By | November 14, 2021

ఓటు విలువైనది పవిత్రమైనది అమూల్యమైనది అంటూ ఓటు గురించి వింటూ ఉంటాము. అవును ఓటు చాలా విలువైనది. ఓటు అతి పవిత్రమైనది. ఓటు అమూల్యమైనది. కానీ అయిదు సంవత్సరాలకొక్కమారు వచ్చే ఓటు హక్కు అయిదు సంవత్సరాల కాలంపాటు అధికారాన్ని ఒకరికి అప్పగించడమే. మన ప్రజా స్వామ్యంలో మన భవిష్యత్తు ఏవిధంగా ప్రభావితం అవుతుంది?

ఓటు వేయడం అంటే అయిదు సంవత్సరాల కాలంపాటు ఒకరికి అధికారాన్ని అప్పగించడం. ఓటు అనేది మన సమాజం కోసం మనన్ని పరిపాలించడానికి మనం అందించే అధికారం.

రెండు లేక అంతకన్నా ఎక్కువ రాజకీయ పార్టీలు ఇంకా ఇద్దరూ లేక అంతకన్నా ఎక్కువ అభ్యర్దులు ఎన్నికలలో పోటీపడుతూ ఉంటారు. ప్రజాసేవ చేయడానికి ఉత్సుకత చూపుతారు. వారు ఎలాంటివారో మీడియా అనునిత్యం ప్రజలకు తెలియజేస్తూ ఉంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రజానాయకుల గురించి తెలియజేయడం మీడియా బాధ్యతగా చూస్తారు.

సామాజిక స్థితి రాజకీయ పార్టీల ప్రభావం

సామాజిక పరిస్థితులు సామాజిక సమస్యలు నాయకుల తీరు తెన్నులు, పార్టీల ప్రభావం, ప్రభుత్వాల విధానం, ప్రతిపక్షాల ప్రభావం ఇలా సమాజంలో ఎవరి పాత్ర ఎలా ఉందో, ఉంటుందో విశ్లేషణాత్మకంగా వివరించడం, సామాజిక సమస్యలపై ఆయా పార్టీల లేక నాయకుల స్పందనను ప్రజలకు తెలియజేసే కర్తవ్యమును మీడియా చేస్తూ ఉంటుంది.

తమ ప్రాంత ప్రజలు అభివృద్ది కోసం, తమ ప్రాంతములోని సమస్యల కోసం ప్రజల తరపున ప్రాతినిద్యం వహించడానికి సిద్దపడుతూ ప్రజా జీవితంలో వచ్చే నాయకులు, ప్రజల కొరకు పనిచేయడం మొదలు పెడతారు. అందుకు వారు స్వతంత్రంగా ప్రజా నిర్ణయం కోసం ప్రజల ముందుకు వస్తారు. లేదా ఏదైనా రాజకీయ పార్టీ తరపున ప్రజల ముందు నిలబడతారు.

రాజకీయ పార్టీ అధికారములోఉంటే సామాజిక అభివృద్ది కోసం నిర్ణయాలు తీసుకుంటూ కార్యచరణలో నిమగ్నమై ఉంటుంది. అదే రాజకీయ పార్టీ ప్రతిపక్షంలో ఉంటే, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల ప్రభావం ప్రజలపై ఏవిధంగా ఉంటుందో తెలియజేయడానికి ప్రయత్నిస్తుంది.

ఇలా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులు మరియు మీడియా సామాజిక భవిష్యత్తును నిర్ణయిస్తూ ఉంటారు. ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి పరోక్షంగానో ప్రత్యక్షంగానో ప్రజల అమోదం ఉన్నట్టే ఉంటుంది.

ప్రజా వ్యతిరేకత ఓటింగ్ సమయంలో ప్రస్ఫుటం అవుతుంది.

ఎందుకంటే నిర్ణయం తీసుకుంటున్న ప్రభుత్వం ఒక రాజకీయ పార్టీ. ఆ రాజకీయ పార్టీకి అధికారం రావడానికి కారణం ప్రజాతీర్పు. ప్రజాతీర్పు ఎలా అంటే, ఎక్కువ మంది ఓటు వేసి గెలిపించుకున్న నాయకుల ద్వారా ఎన్నుకోబడిన ముఖ్య నాయకుడు నిర్ణయాలు ప్రజలకు అమోదయోగ్యంగా భావింపబడే అవకాశం ఉంటుంది. అయితే అటువంటి నిర్ణయాలకు ప్రజల నుండి వ్యతిరేకత వస్తే అది రాజకీయ నిర్ణయంగా ఉండిపోతుంది కానీ ప్రజా నిర్ణయంగా మారదు.

అలా ఏదైనా నిర్ణయమును ప్రజల నిరసన ద్వారా ప్రభుత్వమునకు తెలియజేస్తారు. ప్రజావ్యతిరేక నిర్ణయాలు ఎక్కువగా తీసుకున్న రాజకీయ పార్టీ ఎన్నికలలో ప్రజల ఓటును రాబట్టుకోలేదు. ప్రజల మన్నన పొందలేదు.

మన ప్రజా స్వామ్యంలో ప్రజలు నిరసన లేదా ఓటు హక్కును వినియోగించుకుని సామాజిక భవిష్యత్తుకు కారణం కాగలగుతారు. అంటే ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం అంటే మన భవిష్యత్తుకు మనమే నిర్ణయాక శక్తిని ఒకరికి అప్పగించడమే అంటారు.

ఓటు మన సామాజిక భవిష్యత్తును శాసిస్తుంది.

టు విలువ అంటే మన సామాజిక భవిష్యత్తు అంటారు. మన రాబోయే తరాలకు మంచి భవిష్యత్తు ఉండాలని భావిస్తూ డబ్బు సంపాదిస్తాము. సమాజంలో పలుకుబడి పెంచుకుంటాము. బంధాలను కలుపుకుంటూ వెళ్లాము. మనతోబాటు అందరూ బాగుండాలని ఆశిస్తూ, గుడులకు వెళ్తాము. పూజలు చేస్తాము. ప్రకృతిని పరిరక్షించుకుంటూ ఉంటాము. అలాగే ప్రకృతిని సమాజాన్ని శాసించే అధికారాన్ని మంచి నాయకులు చేతిలో పెట్టి మంచి భవిష్యత్తు కోసం తపిస్తాము.

ఓటు విలువైనది పవిత్రమైనది అమూల్యమైనది
ఓటు విలువైనది పవిత్రమైనది అమూల్యమైనది

అలా శాసనాధికారాన్ని కట్టబెట్టే ప్రక్రియలో ఓటు అమూల్యమైనది. ఓటు కీలకమైనది. ఓటు అద్భుతమైన ప్రజాయుధం.

ఓటుతో ఒక రాజకీయ పార్టీ భవిష్యత్తును మార్చేయవచ్చును. అలాగే మన సామాజిక భవిష్యత్తుపై శాసనాధికారాన్ని ఒక పార్టీకి కట్టబెట్టవచ్చును. కాబట్టి ఓటు పరమ పవిత్రమైనది… చాలా విలువైనది.

మంచి నాయకుడు మంచి దార్శినికత ఉంటుంది. మంచి దార్శనికుడు మార్గద్శకంగా నిలుస్తాడు. మంచిని పెంచే ప్రయత్నంలో సామాజికపరమైన నిర్ణయాలు చేస్తూ, సామాజిక భవిష్యత్తు కోసం పాటు పడుతూ ఉంటాడు. అలాంటి నాయకుడుని ప్రజలు ఎన్నుకునే ప్రక్రియలో ఓటు చాలా విలువైనది మరియు పవిత్రమైనది కూడా.