Telugu Bhāṣā Saurabhālu

బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం

బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం గురించి ఉపన్యాసం. world child labour day speech. పనులు చేసే కాలం నుండి పనులు చేయడానికి ఆలోచనతో కూడిన విజ్ఙానంతో బాటు అక్షర పరిజ్ఙానం తప్పనిసరి అయిన రోజులలో బాలలు బడికి పోకుండా పనికి పోవడం దురదృష్టకరం.

ముందుగా మన నినాదం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించబడాలి. అందుకు పెద్దలు, అధికారులు కృషి చేయాలి. పిల్లలు పనికి వద్దు బడికి ముద్దు….

బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం ఉపన్యాస వచనం తెలుగులో

ఒకప్పుడు కుటుంబం. ఆ కుటుంబానికో చేతి వృత్తి. ఆ చేతి వృత్తి కొనసాగడానికి వారసులు అలా ఉండే కాలంలో పిల్లలు కూడా తమ తమ కుటుంబ పెద్దలను అనుసరించి పనులు చేయడం అలవాటు. అప్పటి పరిస్థితులు అవి కాబట్టి పనులు చేస్తూ, తమ పిల్లలకు వృత్తి పనులు నేర్పించేవారు. కానీ నేడు వ్యవస్థ అందుకు భిన్నంగా ఉంది. కానీ బాల కార్మిక వ్యవస్థ మారలేదు. ఇంకా పనిలో పిల్లలు బడికి రావడం లేదు.

మనం చదువుకున్నాం కాబట్టి…. కాదు. కాదు… మనల్ని మన పెద్దలు చదివించారు కాబట్టి. మనం ఉద్యోగాలు చేస్తున్నాం. లేదా వ్యాపారాలు నిర్వహిస్తున్నాం. కానీ పేదరికంలో ఉండేవారిలో పిల్లల జీవితాలు పనికే పరిమితం అవుతున్నాయి. పెద్దల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడం చేత పనికే పిల్లలు కానీ బడికి పోవడం లేదు. అలాంటి వారి స్థితి మారాలి.

బాలలతో పని చేయించుకూడదన్న నిబంధన కేవలం పేపరుకు పరిమితం కాకుండా ఆచరించి చూపాలి. చదువుకునే వయస్సలో చదువుకుంటే, వారి జీవనం అభివృద్ది చెందుతుంది. అదే వయస్సుకు మించిన పనులు పిల్లలకు చెబితే, వారి జీవనం కష్టంగా మారుతుంది. కావునా పిల్లలు పనికి పోకుండా, బడికి పోవాలి.

నేటి బాలలే రేపటి పౌరులు. రేపటి పౌరులు సమర్ధవంతంగా ఉంటే, దేశం సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి నేటి బాలల బడికి పోయి చదువుకోవాలి. రేపటి తరం అంతా అక్షరాస్యులుగా మారాలి. నిరక్ష్యరాస్యత వలన అభివృద్ది కుంటుబడుతుంది. కావునా బాలలు బడికి పోవాలి.

బాలల అభివృద్దితో ఆడుకునే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించబడాలి

గతంలో కేవలం చేతి వృత్తి ఆధారంగా జీవనం సాగిస్తే, వారసులు అదే కొనసాగించి జీవించారు. కానీ నేటి పరిస్థితులు అందకు భిన్నం. నేడు ప్రతి పనికి అక్షరజ్ఙానం తప్పనిసరి అయింది. ఇప్పుడు డబ్బులు చెల్లించాలంటే కూడా అక్షరజ్ఙానం అత్యవసరం అయింది. అలాంటప్పుడు పిల్లలకు విద్య ఎంత అవసరమో తెలియబడుతుంది.

ప్రతి పనికి మెషినరీ ఉంటుంది ప్రతి మిషన్ కు వాడుక విధానం ఉంటుంది. ఆ వాడుక విధానం తెలియాలంటే, అక్షరజ్ఙానం అవసరం. చదివిన వ్యాక్యాలకు సరైన అర్ధం తెలియాలంటే, పిల్లలకు చదువు చాలా ప్రాముఖ్యత కలది. కావునా బాల కార్మిక వ్యవస్థ నశించాలి. బాలబాలికలు బడికి పోయి చదువుకోవాలి. అక్షరజ్ఙానం లేకుండా ముందు ముందు జీవితం చాలా ఇబ్బందికరం అంటారు.

ఇంటి నుండి పని చేయడం మంచిదా? కాదా?

మరి కొన్ని తెలుగురీడ్స్ పోస్టులు

ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా

తెలుగురీడ్స్

10th క్లాస్ రిజల్ట్స్ ఏపి2022

బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు ఎవరితో

యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబర్లను పెంచుకోండి!

ఇమెయిల్ మార్కెటింగ్ టూల్స్ 2022

తెలుగులో వర్డ్ ప్రెస్ బ్లాగింగ్ గురించి

0 responses to “బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Go to top