By | May 25, 2024
2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఏమిటి?

2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఏమిటి? ఎవరు గెలుస్తారు? ఎవరు ఓటమి పాలవుతారు? దేశంలో లోక్ సభ ఎలక్షన్స్ తో బాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరిగాయి. దేశవ్యాప్తంగా ఇంకా ఎలక్షన్స్ జూన్ 1వ తేదీ వరకు జరుగుతాయి. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడే రావు, కానీ అంచనాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎవరు గెలిచేది? కూటమా? వైసిపినా?

2024లో కేంద్రంలో ప్రధాని మోడీ అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు అవుతారు? చంద్రబాబు నాయుడు? జగన్ మోహన్ రెడ్డి? ఇద్దరిలో ఎవరు? పోలింగ్ ముందు కేంద్రంలో మళ్లీ మోడీకే అవకాశాలు ఎక్కువ అని అన్నీ సర్వేలు చెబితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం సర్వే ఫలితాలు భిన్నం.

రెండు వైపులా విజయావకాశాలు కొట్టి పారేయలేమంటూ విశ్లేషకుల మాటలు ఉంటే, కొందరు విశ్లేషకులు మాత్రం కూటమికే విజయావకాశాలు ఎక్కువ అని కొందరు అయితే మరలా వైసిపినే విజయదుంధుబి మోగిస్తుందని అంచనాలతో ప్రజలలో ఆసక్తిని పెంచేస్తున్నారు.

గతంలోని జరిగిన రాజకీయాలు మాదిరిగా కాకుండా, ఇప్పుడ రాజకీయాలు వేరుగా ఉన్నాయి. ముఖ్యంగా 2019 ఎన్నికలు జరగిని పిమ్మట ఏపిలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. మునుపెరుగని పరిస్థితులు ఏపిలో ఏర్పడ్డాయని ప్రముఖుల అభిప్రాయాలు అయితే, 2024 ఎన్నికలలో ప్రచార పోరులో అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటీ పడ్డాయి.

గతంలో మీడియా వేరు, ఇప్పటి మీడియా వేరు. ఎవరికి ఏ పార్టీ ఇష్టమైతే, ఆ పార్టీకే సంబంధించిన విశేషాలను తెలియజేసే విధంగా మీడియా పరిస్థితి మారిపోయింది.

ఇలాంటి భిన్నమైన తీరులో ఏపిలో ఎలక్షన్ సాగితే, ఫలితాలు ఎటువైపు అంచనాలు అందని పరిస్థితి అయితే, పోలింగ్ తర్వాత వివిధ రకాల అంచనాలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. కూటమి గెలుస్తుందని, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అవుతారని కొన్ని మీడియా వీడియోలు అయితే, వైసిపి వచ్చేస్తుందని, మరలా జగన్ సిఎం అని కొందరి మాట.

ఎవరి అంచనాలు ఎలా ఉన్నా, ఎగ్జిట్ పోల్స్ వచ్చాక మాత్రం అధికారం ఎవరిదో తేలిసోతుందని అభిప్రాయం ఉంటే, ఈసారి ఓటరు కూడా సైలెంటుగా ఓటేసి వచ్చేసారు, అంచనా అందుకోవడం కష్టమేనని మరొక అభిప్రాయం బలపడుతుంది.

కౌంటింగ్ తేదీ జూన్ 4వ తారీఖు అయితే, ఇప్పటి నుండే ఆసక్తి అందరిలోనూ…

మేమే గెలుస్తాం అని అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు చెబుతున్నారు. కానీ ఓటేసిన ఓటరు సైలెంటుగానే ఉన్నారు. గెలిచేదెవరు? రాబోయే కాలంలో ఏపి రాజకీయ పరిస్థితులు ఏవిధంగా ఉండనున్నాయి? అందరిలోనూ ఇదే ప్రశ్న. జూన్ 4వ తేదీ ఉదయం వరకు ఈ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది.

2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఏమిటి?

ఓటర్లను ప్రభావితం చేసే అంశం ఏమిటి?

ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ పాత్ర

సామాజిక విశ్లేషకుడు అంటే ఎవరు?

ఓటరు బాధ్యత ఏమిటి? వివరించండి.

ప్రణాళిక అంటే అర్ధం ఏమిటి? meaning in english

భారత ఎన్నికల సంఘం గురించి

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

పురోగతి meaning in telugu

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు

ధోరణి అంటే అర్ధం ఏమిటి?

డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు

యాపిల్ ఐఫోన్ 15 తెలుగులో

భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్

మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం

ఇదే ఆటతీరుతో ఉంటే భారత్ కే ప్రపంచకప్….

ప్రశాంత్ వర్మ ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ నీల్ వాటే నేమ్స్ గురుజీ!

విజయం అర్థం ఏమిటి? విజయము ఎలా నిర్వచిస్తారు?