10వ తరగతి ఫలితాలు (10th Class Results) మార్కులు కాదు… మన విలువే జీవితాన్ని నిర్ణయిస్తుంది!

పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయంటే…  జీవితం అంతా ముగిసిపోయిందని అనిపించిందా?  అలా అనిపించడం ఖచ్చితంగా తప్పు అని తెలుసుకోండి.

ఎందుకంటే: పరీక్ష(Exam) అంటే? ఒక నిర్దిష్ట సమయంలో ఒక విద్యార్ధి తనకు ఇవ్వబడిన ప్రశ్నాపత్రాని(Question Paper)కి జవాబులు రాయడం… మీరు ప్రశ్నలు (Questions) ఎంత ఖచ్చితంగా సమాధానాలు రాసారు? దానిని బట్టే మార్కులు వస్తాయి…

పరీక్షలు(Exams) వ్రాసిన తర్వాత, ఏ విధంగా రాసామో అవగాహన లేకుండా, ఫలితాలపై ఎక్కువగా ఊహించుకోవడం వలన ఫలితాలు(Results) వచ్చాక బాధను పెంచుతుంది.

ఫలితాలు(Results) అదృష్టం బట్టి ఉండవు. పరీక్షలు (Exams) వ్రాసినదాని బట్టి ఉంటాయి.

అదృష్తం అంటే ప్రశ్నాపత్రం(Question Paper) సులభంగా రావడం, ఇంకా చదివిన పాఠాలలో నుండి, ప్రశ్నల(Questions)కు సమాధానాలు(Answers) సమయానికి గుర్తు రావడం…. అది అదృష్టమంటే… కావునా పరీక్షలు(Exams) వ్రాసిన తర్వాత అదృష్టం గురించి ఆలోచన చేయవద్దు. ఇంకా పరీక్షలు (Exams) వ్రాసిన తర్వాత ఫలితాలు (Results) గురించి ఎక్కువ ఆలోచనలు చేయవద్దు. దానికన్నా తర్వాత ఏమి చదవాలి? ఒకవేళ ఫెయిల్ అయితే, నేను మరలా పరీక్షలు(Exams) వ్రాయడానికి సిద్దం అని మనసుని సమాయత్తం చేయడం, అనే ప్రక్రియ జీవితంలో అనుకూల భావన(Positive Thinking)ను పెంచుతుంది. ఇది చాలా మంచి విషయం(Good Thing).

మార్కులు కేవలం ఒక సంఖ్య మాత్రమే… మన విలువ కాదు తెలుసుకోండి!

అనుకున్న ఫలితాలు రాలేదు? లేదా ఫెయిల్ అయ్యాము?

అప్పుడు మనలో ఉన్న బలం ఏమిటో చూడాలి కానీ బలహీన ఆలోచనలకు లొంగకూడదు:

చాలా బలాలు ఉంటే?

మాట్లాడే నైపుణ్యం – యూట్యూబ్ ఛానల్ విజయవంతంగా నిర్వహించవచ్చు.,  

ఆటలపై ఆసక్తి ఉంటె, ఒక క్రీడాకారునిగా ఎదగవచ్చు.

లాభం, నష్టం గురించి అవగాహన ఉండి, లౌక్యం ఉంటె, వ్యాపారం ప్రారంభించవచ్చు.   

టెక్నాలజీ గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంటె, అది తెలుసుకుని దాంట్లో విజయవంతం కావచ్చు.

కొన్ని నెలలు సరిగ్గా కష్టపడితే వచ్చే ఫలితాలు జీవితాన్ని మారుస్తాయి…. కావున బలం తెలుసుకుని, బలహీనతను జయిస్తూ… ముందుకు సాగడమే జీవితం.

నిజం ఏమిటి? మార్కులు కాదు… మన విలువే జీవితాన్ని నిర్ణయిస్తుంది

మార్కులు మీ జ్ఞానాన్ని పూర్తిగా కొలవలేవు

పరీక్షలు మీ జీవితాన్ని నిర్ణయించవు

మీ ఆలోచనలు, పట్టుదలే మీ భవిష్యత్తును నిర్మిస్తాయి

ఎవరైనా మీ మార్కుల ఆధారంగా మీ విలువను తక్కువగా చూస్తే…

అది వారి అజ్ఞానం, మీ లోపం కాదు

మీరు ఓడిపోలేదు…

మీరు ఇంకా ప్రారంభ దశలో ఉన్నారు!

ముగింపు

ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి:

నేను మార్కులతో కాదు… నా ప్రయత్నాలతో గుర్తింపు పొందుతాను!”

ఒక రోజు…

నిన్ను తక్కువగా చూసిన వాళ్లే నీ విజయానికి చప్పట్లు కొడతారు.

వేసవి సెలవులు : ఇలా వినియోగించుకుందాం

బంధనం అర్ధం : పర్యాయ పదాలు

ఒక చిన్న కధ: పరిక్షల ఫలితం అంటే కేవలం మార్కులే కాదు.

అందలం అర్ధం : పర్యయ పదాలు

ఈరోజు పది పర్యాయపదాలు

యుద్ధం ఫలితాలు : ప్రపంచంపై ప్రభావం

ఎటునుండి చదివినా ఒకే విధంగా ఉండే తెలుగు పదాలు తెలుగు వ్యతిరేక పదాలు అంబుజం అర్ధం + 10 పర్యాయ పదాలు + ఉదాహరణలు

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

తెలుగురీడ్స్ హోం పేజి వెళ్ళండి

కథ: “నిజాయితీ నమ్మకం విలువ వెలకట్టలేనిది”

కొన్ని అసందర్భ పదాలు + వ్యాక్యాలు

చిన్న కథ: ఓర్పు విలువ

కథ: అంతులేని ఆలోచనలు అడ్డంకి అవుతాయి.

యుద్ధం ఫలితాలు : ప్రపంచంపై ప్రభావం

Leave a Reply