వేసవి సెలవులు : ఇలా వినియోగించుకుందాం ముందుగా నిద్రలేవడం అలవాటు కావాలి. how to use summer holidays వేసవి సెలవులు కేవలం ఆటపాటలకే కాకుండా, కొత్త విషయాలు నేర్చుకోవడానికి, వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మంచి అవకాశం కల్పిస్తాయి. జీవితంలో కాలం చాలా విలువైనది… వృధా చేస్తే, అది తిరిగి రాదు. కనుక కాలాన్ని సరిగ్గా వినియోగిస్తే, అవి బంగారు రోజులుగా భవిష్యత్తులో గుర్తుకువస్తాయి. లేదంటే ఆ రోజులు అంటూ ఎవరినో నిందిస్తూ నిట్టుర్చే రోజులుగా భవిష్యత్తులో ఎదురౌతాయి.
కాబట్టి పిల్లలూ, మీ కాలం మీకు చాలా కీలకం అని ముందు మీరు గుర్తించాలి… మీరు ఆడితే మురిసిపోయేవారు… మీరు ఏదైనా సాధిస్తే, మరింతగా ఆనందపడతారు… అలా వారు ఆనందపడే విధంగా జీవితంలో ఎదగడానికి, మీముందు ఉన్నది… కాలమే…. కాలాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడమే పిల్లలుగా మీ కర్తవ్యం…
పిల్లలు వేసవి సెలవులు ఎందుకు వాడుకోవాలి?
సెలవులు అనగానే ఊరు వెళ్ళవచ్చు, ఆప్యాయతను చూపే బంధాల మద్య చక్కగా ఉండవచ్చు… అదో ఆనందం… కాని ఆ ఆనందం పొందాలి…. అయితే పూర్తిగా అలా కాలాన్ని ఖర్చు చేసేయకుండా…. చదువుకు ఉపయోగపడే విధంగా విషయ పరిజ్ఞానం పెంచుకోవడం… చేయాలి.
ముఖ్యంగా ఏ విషయంలో ఫోకస్ చేయాలి…. మేల్కోవడం… రోజు మేల్కొనే సమయం? ఎక్కువ ఫోకస్ చేయవలసినది… ఏ సమయానికి నిద్ర లేస్తున్నాము? నిద్ర లేవడమే కదా! అని సింపుల్ గా వదిలేయకండి… ఎందుకంటే?
లేటుగా నిద్ర లేచి హడావుడిగా పనులు చేయడం… కొన్నాళ్ళకు ఒత్తిడితో పనిని చేయడనికి కారణం కావచ్చు. అదే ముందుగా మేల్కొంటే మాత్రం…. అది మనపై ముందుగా పాజిటివ్ వైబ్రేషన్ తీసుకువస్తుంది… సమయం ఉంటుంది కాబట్టి పనులు ఖచ్చితత్వంగా చేయవచ్చు. చుట్టూ ఉండేవారితో ప్రేమగా మాట్లాడగలం… తద్వరా “ఆ పిల్లవాడు. ఎంత మంచివాడు? అడిగినదానికి చక్కగా సమాధానం చెబుతాడు… కంగారు లేదు” అనే మాట సంపాదించుకోవచ్చు…
కాలాన్ని సద్వినియోగం చేయడం
పిల్లలుగా మీరు సంపాదించేది? చుట్టూ ఉన్నవారి దగ్గర మంచి బాలుడు అనిపించుకోవడమే??? చదువుకునే సమయంలో చదువుపై దృష్టి పెట్టడం, వ్యాయామం చేయడం, హోం వర్క్ చేయడం, జ్ఞాపక శక్తి పెమ్పోదిన్చుకోవడం…. లాంటి విషయాలతో కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ప్రధానం. ఆచరణ సాద్యమైన ఆలోచనలతో ఉంటూ, సమయానికి ఆహారం తీసుకోవడం చాలా ప్రధానం. అది తల్లిదండ్రులకు ఆనందం ఇస్తుంది.
సరే సెలవులలో ఏ విధంగా వాడుకుంటే, మనకు బాగుటుంది? మరొక పోస్టులో…
ఒక చిన్న కధ: పరిక్షల ఫలితం అంటే కేవలం మార్కులే కాదు.
యుద్ధం ఫలితాలు : ప్రపంచంపై ప్రభావం
ఎటునుండి చదివినా ఒకే విధంగా ఉండే తెలుగు పదాలు తెలుగు వ్యతిరేక పదాలు అంబుజం అర్ధం + 10 పర్యాయ పదాలు + ఉదాహరణలు
పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?
తెలుగురీడ్స్ హోం పేజి వెళ్ళండి
కథ: “నిజాయితీ నమ్మకం విలువ వెలకట్టలేనిది”
కొన్ని అసందర్భ పదాలు + వ్యాక్యాలు
