తెలంగాణ ఎలక్షన్ మూడ్ 2023 ఎలా ఉంటుంది. తెలంగాణ ఎలక్షన్ మూడ్ 2023 కాంగ్రెస్? లేదా బిఆర్ఎస్? లేదా హంగ్…. అప్పుడే ఊహాగానాలు మొదలు. ఈ ఎన్నికలలో మూడవసారి గెలవడానికి బిఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంటే, కేసిఆర్ హట్రిక్ అడ్డుకుని, అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ప్రయత్నం, తెలంగాణాలో బిజేపిని మరింత పటిష్టం చేయడానికి ఆ పార్టి ప్రయత్నం.
కర్ణాటక ఎన్నికలు తర్వాత కాంగ్రెస్ జోష్ వేరుగా ఉందని రాజకీయ పండితుల అభిప్రాయం. దుబ్బాక రి ఎలక్షన్ దగ్గర నుండి బిజేపి బలం పెరిగందని కూడా అంటారు. వరుసగా రెండు సార్లు అధికారంలో ఉన్న పార్టికి ప్రజలు మూడవసారి కూడా అధికారం అప్పజెబితే అది అద్బుతం అంటారు. ఎందుకంటే రాజకీయాలలో వరుసగా మూడవమారు అధికారం పీఠం దక్కించుకోవడం అరుదుగా జరుగుతుంది అంటారు.
బిఆర్ఎస్ గతంలో టిఆర్ఎస్ 2014, 2018 వరుసగా విజయం సాధించింది. మరల 2023లో మూడవమారు గెలవడానికి బరిలోకి దిగుతుంది.
కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ పధకాలు ప్రజలను బాగా ఆకర్షించాయి, ఇంకా అక్కడి అధికార పార్టిపై వ్యతిరేకత కాంగ్రెస్ పార్టిని విజయ తీరాలకు చేర్చాయి. ఇప్పుడు తెలంగాణాలో కాంగ్రెస్ హవా నడుస్తుందనే, వారి నమ్మకానికి, ఇండియా టుడే సి ఓటర్ సర్వే బలాన్నిస్తుంది.
కాంగ్రెస్ కు 2018 సంవత్సరంలో వచ్చిన ఓటింగ్ శాతం కన్నా, ఇప్పుడు 10 శాతం పైగా ఓటింగ్ వస్తుందని, బిఆర్ఎస్ 9 శాతం ఓటింగ్ కోల్పోతుందని, ఇంకా బిజేపి గతం కన్నా మెరుగైన ప్రదర్శన ఇస్తుందని, ఈ సర్వే తెలియజేస్తుంది.
సంక్షేమ పధకాలు అందించడంలో అన్ని పార్టిలు, ప్రజలను ఆకట్టుకునే విధంగా పధక రచన చేస్తున్నారు.
అయితే ప్రజలు ప్రతిసారి సంక్షేమ పధకాలను చూసి ఓటేస్తారా? చెప్పలేం.
అభివృద్ధి విజయంలో కీలకం అవుతుంటే, సంక్షేమ పధకాలు అదనపు ప్రయోజనం కలిగిస్తాయని అంటారు. అభివృద్ధి జరిగితే, అధికార పార్టికి పధకాలు ప్లస్, లేకపోతె ప్రతిపక్షానికి ప్లస్ అవుతాయని అంటారు.
తెలంగాణా ప్రజలు అధికార మార్పు ఆహ్వానిస్తారా? లేకా అధికార మార్పు వద్దనుకుంటారా? డిసెంబర్ 3న తేలిపోతుంది.
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
తెలంగాణాలో బిఆర్ఎస్ స్థితి?
చిత్తము అనే పదానికి తగిన అర్థం
చతురత పదానికి అర్థం చతురత మీనింగ్
అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము
రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు
డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్
మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం
ఎప్పుడు ఎన్నికలు వస్తున్నా, ఎన్నికలకు ముందు, విశ్లేషకుల వివరణ ఉంటుంది. ఇంకా ఎన్నికలు దగ్గరపడే కొద్ది, కొన్ని సర్వేలు కూడా వెలువడుతూ ఉంటాయి. అయితే అన్నిసార్లు సర్వేలు, ఎన్నికల ఫలితాలకు దగ్గరగా ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కేవలం ఎన్నికల మూడ్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలని ఆసక్తిని బట్టి ఇలాంటి సర్వేలు వెలువడతాయి.