By | July 10, 2024

దేనినీ గుడ్డిగా నమ్మకు కానీ నమ్మకమే ప్రధానం. ఒకేసారి రెండు భావనలు అంటే అద వ్యతిరేక భావనగా భావింపడుతుంది. అయితే కొన్ని కొన్ని విషయాలలో మాత్రం ఆలోచన వివిధ కోణాలలో ఉండాలని అంటారు.

నిజాన్ని అబద్దం అల్లుకుని ఉంటే, అబద్దమునకు ఆర్భాటం ఎక్కువ కాబట్టి కళ్ళకు ముందుగా అబద్దమే కనిపించవచ్చును. చెవులకు ముందుగా అబద్దమే వినబడవచ్చును. పదే పదే అబద్దమే చూడడం లేదా వినడం వలన మననోటి నుండి కూడా అబద్దమే బహిర్గతం అవుతుంది. సహజంగా నిజమంటే ఇష్టపడేవారు కూడా అబద్దమునకు ప్రచారం కల్పించే అవకాశం ఉంటుంది. ఈ తీరున ఆలోచన చేస్తే ఒక విషయమును గానీ ఒక అంశమును గాని గుడ్డిగా నమ్మరాదు. నమ్మకం లేకుండా ఉండరాదు. మూలమేదో నిజమే అయ్యుంటుంది కానీ మన దరిచేరుతున్న విషయంలో ఏది మనం గ్రహిస్తున్నామనేది చాలా ప్రధాన విషయం.

ప్రకృతి అందమైనది. ప్రకృతి సహజ సౌందర్యంగా ఉంటుంది. అటువంటి ప్రకృతిలో అద్బుతమైన శక్తి ఉంది. అందమైన ప్రకృతిలోనూ వికృతి ఉంటుంది. వికృతి భయానకంగా ఉండే అవకాశం ఎక్కువ.