By | April 24, 2022

దర్శకధీరుడు రాజమౌళి సినిమాల ప్రత్యేకత గురించి చూసి, రాజమౌళి నుండి గ్రహవించవలసినదేమిటి? దర్శకేంద్రుడి శిష్యుడు దర్శకధీరుడు రాజమౌళిని అంతా జక్కన అంటారు. ఎందుకంటే, ఆయన సినిమా తీస్తే, ఓ శిల్పం చెక్కినట్టుగా ఉంటుంది. చక్కగా చెక్కబడిన శిల్పం ఎలా ఆకర్శిస్తుందో? రాజమౌళి దర్శకత్వంలో వచ్చే సినిమా కూడా అంతే.

రాజమౌళి సినిమా దర్శకుడిగా పరిచయం అయ్యింది…. ఎన్టీఆర్ సినిమాతోనే… అదే స్టూడెంట్ నెం-1. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్… ఆ తర్వాత సింహాద్రి, సై, చత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ… ఇలా రాజమౌళి ఆకట్టుకున్నాయి….

కధాపరంగా నటీనటుల నుండి రాజమౌళి రాబట్టే నటనకు విజువల్ గ్రాఫిక్స్ తోడైతే ఎలా ఉంటుందో మగధీర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు తెలిసింది… అప్పట్లో అంత బడ్జెట్ సినిమా? అన్న ప్రశ్న వచ్చినా…. సినిమా లాభాల్లోకి వెళ్ళింది…. ఆ తర్వాత ఈగ, బాహుబలి-1, 2, ఇప్పుడు ఆర్ఆర్ఆర్… సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందుతున్నాయి…

దర్శకధీరుడు రాజమౌళి ప్రత్యేకత?

నటీనటులు ఎవరైనా రాజమౌళి సినిమాలో నటించాకా వారు మాత్రమే ఆ పాత్ర పోషించగలరు. అని భావించగలిగే విధంగా సినిమా తీయడం రాజమౌళి ప్రత్యేకత. ఎందుకంటే, ఇంతటి ఖ్యాతి సంపాదించిన రాజమౌళి సినిమాలను వదులుకున్న నటులు ఉన్నారు.

రాజమౌళి సినిమా ఛాన్స్ వదులుకున్న నటులు

విక్రమార్కుడు సినిమా హీరోగా పవన్ కళ్యాణ్ అనుకున్నారు… కానీ ఆ సినిమా రవితేజతో జక్కన సినిమా తీశాడు… ఆ సినిమా చూశాక… ఆ సినిమాలో రవితేజ రెండు పాత్రలకు వేరు నటులను ఊహించే ప్రయత్నం చేయరు. అంటే స్టార్ హీరో కాదన్నా… నటిస్తున్న హీరో నుండి తనకు కావాల్సిన ఫలితాన్ని రాబట్టడంలో రాజమౌళి పట్టువదలడు….

అలాగే సింహాద్రి సినిమాకు బాలకృష్ణ హీరోగా అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ తో ఆ సినిమాను రాజమౌళి తెరకెక్కించారు… ఆ సినిమా చూశా… యమదొంగ పాత్రలో మరొక హీరోనూ ప్రేక్షకుడు ఊహించరు.

బాహుబలి భల్లాల దేవ పాత్రకు వివేక్ ఒమేరాయ్, జాన్ అబ్రహం అనుకున్నారు… కానీ ఆ పాత్రలో రాజమౌళి రానాను నటించజేశారు. బాహుబలి చూశాకా ఆ పాత్రలో మరొక హీరోని ఊహించాల్సిన అవసరం ఉండదు. అలాగే కట్టప్ప పాత్రకు, శివగామి పాత్రకు కూడా ఇతరులను అనుకున్నారు. కానీ ఆయా పాత్రలను తెరపై చూశాకా… ఇతరులైతే ఎలా ఉంటుంది? అనే ఆలోచనే కలగదు.

ఏమిటి? దర్శకధీరుడు రాజమౌళిని చూసి గ్రహించవలసినది?

ఏమిటంటే…. శ్రద్ద. తను తీస్తున్న సినిమాలో పాత్రల స్వభావం గురించి సరైన అవగాహన ఉంటే, అందుకు తగ్గట్టు నటీనటుల నుండి నటనను రాబట్టడం… ఒక్కసారి ఆ నటనను ప్రేక్షకుడు తెరపై చూశాకా…. ఆ పాత్రకు ఆ నటుడు చాలా బాగా చేశారు…. అనే భావన బలపడుతుంది. ఒక సినిమాలు ఎక్కువ పాత్రల నటన బాగుంటే, సినిమా సహజంగా ఆకట్టుకుంటుంది. దానికి తగ్గట్టు కధనం కలిస్తే, అది సినీ అభిమానులకు విందు భోజనమే అవుతుంది.

రాజమౌళి దర్శకత్వం అంటే ఒక తపస్సు లాగానే ఉంటుంది. అందులో నటీనటులు కూడా తపస్పు చేయాల్సి ఉంటుంది… నిపుణులు కూడా… ఇలా అందరి కష్టం ఒకరి నేతృత్వంలో సాగితే, అది మంచి విజయానికి మార్గం అవుతుంది.

తను సినిమాగా మలుస్తున కధపై నమ్మకం. తీస్తున్న సినిమాలో పండించవలసని సన్నివేశాల రూపకల్పనకు ఎంత ఖర్చు అయినా పెట్టించి, నాణ్యమైన సినిమాగా తీయడం రాజమౌళి ప్రత్యేకతగా ఉంటుంది.

కాబట్టి చేస్తున్న పనిని ప్రేమిస్తే, ఆ పని వలననే సమాజంలో మంచి కీర్తిని దక్కించుకోవచ్చును…

ఎస్ఎస్ రాజమౌళి భారీ సినిమాలకు ఓ బ్రాండ్ వంటివారు. అపజయం ఎరుగని సినిమా దర్శకుడు… ఇంకా ఈయన ప్రత్యేకత ఏమిటంటే…? అవకాశాలు వచ్చినా ఇతర భాషలలో సినిమాలు చేయకుండా…. తన భాష అయినా తెలుగు భాషలోనే సినిమాలు తీసి వాటికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేవిధంగా నాణ్యమైన సినిమాలు తీయడం… ఈయనకే సాధ్యం అయ్యింది.

Telugureads