2024 ఎన్నికల నగారా మ్రోగింది. ఎన్నికలలో మూడు పార్టీల పొత్తులో భాగంగా తొలి బహిరంగ సభలో ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యులు. ప్రధాని నరేంద్రమోదీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్…. ఏపి రాష్ట్ర రాజకీయాలలో 2024 ఎన్నికలలో పొత్తు పార్టీలైన టిడిపి, జనసేన, బిజెపి తరపున తొలి సభ చిలకలూరిపేటలో ప్రజాగళం సభ ప్రారంభం అయ్యింది.
పల్నాడులో పొత్తు పార్టీల ప్రజాగళం సభలో మూడు పార్టీల నుండి ప్రముఖుల హాజరు అయ్యారు. అశేష జనాభా హాజరు అయిన ప్రజాగళం సభలో మూడు పార్టీల ప్రముఖులు ప్రసంగించారు. ఆ ప్రసంగంలో వైసిపి పాలన గురించి మాట్లాడారు. ప్రభుత్వం మారాలి. అంటూ నినాదం చేశారు.
2014లో తిరుపతిలో బాలాజీ సాక్షిగా బిజెపి, టిడిపి, జనసేన పొత్తు పొడించింది. మరలా 2024లో బెజవాడ దుర్గమ్మ సాక్షిగా పొత్తు ప్రారంభం అని పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఇంకా వైసిపి ప్రభుత్వంపై తన పదునైన మాటలతో విరుచుకుపడ్డారు.
అయితే ఈ సభలో ఒక సంఘటన జరిగింది. అదేమిటంటే, పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తుండగా… కొందరు పార్టీ కార్యకర్తలు లైటింగ్ కోసం ఏర్పరచిన టవర్స్ ఎక్కారు అది గమనించిన ప్రధాని మోది పవన్ ప్రసంగం మద్యలో కల్పించుకుని, టవర్ మీద ఉన్నవారందరిని క్రిందకు దిగమని చెప్పారు. తర్వాత మరలా పవన్ కళ్యాణ్ ప్రసంగం మొదలైంది. 2024 ఎన్నికలను కురుక్షేత్రంగా పవన్ కళ్యాణ్ పోల్చారు.
టిడిపి అధినేత నారాచంద్రబాబు నాయుడు చిలకలూరిపేట ప్రజాగళం సభలో మాట్లాడుతూ… ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రధానమంత్రి మోదీని ప్రశంసిస్తూ చంద్రబాబు మాట్లాడారు. వైసిపి పాలనలో రాష్ట్రం వెనుకబడిపోయిందని… దేశంలో ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పదకాల గురించి చంద్రబాబునాయుడు తెలియజేశారు. కరోనా కాలంలో మోదీగారి పాలనను చంద్రబాబు ప్రశంసించారు. వికసిత భారత్ దిశగా భారత్ దూసుకుపోతుందని, మన ఏపి కూడా అందులో పోటీపడాలని ఆయన ఆశించారు. రాష్ట్రంలో అసలు అభివృద్ది లేదని వైసిపి పాలనను విమర్శించారు.
ఈ సభలో మోదీ ప్రసంగిస్తూ… ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారలు తెలుగులో తెలియజేశారు.ఎన్నికల షెడ్యూల్ వచ్చీ రాగానే నేను ఆంధ్ర గడ్డపై అడుగు పెట్టాను. మరలా మూడోసారి అధికారంలోకి రావడానికి త్రిమూర్తులు ఆశీస్సులు ఉన్నాయని భావిస్తున్నాను. జూన్ నాలుగు ఫలితాల రోజు, ఆ రోజు ఎన్.డి.ఏ కూటమి నాలుగు వందల పైగా సీట్లు రావాలి అంటూ ప్రసంగించారు. ఎన్.డి.ఏ కూటమి లక్ష్యం వికసిత భారత్ అలాగే వికసిత ఏపి అన్నారు. పేదవారి గురించి ఆలోచించే ప్రభుత్వం ఎన్.డి.ఏ ప్రభుత్వం అని అన్నారు. మోదీగారి మొత్తం ప్రసంగాన్ని పురంధరేశ్వరిగారు తెలుగులో అనువదించారు.
ఓటర్లను ప్రభావితం చేసే అంశం ఏమిటి?
ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ పాత్ర
సామాజిక విశ్లేషకుడు అంటే ఎవరు?
ఓటరు బాధ్యత ఏమిటి? వివరించండి.
ప్రణాళిక అంటే అర్ధం ఏమిటి? meaning in english
గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యులు
చిత్తము అనే పదానికి తగిన అర్థం
చతురత పదానికి అర్థం చతురత మీనింగ్
అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము
రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు
డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్
మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం
ఇదే ఆటతీరుతో ఉంటే భారత్ కే ప్రపంచకప్….
ప్రశాంత్ వర్మ ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ నీల్ వాటే నేమ్స్ గురుజీ!