స్వయం ఉపాధి అంటే ఏమిటి?
స్వయం ఉపాధి అంటే ఏమిటి?

స్వయం ఉపాధి అంటే ఏమిటి?

స్వయం ఉపాధి అంటే ఏమిటి, ఒక వ్యక్తి యజమాని కోసం పనిచేయడం కంటే, తానే యజమానిగా ఉండడానికి పనిని కల్పించుకోవడం మరియు పనిని కల్పించడం అంటారు. ప్రధానంగా తను చేస్తున్న పనికి తానే యజమాని ఇంకా ఇతరులు కూడా అతని ఆధ్వర్యంలో పనిని పొందే అవకాశం కూడా ఉంటుంది.

కిరాణా, కూరగాయలు, రైస్ డిపో, స్టీల్ సామానులు, ఫ్యాన్సీ, బుక్స్ అండ్ స్టేషనరీ, మొబైల్ షాపులు, బిల్డింగ్ మెటీరియల్స్, చెప్పులు, బట్టలు, హోమ్ నీడ్స్, హార్డ్ వేర్, సిమెంట్ వంటి తదితర షాపుల ద్వారా వ్యాపార నిర్వహణలు చేస్తూ, తమను తాము పోషించుకుంటూ, వారు మరి కొంతమందికి కూడా ఉపాధి చూపుతూ ఉంటారు. పల్లెల్లో అయితే స్వీయ సంపాధన వరకు పరిమితం అయితే, పట్టణాలలో ఇవే వ్యాపారాలలో ఇతరులకు ఉపాధి ఉంటుంది.

టీ అండ్ టిఫిన్స్, బ్యాకరీ, భోజన హోటల్స్, జిరాక్స్, కొరియర్, మొబైల్ రిపేర్, టివి రిపేరు, బైక్ రిపేరు, కార్ రిపేరు, కంప్యూటర్ రిపేరు ఇలా వచ్చిన చేతి పని ఆధారంగా కూడా తమను తాము పోషించుకుంటూ స్వయం ఉపాధిలో జీవన చేసేవారు మనదేశంలో అనేకమంది ఉంటారు.

స్వయం ఉపాధికి అనేక అవకాశాలు ఉన్నాయి, ముఖ్యంగా వ్యవసాయం, తయారీ మరియు సేవల రంగాలలో. అయినప్పటికీ, క్రెడిట్‌కు ప్రాప్యత లేకపోవడం, మార్కెట్‌లకు పరిమిత ప్రాప్యత మరియు వ్యాపార విద్య మరియు శిక్షణ లేకపోవడం వంటి సవాళ్లు కూడా ఉన్నాయి.

స్వయం ఉపాధికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

ముఖ్యంగా స్వయం ఉపాధితో జీవించేవారి సమయం వారి చేతుల్లోనే ఉంటుంది. సంపాధన చక్కగా ఉంటుంటే, సమయం వృధా అయ్యే అవకాశం తక్కువ.

ఒకరి కింద పనిచేయవలసిన ఆగత్యం ఉండదు. తనకు తానే యజమాని.

ఆదాయానికి పరిమితులు అంటూ ఉండవు. వ్యక్తి తెలివితేటలు, మార్కెట్ పరిధి, డిమాంట్ వంటి విషయాల ఆధారంగా ఆదాయం బాగా పెంచుకోవచ్చును.

ఉద్యోగం చేయవలసని పని ఉండదు. తానే ఇతరులకు ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చును.

స్వయం ఉపాధి చేసుకునేవారు కాలం వృధా చేయరు. తమ కాలాన్ని ధనంగా మార్చుతారు. అందువలన వారికి ఆదాయం, వారితో కూడి పనిచేసేవారికి ఆదాయం, ప్రభుత్వానికి పన్నుల రూపంలోనూ ఆదాయం. కాబట్టి సంపాధన బాగా వచ్చే స్వయం ఉపాధి వలన ఆర్దికాభివృద్ది నలుదిశలా జరుగుతుందని అంటారు.

ప్రభుత్వ మద్దతు: వ్యవస్థాపకులకు శిక్షణ మరియు ఆర్థిక సహాయం అందించడం మరియు చిన్న వ్యాపారాలకు క్రెడిట్ యాక్సెస్‌ను పెంచడం వంటి స్వయం ఉపాధికి మద్దతు ఇవ్వడానికి మరియు ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేసింది.

తెలుగులో వ్యాసాలు

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

సమాజం కోసం రాజకీయ నాయకుల నైతికత

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు

ధోరణి అంటే అర్ధం ఏమిటి?

డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు

యాపిల్ ఐఫోన్ 15 తెలుగులో

భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్

మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం