పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుగు

పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుగు కోట్స్… retirement wishes in Telugu

పెంచితే పెరిగేది మంచి, పెంచకపోయినా పెరిగేది చెడు… మంచిచెడులు ఆలోచించి కార్యములు నిర్వహించే నేస్తమా నీవు మార్గదర్శకుడవు…

పుట్టాక, పెరుగుతూ ఎన్నో విషయాలను నేర్చుకుంటూ, జీవితంలో ఎదుగుతూ అనేక పదవులు నిర్వహిస్తూ, చేస్తున్న పదవికి వన్నె తెచ్చే ఉద్యోగులు అనేకమంది మన సమాజంలో ఉంటారు.

సంస్థకు ఆస్తులు ఎప్పటికీ అలానే ఉంటాయని అంటారు. కానీ అది అబద్దం ఈరోజు ఆస్తి కదిలిపోతుంది. ఖచ్చితంగా మీరు సంస్థకు చరాస్థిగా పనిచేశారు.

సమయపాలన గురించి తెలుసుకోవాలంటే మిమ్మల్ని అనుసరిస్తే చాలు… సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో మీకు మీరే సాటి

నిర్వహించిన పదవికి కానీ ఉద్యోగానికి కానీ విరమించవలసిన సందర్భం వస్తుంది. అటువంటి సందర్భంలో పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుగులో తెలియజేయడానికి కొన్ని తెలుగు కోట్స్…

ఒక ముగింపు మరొక ఆరంభానికి ఆది అవుతుంది. ఈ పదవికి మీరు వన్నె తెచ్చారు. మీలాంటి వ్యక్తి మరలా ఎన్నాళ్ళకు చూడగలమో, చూడలేమో తెలియదు… కానీ మీరు మాకు ఆదర్శం…

పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుగు కోట్స్…

ఎక్కడ ఉన్నా సంస్థ పనిమీద దృష్టి సారించి అందరిని కలుపుకుంటూ, తెలిసినది తెలియజేయడంలోనూ, తెలియనిది తెలుసుకోవడంలోనూ నీలాంటి సహచరుడు లభించడం అరుదు.

ఇష్టంగా ఉన్నప్పుడు కాలం ఇట్టే కరిగిపోతుందంటారు. మీరు వచ్చి వెళ్ళడం కూడా అలాగే ఉంది.

అన్ని సౌకర్యాలు ఉంటే తృప్తిగా పని చేసేవారు ఉంటారు కానీ అసౌకర్యంలో కూడా కర్తవ్యంతో పనిచేసిన మీ సహనం అందరికీ మార్గదర్శకం.

పని చేస్తున్నంతకాలం పనిమీదే దృష్టిపెడితే కష్టకాలం కూడా ఇష్టంగానే గడిచిపోతుందని మిమ్మల్ని పరిశీలించినవారికే అవగతం అవుతుంది.

కాలం కలసి వస్తే ఎవరైనా విజయాలు సాధించవచ్చును. ప్రతికూల పరిస్థితులలో కూడా విజయం సాధించడం మీకే చెల్లింది. అలాంటి విజయవంతమైన మీ పదవీకాలం ఎందరికో మార్గదర్శకం.

కొందరు కాలం కలసి వస్తే పదవి పొందుతారు అది వారి అదృష్టం అయితే మీకు ఈ పదవిని నిర్వహించడం ఈ పదవికి పట్టిన అదృష్టం నేడు దూరం అవ్వడం మా దురదృష్టం.

అదేపనిగా పని చేసుకుపోవడం పనివాని లక్షణం అయితే పనిని చేస్తూ, పనిని చేయించడం మీ లక్షణం, అది అందరికీ ఆదర్శవంతం! మీకు…

పదవి విరమణ చేశాకా పదవీకాలం చెబుతుంది ఏం సాధించింది? మీరు సాధించినది మరొకరు సాధించడానికి ఏళ్ళతరబడి ఎదురుచూడాలి.

పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుగు కోట్స్…

ఎవరు ఎంత కాలానికి మార్గదర్శకంగా ఉంటారో తెలియదు కానీ ఈ పదవి ఉన్నంతకాలం ఈ పదవిలోకి వచ్చే వారందరికీ మీరే మార్గదర్శకులు… ఎందుకంటే మీ పనితీరు అంత గొప్పది.

తప్పు చేస్తే క్షమించని గుణం మీది అయినా ఆ గుణమును నియంత్రించి మంచి చెడులను ఎంచి ఎందరికో మంచి చేసిన సహృదయం మీది… ఆ హృదయమే మాకు శ్రీరామరక్ష… కానీ ఆ రక్షణ నేడు దూరం అవుతుంటే….

మీ సహచర్యంలో మమ్మల్ని మేము సరిదిద్దుకోగలిగాం. మీ సంరక్షణలో మేము సంతోషంగా ఉన్నాము. మిమ్మల్ని అనుసరించి మేము మరింతగా గుర్తింపు సాధించాము. మీరు మాపై చూపిన ప్రభావం మాకు శ్రేయస్సుగా మారింది.

ప్రతి పదవికి పరిమిత కాలముంటుంది కానీ ఇప్పుడు మీరు వెళ్తుంటే, ఆ పదవి పరిమిత కాలం మీరున్నంతకాలంగా పెరిగితే బాగుండును అనిపిస్తుంది.

ఎటువంటి పదవికైనా ఒకరికి కొంత పరిమిత కాలమే ఉంటుంది. అలాగే వ్యక్తి వయస్సు రిత్యా ఉద్యోగానికి కూడా పరిమిత కాలమే పని కాలముగా ఉంటుంది. ఇలా పదవీ విరమణ ఉంటుంది. ఉద్యోగ విరమణ ఉంటుంది. పదవికి కానీ ఉద్యోగానికి కానీ వన్నె తెచ్చి, మరలా అటువంటి వ్యక్తి ఎప్పుడు ఆ పదవిని అలంకరిస్తారో అని అనుకునేంతలాగా కొందరి కార్యదక్షత ఉంటుంది.

పదవులు ఉంటాయ్, పదవులలోకి వస్తూ ఉంటారు. వెళ్తూ ఉంటారు. కానీ మీలాంటి వ్యక్తి మాత్రం ఇంతకుముందు రాలేదు… భవిష్యత్తులో రారు…