By | October 31, 2021

ఆర్ధిక క్రమశిక్షణ ఆవశ్యకత వివరించండి. చాలా ప్రధాన విషయము. చాలా ముఖ్యమైన విషయము. అందరూ తెలుసుకోవలసిన అంశము. అందరికీ అవగాహన ఉండాల్సిన అంశము. ఎందుకు ఇంత ముఖ్యం? ఇంత ప్రధానం అంటూ అవే పదాలు రిపీట్ చేయడం?

వ్యక్తి ఉన్నతికి ఆర్ధిక క్రమశిక్షణ దోహదపడుతుంది.

ఒక వ్యక్తి సామాజిక స్థితిని ఆర్ధిక పరిస్థితి శాసిస్తుంది.

సమాజంలో గౌరవం వ్యక్తి యొక్క ఆర్ధిక స్థితి ఆధారంగా ఉంటుంది.

కుటుంబ జీవనంలో ఆర్ధిక వనరులు కీలక పాత్ర పోషిస్తాయి.

సామాజిక అభివృద్ది అయినా వ్యక్తి అభివృద్ది అయినా ఆర్ధిక వనరులు, ఆర్ధిక సంపాదన వలననే సాద్యపడుతుంది… ఇంకా ఎన్నో అవసరాలు ఆర్ధిక స్థితి ఆధారంగా తీరుతూ ఉంటాయి. అటువంటి ఆర్ధిక రంగంలోనే మోసానికి తావు ఉండేది. ఏరంగం అయినా స్థాపించబడే ప్రధానంగా ఆర్ధిక ప్రయోజనాలు కోసమే అయితే కొన్ని సేవా రంగాలు కూడా ఆర్ధిక స్థితి బాగుంటేనే అవి మనగలవు. కాబట్టి ఆర్ధిక క్రమశిక్షణ అనేది అందరికీ అవసరం.

ఆలోచిస్తే ఆర్ధిక క్రమశిక్షణ ఒక వ్యక్తికి జీవిత పర్యంతము ఉంటే, అతని సంపాధన అతనిపై ఆధారపడినవారికి సరిగ్గా అందుతుంది.

ఒక సంస్థ కట్టుదిట్టమైన ఆర్ధిక క్రమశిక్షణను కలిగి ఉంటే, ఆ సంస్థ దీర్ఘకాలం కార్యకలాపాలు సాగించి, ఆ సంస్థను నమ్ముకున్నవారికి సరైన న్యాయం చేయగలదు. ఇలా వ్యక్తి అయినా సంస్థ అయినా ఆర్ధికపరమైన విషయాలలో క్రమశిక్షణను కలిగి ఉంటే ఎక్కువకాలం సమాజంలో మనగలవు. ఆర్ధిక అవసరాలలో తమవంతు సాయం చేయగలవు.

ఆర్ధిక క్రమశిక్షణ వలన ఆర్ధిక అవసరాలపై పట్టు ఉంటుంది.

కష్టం చేసేవారికి ఆర్ధిక క్రమశిక్షణ ఉంటుంది. కష్టపడి కూడా ఆర్ధిక క్రమశిక్షణ లేకపోతే, జీవితంలో పడ్డ కష్టానికి విలువ పోగొట్టుకున్నట్టే… అవుతుంది.

ధనం సంపాదించేవారికే ధనం ఖర్చు చేసే అధికారం అంటారు. కష్టపడ్డవారికే తెలుసు కష్టం విలువ. ఆ కష్టం ద్వారా వచ్చిన ధనం విలువ.

కూర్చుని తినేవారికి ఏమి తెలుసు? డబ్బు కేవలం వినోదాలకు ఖర్చు చేయడమే అవసరం అనే అజ్ఙానంతో ఉంటారు. ఇలాంటి వారి చేతికి ధనం వచ్చినా అది విలాసాలకు లేదా మరొకరి జీవితాన్ని పాడు చేయడానికి ఉపయోగపడుతుంది.

ఆర్ధిక పరిస్థితి బాగున్న కుటుంబంలో కుటుంబ యజమాని ఆర్ధిక క్రమశిక్షణ దాగి ఉంటుంది. అదే కుటుంబంలో సభ్యుడు ఆర్ధిక క్రమశిక్షణ లేకపోతే, ఆ కుటుంబ ఆర్ధిక పరిస్థితి భవిష్యత్తులో పడిపోయే అవకాశం ఉంటుంది. ఆర్ధిక స్థితి కుంటుపడితే, కుటుంబ గౌరవం కూడా సన్నగిల్లడం ప్రారంభం అవుతుంది. అలాగే సంస్థ అయినా సరే!

ఈ ఆర్ధిక క్రమశిక్షణ అంటే ఏమిటి?

వ్యక్తికి అయినా వ్యవస్థకు అయినా ప్రస్తుత అవసరాలు, భవిష్యత్తు అవసరాలు, గతానికి సంబంధించిన ఖర్చులు… మూడు కాలంలో కలుగుతూ ఉంటాయి.

ప్రస్తుత అవసరాలు

అంటే నిత్య జీవనంలో మనిషి, మనిషిపై ఆధారపడిన వారి పోషణకు సంబంధించినవి.

భవిష్యత్తు అవసరాలు

కుటుంబ ప్రయోజనాలు, ఒక ఇల్లు కట్టుకోవడం, పిల్లల చదువులకు, పిల్లల ఉపాధికి సంబంధించిన అంశాలలో ధనం అవసరాలను గుర్తెరిగి ఉండడం

గడిచిన విషయాలు

గడిచిన కాలంలో ఇచ్చిన మాట ప్రకారం కానీ, ప్రణాలిక చేసుకున్న పధకం ప్రకారం కానీ వర్తనమానంలో కానీ భవిష్యత్తులో కానీ ఖర్చు పెట్టవలసిన సమయానికి ఖర్చు చేయకపోతే అది వ్యక్తి నమ్మకం కానీ సంస్థ గౌరవం కానీ తగ్గిపోతుంది.

ప్రస్తుత ఖర్చులలో వర్తనమాన, భూత, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కుటుంబం లేదా సంస్థ యొక్క శ్రేయస్సు కోసం వ్యక్తిగత ప్రయోజనాలకు కానీ స్వార్ధ ప్రయోజనాలకు కానీ విలువ ఇవ్వకుండా ఖర్చుల నిర్వహణ చేయడం ఆర్ధిక క్రమశిక్షణ అయితే అది అందరికీ అవసరం అంటారు.

డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు చేయడమే ఆర్ధిక క్రమశిక్షణ

జీవితంలో డబ్బు మనిషి మనుగడకు ఆక్సిజన్ వంటిది. ఒకానొక సందర్భంలో ప్రాణవాయువు కూడా డబ్బు పెట్టి కొనుక్కోవాలసిన ఆగత్యం వ్యక్తి ఏర్పడుతుందంటే అర్ధం చేసుకోవచ్చును… డబ్బు వ్యక్తి జీవితంలో ఆక్సిజన్ వంటిదని.

ఒక వ్యక్తి డబ్బును సక్రమంగా ఖర్చు చేయడం వలన, ఆ వ్యక్తిని అనుసరించేవారు కూడా డబ్బును సక్రమంగా ఖర్చు చేయాలనే ఆలోచనను కలిగి ఉంటారు.

ఏదైనా సంస్థ డబ్బు విషయంలో సక్రమమైన విధానమును కలిగి ఉంటే, అందులో ఉద్యోగులు కూడా ఆ సక్రమమైన విధానమునే అనుసరించే అవకాశం ఉంటుంది.

సహజంగా అవసరాల కోసం పనిచేసే చిన్న వయస్సు నుండి లేక ఇష్టం కోసం పనిచేసే బాల్యం నుండే డబ్బు అనే ఆలోచన పుడుతూ ఉంటుంది. అయితే అది సక్రమమైన పద్దతిలో సంపాదించే ఆలోచనకు పునాది ఎక్కడంటే సక్రమంగా ఖర్చు పెట్టడం నుండే అంటారు.