By | January 1, 2022

స్త్రీల పట్ల గౌరవ భావన స్త్రీల పట్ల మర్యాదపూర్వకమైన ఆలోచనలు లేని సమాజంలో స్త్రీ పూజింపబడదు అంటారు. అయితే మనదేశంలో స్త్రీ పూజింపబడింది. స్త్రీ గౌరవింపబడింది. స్త్రీ పట్ల మర్యాద పూర్వకమైన ప్రవర్తన కలిగి ఉన్న సమాజం మన భారతీయ సమాజం అని ప్రపంచం కీర్తించింది.

అయితే ఇప్పుడు అదే దేశంలో కూడా స్త్రీ లైంగిక వేధింపులకు గురి అవుతుందనే వార్తలు సమాజాన్ని కలచివేస్తున్నాయి… దారుణం అందులో చిన్నారులు కూడా ఉండడమేనని పెద్దలు వాపోతున్నారు. స్త్రీల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవారు ఉంటున్నారు. స్త్రీల పట్ల అసభ్యకర పదజాలంతో మాట్లాడుకునే వారు ఉంటున్నారు.

సమాజంలో పురుషాధిక్యత కారణంగా స్త్రీల పట్ల గౌరవ భావన లేదని చాలామంది భావిస్తూ ఉంటారు. అయితే అదే పురుషాధిక్యత ఉన్న పురుషుల మదిలో స్త్రీల పట్ల గౌరవ భావన బలంగా ఉంటే, స్త్రీల పై మర్యాద సమాజంలో సమృద్దిగా ఉంటుంది కదా.

అటువంటి పురుషాధిక్యత కల సమాజంలో స్త్రీల పట్ల అసభ్యకరమైన సంభాషణలు పుట్టడానికి కారణం ఎవరు?

స్త్రీల గురించి అసభ్య పదజాలం

ది స్త్రీల పట్ట గౌరవ భావం లేదని వాపోయేవారు ఆలోచన చేయవలసిన ప్రశ్న. ఒకవేళ సినిమాల వలన స్త్రీలంటే గౌరవం పోయి, మర్యాద పోయి, స్త్రీలంటే కోరిక తీర్చే ఆడమనిషిలాగా కనబడుతుందని భావిస్తే, అటువంటి సినిమాలను సమాజంలో ప్రదర్శించనివ్వరాదని అవగాహన సదస్సులు తీసుకురావాలి.

కారణాలు ఏవైనా స్త్రీల గురించి అసభ్య పదజాలం ఉపయోగిస్తూ, సమాజంలో నలుగురిలో మాట్లాడడం కూడా సభ్య సమాజానికి శ్రేయష్కరం కాదు. గుంపులో ఉన్నప్పుడు సిగరెట్ త్రాగితే ఎదుటవారికి ఎంత హానికరమో, సమాజంలో స్త్రీలను పరుష పదజాలంతో సంభోదిస్తూ సమాజంలో గుంపులలో సంభాషణలు కొనసాగించడం కూడా అంతే…

స్త్రీల పట్ల గౌరవ భావన స్త్రీల పట్ల మర్యాదపూర్వకమైన
స్త్రీల పట్ల గౌరవ భావన స్త్రీల పట్ల మర్యాదపూర్వకమైన

స్త్రీల పట్ల గౌరవ భావన బలమైన భావనగా ఎదుగుతున్న పిల్లలలో కలగాలి

మన సమాజంలో స్త్రీల పట్ల గౌరవ భావన బలమైన భావనగా ఎదుగుతున్న పిల్లలలో కలగాలి. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.

ఇలా సమాజంలో నలుగురు కూడి ఉన్న చోట కానీ లేదా ఏదైనా సంస్థల పని ప్రదేశాలలో కానీ స్త్రీల పట్ల అసభ్యకరమైన సంభాషణలకు తావివ్వకూడదు.

హైస్కూల్ విద్యార్ధులకు పరిసరాల పరిశీలన

ఎందుకు అంటే…. ఒక ఉదాహరణగా ఒక సంఘటనను ఊహిస్తే…. ఇక ఇక్కడ హైస్కూల్ ఎందుకంటే, హైస్కూల్ విద్యార్ధులకు పరిసరాల పరిశీలన, ఇంకా చుట్టు ఉండే వ్యక్తుల ప్రభావం తెలియబడుతుంది. గ్రహించే అనుకరిస్తూ బలమైన అభిప్రాయాలను ఏర్పరచుకునే వయస్సు అదే కాబట్టి… కానీ ఎవరికి చెడు ఉద్ధేశం ఆపాదించాలని కాదు.

ఒక హైస్కూల్ ఉంది. హైస్కూల్ విద్యార్ధులు చూసి నేర్చుకుని, సంఘటనల వ్యక్తుల ప్రవర్తనను అనుకరించే అవకాశం ఎక్కువ. ఇక హెడ్ మాస్టర్ అయితే, ఆ స్కూల్ విద్యార్ధులకు భయభక్తులు ఉంటాయి. అలాంటి హెడ్ మాస్టర్ అదే స్కూల్ ఆవరణలో స్త్రీల పట్ల అసభ్యకర పదజాలం తమ స్టాఫ్ ముందే సంభోదిస్తూ మాట్లాడితే, అది…. అతని పదవికి గౌరవం పోగొట్టే సంఘటనే కాదు…. విన్న విద్యార్ధులు కూడా స్త్రీ గురించి కేవలం పుస్తకాలలో ఉండేది పరీక్షలలో వ్రాయడం కోసమేననే బలమైన అభిప్రాయానికి వచ్చేసే అవకాశం ఉంటుంది.

కాబట్టి స్త్రీల గురించి నలుగురిలో కానీ గుంపుగా ఉన్న చోట్ల కానీ ఇంకా మీడియాలో కూడా అసభ్యకర పరుష పదాలను సంభోదించకుండా…. స్త్రీపై అసభ్యకర ఆలోచన పెరిగేవిధంగా సినిమా దృశ్యాలను బ్యాన్ చేయాలి.

స్త్రీల పట్ల గౌరవ భావన స్త్రీల పట్ల మర్యాదపూర్వకమైన
స్త్రీల పట్ల గౌరవ భావన స్త్రీల పట్ల మర్యాదపూర్వకమైన

సమాజంలో మార్గదర్శకులుగా ఉంటారో అలాంటి వారు ఎవరూ స్త్రీల పట్ల అమర్యాదగా మాట్లడరు.

ముందుగా మనమే మేలుకోవాలి. ఎవరైతే సమాజంలో మార్గదర్శకులుగా ఉంటారో అలాంటి వారు ఎవరూ స్త్రీల పట్ల అమర్యాదగా మాట్లడరు. ఇంకా వారి వలననే మనదేశంలో స్త్రీ అంటే గౌరవం అని ప్రపంచానికి మరింతగా తెలియబడేది.

పరమ పవిత్రమైనవాటిలో స్త్రీని కూడా మనశాస్త్రం చెబుతుందని అంటారు. అటువంటి స్త్రీని భర్త తప్పించి మిగిలినవారంతా పూజ్యభావంతో చూడాలనే ఉద్దేశ్యంతో స్త్రీని పరమపవిత్రమైనదిగా శాస్త్రం చెప్పబడిందని చెప్పారు. అంటే స్త్రీ ఎక్కడా ఉన్నా స్వేచ్ఛగా జీవించేవిధంగా చూడవలసిన భాద్యత పురుషుడిదే అయినప్పుడు, పురుషుడి మనసులో స్త్రీపట్ల అసభ్యకర ఆలోచనలు సృష్టించే సాహిత్యమైనా, సినిమా అయినా, సీరియల్ అయినా రద్దుకావాలి.

మనశాస్త్రం స్త్రీని అణిగిమణిగి ఉండాలని చెప్పలేదు కానీ అణిగిమణిగి ఉండే స్త్రీ గుణానికి పురుషుడి తోడైతే, ఆ గుణం పూజింపబడుతుంది. స్త్రీతత్వం గౌరవింపబడుతుంది. కాబట్టి అటువంటి పురుషుడి మదిలో చెడు ఆలోచనలు రెచ్చగొట్టే విధంగా సమాజంలో సంభాషణలు కొనసాగడానికి మూలం ఎక్కడుందో గుర్తించి, ప్రశ్నించాలి.

స్త్రీలను సంభోదిస్తూ మాట్లాడవలసి వస్తే

ఇల్లు వ్యక్తిగతం అయినా ఇంటికి శాస్త్ర నియమాలు పాటించడం వ్యక్తిగతం అయితే, సమాజంలో నలుగురిలో ప్రవర్తించే ప్రవర్తన మరొకరి అనుకరణకు కారణం అయితే, ఎటువంటి ప్రవర్తనను కలిగి ఉంటున్నామో వ్యక్తిగా పరిశీలించుకోవాలి…. కనీసం స్త్రీపట్ల సినిమాలు జాలి కేవలం డైలాగులకు పరిమితమై వారిని చూపించే విధానంలో మార్పు రాకపోవచ్చును కానీ మనమైనా నలుగురిలో స్త్రీల పట్ల గౌరవ భావన కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో ఉంటూ నలుగురిలో స్త్రీలను సంభోదిస్తూ మాట్లాడవలసి వస్తే ఎంత మర్యాదగా మాట్లాడాలో చదివి తెలుసుకోవాలి. వివేకానందుడు గొప్పవాడుగా కీర్తింపబడడానికి ప్రధాన కారణం అందరినీ అమ్మగా చూడడమే… అన్ని గొప్ప వ్యాక్యాలు చెప్పిన వివేకానందుడు దగ్గరకు వచ్చిన స్త్రీని చెడు ఉద్ధేశ్యంతో చూసినా, అతని ఎటువంటి గౌరవం సమాజం ఇచ్చి ఉండేది కాదు.

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు