By | January 23, 2022

కోవిడ్ కారణంగా చదువు అయితే, ఆగుతుంది…. నడుస్తుంది… కానీ పూర్తి విద్యా సంవత్సరం కొనసాగింపు కావడంలేదు… కారణం కరోనా వైరస్…. కాబట్టి ఒక విద్యా సంవత్సరం నిర్విరామరంగా పూర్తి అయ్యే అవకాశం ఉన్నప్పుడే, విద్యాభ్యాసం బాగుంటుందని అంటారు.

అయితే కోవిడ్ కారణంగా చదువును వాయిదా వేయడం విద్యార్ధిగా తప్పు చేసినట్టే… ఎందుకంటే…. ఈ తెలుగు వ్యాసంలో చదువు వలన ఏమి తెలుసుకుంటాము? పరీక్షలెందుకు? అవగాహన చేసుకుందాం….

ఆటలంటే ఆసక్తి ఉంటే, ఖాళీ లభించినప్పుడు ఆటలు ఆడడం ఆరోగ్యదాయం అంటారు. కానీ కోవిడ్ కారణంగా పరీక్షలు జరగడంలేదనే బాధ ఉన్నవారు అయితే, దానికి దిగులుపడడం కన్నా, మనం చదువులో ఏమి నేర్చుకున్నామో? మనకు మనమే పరీక్షించుకోవడం మేలు అంటారు.

మనం పుస్తకాలు చదివి మరియు పాఠాలు విని, మరలా పుస్తకాలలో మేటర్ చదివి అవగాహన చేసుకోవడం వలన ఆయా సబ్జెక్టులలో విజ్ఙానం పెరుగుతుంది. అయితే పరీక్షలు ఎందుకు?

తెలిసిన విషయం ఎంతమందిలో మనకు ఎంతవరకు తెలుసు? ఎంత బాగా తెలుసు? ఎంత చక్కగా వ్రాయగలుగుతున్నాము? అదే హైస్కూల్ వరకు అయితే, ఇంకా ఎగువ తరగతులలో ప్రాక్టికల్ గా కూడా టెస్టులు ఉంటాయి. ఎంతవరకు ఎంత నాణ్యంగా నేర్చుకున్నామో? తెలియజేసి, తర్వాత ఫలితం తెలుసుకోవడానికి….

పరీక్షలు కేవలం మనం చదువులో ఎంతవరకు అవగాహన

అంటే పరీక్షలు కేవలం మనం చదువులో ఎంతవరకు అవగాహన ఏర్పరచుకున్నామో…. తెలుసుకోవడం కోసమే… ఇంకా మన చుట్టూ ఉన్నవారిలో ఎంత బాగా తెలుసుకున్నామో? ఎంత బాగా తెలియజేయగలమో? ఇంకాస్త ముందుకు వెళితే ఒక ప్రాంతంలో ఉన్న విద్యార్ధులందరిలో మనం ఎంతబాగా అవగాహన చేసుకున్నామో…. మనకు పరీక్షా ఫలితాల వలన తెలియబడుతుంది… ఇంకా సమాజంలో కూడా మనకు ఒక ఐడెంటిటి తీసుకువస్తుంది… ఆ ఐడెంటిటి ఉన్నత చదువులకు… ఆపై ఉద్యోగ ప్రవేశానికి అర్హత అవుతుంది… కానీ పని చేయడానికి పరీక్షలలో వచ్చిన ఫలితాలు కాదు… మన మైండులో నిక్షిప్తం అయిన విషయ పరిజ్ఙానమే…. మన వెంట ఉంటుంది.

దీనిని బట్టి చూస్తే పరీక్షలు మనకు ఒక కాలంలో ఒక ప్రాంతంలో మన చదువు యొక్క అవగాహనా స్థితిని తెలియజేస్తాయి… అందులో పదవతరగతి మొదటి మెట్టు….

ఆపై మరిన్ని మెట్లు… అన్నింటిలోనూ ప్రతి ఏడాది… పరీక్షలలో మంచి ఫలితాలు అవసరమే… అయితే అవి కేవలం ఉన్నత చదువుకు అర్హత కొరకు… ఆపై ఉద్యోగ ప్రవేశానికి అర్హత వరకు ఉపయోగపడితే, ఉద్యోగములో పనిని సమవర్ధవంతగా చేయడానికి మన మనసు గ్రహించని విషయసారమే….ఉపయుక్తమవుతుంది.

కాబట్టి కోవిడ్ కారణంగా చదువు అయితే ఆగదు… పరీక్షలు ఆగవచ్చును…. విద్యాభ్యాసంలో విద్య నేర్చుకునే తపన ఉన్నంతవరకు విద్యతో మనసు మమేకం అవుతునే ఉంటుంది…. అయితే కోవిడ్ కారణంగా చదువులో వచ్చే గ్యాప్… అనవసర విషయాలవైపు మళ్ళకుండా చూసుకోవాలి.

ఉద్యోగంలో పనితీరు బాగుంటేనే ఉద్యోగిగా మంచి గుర్తింపు

పనిచేసే సంస్థలో ఉద్యోగం చేసేచోట పనితీరు బాగుంటేనే ఉద్యోగిగా మంచి గుర్తింపు లేకపోతే ఉద్యోగం ఉంటుంది… కానీ సరైన వృద్ది ఉండదు.

మన స్మార్ట్ ఫోన్ పనితీరు బాగోకపోతే, మరియొక మంచి ఫోన్ కోసం చూస్తాం… అలాగే పనితీరు బాగాలేని ఉద్యోగి విషయంలో కూడా సంస్థలు అలాగే ఆలోచిస్తాయి…

కాబట్టి పనితీరు మెరుగ్గా ఉండడం అంటే, చేసే పనిలో సరైన అవగాహన కలిగి ఉండడమే.

పనిలో సరైన అవగాహన అంటే విషయ పరిజ్ఙానం బాగుండాలి.

విషయ పరిజ్ఙానం కొరకు పాఠ్య విషయాలు పరిచయం అయ్యేది… విద్యార్ధి దశ నుండే….

భాషాపరంగా తెలుగు, హిందీ, ఇంగ్లీషు విషయాలు మనకు పరిచయం అవుతాయి.

సాంఘిక విజ్ఙానం సామాజిక పరిస్థితుల గురించి, చరిత్ర గురించి తెలియజేస్తూ ఉంటాయి.

లాజిక్స్ మాథ్స్ ద్వారా పరిచయం అవుతూ ఉంటాయి.

బౌతిక, రషాయినిక విషయాలను సైన్స్ పరిచయం చేస్తూ ఉంటుంది…

ఇలా ప్రాధమికంగా… ఇంకా లోతుగా పాఠ్య విషయాలు వివిధ రకాలుగా పరిచయం విద్యార్ధి దశలో అవుతుంటాయి. ఉన్నత చదువులలో వాటిలో మరింత అవగాహన ఏర్పరిచే విజ్ఙానం వృద్ది చెందుతూ ఉంటుంది.

అంటే పరియమవుతున్న పాఠ్య విషయాలలో శ్రద్ద వహిస్తే, వాటిని పరిశీలించే సమయంలో ఆయొక్క శ్రద్ద మనకెంతగానో ఉపయుక్తమవుతుంది.

విద్యాభ్యాసం సమయంలో విద్యార్ధుల శ్రద్ద చదువుపై

అటువంటి విద్యాభ్యాసం సమయంలో విద్యార్ధుల విలువైన సమయం వృధా చేయరాదు… ఎందుకంటే ప్రాధమికంగా ఏర్పడే అవగాహన జీవిత పర్యంతము ఉంటుంది…. కావునా చదువంటే ఆసక్తి పెంచుకునే విద్యార్ధులు ముందుగా విషయాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.

విద్యాభ్యాసం సమయంలో విద్యార్ధుల శ్రద్ద చదువుపై ఉండాలి…. కానీ పరీక్షలలో ఎన్ని మార్కులు వస్తాయో అనే భావన మీద కాదు… అవును తోటివారితో పోల్చుకునేటప్పుడు మన మార్కులు తక్కువ కాకుండా ఉండాలంటే, చదివే పాఠాలపై శ్రద్ద పెట్టాలి…. వినే పాఠాలను శ్రద్దగా వినాలి….

అందరి ఆలోచనా ఒకే విధంగా ఉండదు… అందరి దృష్టి కూడా ఒకే విధంగా ఉండదు… కాబట్టే సమాజంలో ఎన్నో వినూత్న మార్పులు చూస్తున్నాము… అలాంటి మార్పులు తెచ్చేవారిలో విద్యార్ధి దశ నుండి ఎంతకొంత గ్రహించన విషయ పరిజ్ఙానం ఉంటుంది… కొందరు ఆదశలోనే తమ లక్ష్యం ఏర్పరచుకుని ఉంటారు… కూడా.

కావునా కరోనా కారణంగా పరీక్షలు వాయిదా పడితే బాధకుండా, ఎంతవరకు మనకు విషయ పరిజ్ఙానం ఉందో మనమే పరీక్షించుకుంటే, తర్వాతి సంవత్సరంలో విషయ పరిజ్ఙానంలో మనం ఎంత శ్రద్ద వహించాలో ఒక అవగాహన ఉంటుంది.

మహానుభావులంతా ఒక్కటో ర్యాంకు వారే అయ్యుంటారా?

సమాజంలో ప్రసిద్ద నాయకులంతా ఒక్కటో ర్యాంకు సాధించినవారేనా? అంటే కాదనే అంటారు… సాదారణ ఫలితాలు సాధించినవారు కూడా ఉన్నత స్థితిని పొందనివారుంటారు. అంటే విషయ పరిజ్ఙానంలో వారికున్న అవగాహనే వారి ఉన్నతికి కారణం అవుతుంది.

ఈ పత్రికా వార్త చూడండి….

ఇంకా పరీక్షలు కాదు జ్ఙానం ప్రధానం ఆర్టికల్ రీడ్ చేయండి.

పరీక్షలు ఒక గ్రూపు విద్యార్ధులలో ప్రధముడుని చూపించి, చదువులో అప్పటికి అతడిని ఆదర్శంగా చూపడానికి…. ఇతర విద్యార్ధులలో విద్యపై అవగాహన పెంచడానికి అయితే, తక్కువ మార్కులు వచ్చినవారు ఇంకాస్త శ్రద్ద పెంచడానికే అయినప్పుడు…. పరీక్షలు కోసం చదవడం కన్నా… విషయాలలోని విజ్ఙానం గ్రహించడానికి చదవాలి.

చదువుతున్న పాఠ్య విషయాలలో అవగాహన కోసం తపించాలి…. అవగాహనకు రానివాటి గురించి టీచర్ల దగ్గర అడిగి తెలుసుకోవాలి… తెలిసినవారి దగ్గర అడిగి తెలుసుకోవాలి… అవగాహన చేసుకునే కొలది విద్య మరింతగా వృద్ది చెందుతుంది.

అటువంటప్పుడు కోవిడ్ కారణంగా చదువు అయితే పరీక్షలుండవనే ఉద్దేశ్యంతో చదువునే సమయంలో పాఠాలు సరిగ్గా వినకపోతే, పాఠాలపై శ్రద్ద పెట్టకపోతే, అది ఆ స్టూడెంట్ భవిష్యత్తుకు అడ్డంకిగా మారవచ్చును….

కోవిడ్ కారణంగా పరీక్షలు జరిగినా, జరగకపోయినా… పాఠాలలో శ్రద్ద వహించడం విద్యార్ధిగా మన కర్తవ్యం… కర్తవ్యతా భ్రష్టత్వం చెందరాదనేది పెద్దల మాట. కాబట్టి పరీక్షల కోసం మనం చదువుకోవడం లేదు… జీవితంలో ఉన్నత స్థితికి చేరే క్రమంలో ఒక లక్ష్యం ఈ చదువులు వలన ఏర్పడవచ్చును. జీవితం ఉన్నత స్థితికి ఎదిగాక, ఈ చదువులలో గ్రహించిన విషయ పరిజ్ఙానమే ఉపయుక్తం కావచ్చును… కాబట్టి మన చదువుల ప్రధానంగా మనలో పరిజ్ఙానం పెంచడానికి కావునా పాఠ్యవిషయాలలో అవగాహనను పెంచుకోవడానికి కృషి చేస్తూ ఉండాలి…