By | July 14, 2024

ఆసక్తిని బట్టి వార్తలు వస్తున్నాయా? తెలుగు వార్తల్లో వాస్తవం ఎంత? ఒక వ్యక్తి పై గానీ, సామాజిక అంశం గురించి గానీ వస్తున్న వార్త, నిజమేనా? లేదా పుకారా? ఆ వార్తలో వాస్తవం ఎంత? సోషల్ మీడియా వాడకం పెరిగాకా, వార్తలో ఉన్న వాస్తవికత చూడడం కన్నా, ప్రచారానికి పెద్ద పీఠ పడుతుంది.

రెండు పార్టీ ప్రధాన పార్టీలు ఒక ప్రాంతంలో అధికార, ప్రతిపక్ష పార్టీలుగా ఉంటాయి. ఆయా పార్టీల వారికీ కూడా వార్తలో వాస్తవం ఉందో లేదో కూడా తెలియడానికి కూడా రెండు మూడు ఛానల్స్ చూడాల్సిన స్థితి ఉంటుందట.

ఒక వార్తని రెండు మూడు ఛానల్స్ నందు చెక్ చేసుకోవాల్సిన స్థితికి సమాచార వ్యవస్థ మారిపోవడం విడ్డూరం.

ఎక్కువమంది ఆసక్తి చూపించిన తర్వాత వార్త వైరల్ అవుతుందా? లేక ఎక్కువమంది ఆసక్తి చూపే విధంగా వార్త వైరల్ అవుతుందా? ఇప్పుడు ఇదే పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకు సోషల్ మీడియా సాంకేతికతపై అవగాహన ఉన్నవారికే తెలియాలి.

ఎక్కువగా ఇది రాజకీయ అంశాలపై ప్రభావం ఉంటుంది.

అయితే రాజకీయ వార్తలపై న్యూట్రల్ ఉండే న్యూస్ ఛానల్స్ కూడా తక్కువనేట. ఏదో ఒక ఛానల్ ఏదో ఒక పార్టీకి ఎంతో కొంత అనుకూలంగా ఉంటుందనే విషయం కూడా నమ్మకం ప్రజలలో బలపడింది.

అనేక యూట్యూబ్ ఛానల్స్ వచ్చి, ఒక ఛానల్ వచ్చిన వార్తను వైరల్ చేస్తూ ఉంటాయి. ఆ వార్తపై పాజిటివ్ గా విశ్లేషించేవారు, నెగిటివ్ గా విశ్లేషించేవారు కూడా యూట్యూబ్ ఛానల్స్ నందు ఉంటున్నారు. అధికార పక్షానికి అనుకూలంగా విశ్లేషించేవారు, అందుకు అనుకూలంగా ఉండే మీడియా, ప్రతిపక్షానికి అనుకూలంగా విశ్లేషించేవారు, అందుకు అనుకూలంగా ఉండే మీడియా…. ప్రజలు ఇలా రెండు రకాల మీడియాతో రోజూ టచ్ లో ఉంటారు.

ఆసక్తిని బట్టి వార్తలు వస్తున్నాయా?

ఇలా అయితే ప్రభుత్వ అనుకూల వార్తలే ఒక వ్యక్తికి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అతని ఫోన్ ప్రభుత్వ అనుకూల మీడియా వీక్షణలే ఎక్కువగా ఉండడం కావచ్చును

అలాగే ప్రతిపక్షాల వార్తలే కనిపించే విధంగా ఇంకొక వ్యక్తి సోషల్ మీడియా సబ్ స్క్రిబ్షన్లు ఉంటే, అతనికి ప్రతిపక్షానికి అనుకూలంగా ఉండే వార్తలే వస్తూ ఉంటాయి. ఇలా ఒకరు అధికార పక్షం గురించిన పాజిటివ్ వేవ్, మరొకరికి ప్రతిపక్షానికి సంబంధించిన పాజిటివ్ వేవ్ క్రియేట్ అవుతూ ఉంటే, మరి రెండు వైపులా ఉండే వాస్తవం ఎప్పుడు విశీదికరించబడుతుంది?

ఈ విధంగా సమాజంలో వ్యక్తుల ఆసక్తిని బట్టి, వార్తలు కనబడే విధంగా సామాజిక మీడియా ఉంటుంది. ఆ విధంగా ఒకే విధానం వలన ఎక్కడో జరిగిన వాస్తవ ఘటన కన్నా, దానిపై కల్పిస్తున్న ప్రచారానికే ప్రధాన్యత వస్తుంది. అదే ఎక్కువమందికి చేరే అవకాశం ఉంటుంది.

వార్తలో వాస్తవం గుర్తెరగడం మన కర్తవ్యం. కాబట్టి ఇందుకు మార్గం

మీడియాలో మార్పు అంటే, అవి వ్యవస్థలో ఒక వైపు చేరిపోయి ఉంటాయి. వాటిలో మార్పు కన్నా వ్యక్తి ఆసక్తిని మరల్చడమే తేలిక. ఒక వ్యక్తికి కాంగ్రెస్ అంటే, ఇష్టం అతను కాంగ్రెస్ అనుకూలం మీడియాతో బాటు, టిడిపి అనుకూల మీడియాలో వార్తలను కూడా తమ ఆసక్తిలో చేర్చుకోవడం వలన వార్తపై క్రాస్ చెక్ చేసుకోవచ్చును.

న్యూట్రల్ గా ఉండే యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. కానీ అవి ఎంతకాలం న్యూట్రల్ గా ఉండగలవో తెలియదు. కాబట్టి వ్యక్తి తన ఆసక్తిలోనే అధికార, ప్రతిపక్ష అనుకూల మీడియాలకు చోటు కల్పించక తప్పదు.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరు?

నేటి నీ కృషి రేపటికి నీకు

అబద్దం చెప్పిన వారి విలువను తగ్గిస్తుంది?

అభివృద్దికి ఆటంకాలు అంటే ఏవి?

అసత్య ప్రచారాలు వాస్తవాలు గురించి

మధువు మీనింగ్ ఇన్ తెలుగుచిత్తము అనే పదానికి తగిన అర్థం