగిలిన విషయాలలో కూడా మార్గాలు ఉంటాయి.

అలాంటి సినిమాలు ఫోనులోనే చూడడం తగ్గించాలి.

ఫోనులో గేమ్స్ ఆడుట అలవాటుగా

ఇక గేమ్స్ చాలా చాలా మందిని ఫోనుకి అలవాటు చేసేస్తూ ఉంటాయి. ఇదే చాలా పెద్ద సమస్య అంటారు. ఎందుకంటే యువత ఎక్కువగా గేమ్స్ వైపు వెళుతూ ఉంటారు.

బౌతికంగా గేమ్స్ అడితే అది శారీరక శ్రమ ఉంటుంది. అలసిన శరీరం మంచి నిద్రకు ఉపక్రమిస్తుంది. ముఖ్యంగా ఎదిగే వయసులో ఆటలు ప్రధానంగా ఉంటాయి.

కానీ అటువంటి ఆటలు ఫోనులో ఆడుతూ సమయం వృధా చేసుకోవడమే పెద్ద సమస్యగా పెద్దలు చెబుతూ ఉంటారు. ఫోనులో ఆటలు ఆడుతూ ఉంటే, ఫోన్ చార్జింగ్ అయిపోతే విసుగు… ఫోనులో నెట్ బాలన్స్ లేకపోతే విసుగు… ఇలాంటి విసుగు ఫోనులో గేమ్స్ అదే పనిగా ఆడుతూ ఉంటే వస్తుందని అంటారు.

అదే బౌతికంగా ఆడే శరీరం అలసేవరకు సాగితే, ఫోనులో గేమ్స్ మనసు అలసేవరకు సాగుతూనే ఉంటాయి. మనసుకు అంతు ఎక్కడ ఉంటుంది? విసుగు ఉంటుంది, చిరాకు ఉంటుంది…

కాబట్టి మనసు ఎటు వెళ్తుందో గమనించకపోతే, అది చేటు చేస్తుంది.

అంతులేని మనసుకు, అంతుబట్టని గేమ్స్ ఫోనులో టచ్ చేస్తూ ఆదుకోవడం, అంతులేని సీరియల్స్ ఫోనులో టచ్ చేసి చూడడం అలవాటు చేయడం… మన వేలుతో మన కన్ను పొడుచుకోవడమే…

పరిమితులు ఎక్కడ ఉంటాయో అక్కడ మనసు లొంగడం మొదలవుతుంది.

స్మార్ట్ ఫోన్ గురించి మాట్లాడుతూ… ఈ మనసేమిటి అనుకోవద్దు… కారణం మనసును తరిచి చూస్తే దానికి అంతు ఉండనట్టే, ఫోనులో కనబడే విషయాలు, మన ఫోను హిస్టరీకి అంతు ఉండదు… రెంటికీ పోలిక ఉంటుంది.

మనసుకు ముందు సక్రమమైన పరిమితులతో కూడిన పనిని చేయడం.

ఎక్కడ పరిమితులతో కూడిన పనులు నియంత్రించబడుతు ఉంతాయో అక్కడ పనిచేసేవారికి పరిమితులకు లోబడి పని చేయడం అలవాటు ఉంటుంది.

మరి పిల్లలకు పరిమితులు ఎక్కడ ఉంటాయి? అంటే మంచి కుటుంబంలో పెద్దల మద్య పెరిగే పిల్లలకు పరిమితులలో ఉండడం అలవాటు అవుతుంది.

కొందరికి స్కూల్ వాతావరణంలో పరిమితులు బాగా ఉపయోగపడతాయి. ఎదిగే వయసులో మనసు విచ్చలవిడిగా వెళ్ళకుండా పరిమితులు ఉంటాయి.

పిల్లల మనసు గాయపడకుండా పరిమితులు విధిస్తూ, మంచి విషయాలు తెలిసేలా చేయడం పెద్దల బాద్యత…

స్మార్ట్ ఫోన్ వినియోగించడంలో స్కూల్ పిల్లలు కూడా చేరుతున్నారు. కరోనా కరనంగా ఆన్లైన్ క్లాసులు వలన పిల్లలకు ఫోన్ అందుబాటులోకి వస్తుంది.

పిల్లలు కూడా తప్పకుండా ఫోన్ వాడవలసిన స్థితి సమాజంలో ఏర్పడుతుంది. కాబట్టి ఫోనులో పిల్లలు తప్పు విషయాల వైపు మరలకుండా పెద్దలు, వ్యవస్థలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

స్మార్ట్ ఫోన్ టచ్ చేయడమే పనిగా పెట్టుకునే వారి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

అదే అలవాటుగా మారకుండా జాగ్రత్త పడాలి.


మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *