కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు … తెలిసిన తెలుగు పదాలు అనేకం ఉంటాయి… కానీ కొన్నింటికి మాత్రం అర్ధం తెలియకుండానే ఉపయోగించేస్తూ ఉంటాం. ప్రతి తెలుగు పదము ఒక భావమును ప్రకటించడానికి ఉపయోగించవచ్చు.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

లేక ఒక వస్తువును సంభోదించడానికి ఉపయోగించవచ్చు. ఒక జీవిని సంభోదించడానికో ఉపయోగించవచ్చు. లేక ఒక బంధాన్ని సంభోదించడానికో ఉపయోగించవచ్చు. కొన్ని పదాలు పేర్లుగా ఉంటాయి. ఆ పదం పేరు చెప్పగానే ఒక కీటకము పేరు తెలుస్తుంది. అలాగే కొన్ని పదాలు చెట్లు, మొక్కలు పేర్లుగా ఉంటాయి. ఆయా పేర్లు చెప్పగానే సదరు చెట్టు పేరు గానీ మొక్క పేరు గానీ తెలుస్తుంది. అలాగే కొన్ని పదాలు వివిధ వస్తువులకు పేర్లుగా ఉంటాయి. ఆ పేరు చెప్పగానే ఆ వస్తువు ఏమిటో తెలుస్తుంది. అలాగే కొన్ని పదాలు వివిధ భావనలు కలిగి ఉంటాయి. ఆ పదం చెప్పగానే సదరు భావన తెలియబడుతుంది. కొన్ని పదాలు క్రియలు తెలియజేస్తాయి. ఆయా పదాలు చెప్పగానే జరిగే క్రియ ఏమిటో తెలియబడుతుంది. ఈ విధంగా మన తెలుగులో తెలుగు పదాలకు వాడుక భాషలో అర్ధం తెలుసుకోవడం వలన తెలుగు మాట్లాడడంలో మరింతగా ఉపయోగపడతాయని అంటారు.

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు… ఈ క్రిందిగా…

ఈగ – ఇది ఒక కీటకమునకు పేరు.

ఉడుత – ఇది ఒక జీవి పేరు

ఊయల – పిల్లలను అటు ఇటు ఊపడానికి ఉపయోగించే సాధనం.

ఋషి – తపస్సు చేసిన వారిని ఋషి అంటారు.

ఎలుక – జంతువు పేరు

ఏనుగు – జంతువు పేరు

ఒంటె – జంతువు పేరు

ఔషధము – వ్యాధి నయం చేసే పదార్ధము

అంబరము – ఆకాశం

నింగి – ఆకాశం

దుఖం – వ్యక్తికి మనసుకు బాధ కలిగించు నప్పుడు ఉపయోగించు భావనాత్మక పదం

సుఖం – వ్యక్తికి మనసుకు బాధ సంతోషం నప్పుడు ఉపయోగించు భావనాత్మక పదం

శాంతి – అలజడి లేని మనసు యొక్క స్థితిని శాంతి అను భావనాత్మక పదంతో సంభోదిస్తారు.

సుఖశాంతులు – సంతోషంతో శాంతిగా నిలిచిన వ్యక్తి జీవన స్థితి గురించి తెలియజేయు పదం.

సుఖదుఖాలు – బాధతో ఉన్న వ్యక్తి జీవన స్థితి గురించి తెలియజేయు పదం.

మమకారం – ప్రేమను పంచడంలో వ్యక్తి నుండి వ్యక్తమయ్యే భావనను తెలుపు భావనాత్మక పదం.

తెలుగు పదాలు వస్తువులకు పేరుగా ఉండచ్చు – కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

ఖడ్గము – జంతువును ఖందించడానికి ఉపయోగించు సాధనము.

గంప – కొన్ని వస్తువులను నింపుకుని ఎదురు బద్దలతో అల్లిన వస్తువు… ఎక్కువగా తలపై పెట్టుకుని మోస్తూ
బుట్ట – కొన్ని వస్తువులను చేతితో మోసుకెళ్లడానికి వీలుగా ఉండే సాధనము. ఇవి ఎదురు బద్దలతో లేక ప్లాస్టిక్ మెటీరీయల్ తో చేయబడవచ్చు.

బుట్టబొమ్మ – బుట్ట మాదిరిగా ఉండే బొమ్మను బుట్ట బొమ్మ అని సంభోదిస్తూ ఉంటారు.

ముద్దు – ప్రేమానురాగలు తెలియజేయు చిహ్నంగా జరుపు భావాత్మక చర్య….

వాజ్మయం – వాక్ రూపంలో చెప్పబడడానికి అర్హత కలిగిన విషయ విజ్నానం గ్రంధంగా ఉంటే… అటువంటి గ్రంధాలను వాజ్మయం అంటారు…

చలి – తక్కువ ఉష్ణోగ్రత వద్ద గల వాతావరణమును చలిగా సంభోదిస్తారు.

వేడి – ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద గల వాతావరణమును వేడిగా సంభోదిస్తారు.

మరి కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

కుండ – మట్టితో చేయబడిన పనిముట్టు.

ఛత్రము – వాన వచ్చినప్పుడు తడవకుండా, ఎండగా ఉన్నప్పుడూ నీడ కొరకు వాడే వస్తువు… అదే గొడుగు…

జడ – పొడవైన వెంట్రుకలను ఒక తాడువలె అల్లుకోవడాన్ని జడ అంటారు…

జాడ – ఆచూకీ అని కూడా అంటారు.

కీడు = చెడు
మేను = శరీరం
కొదువ = తక్కువ
నిగ్రహించు = గర్వపడు
ధనం=డబ్బు
కేటాయింపు=ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం
ప్రశంసాపత్రం=మెచ్చుకొంటూ ఇచ్చే పత్రం
నగదు=డబ్బు

బాట – ఒక గమ్యం చేరడం కొరకు నడవడానికి అనుకూలంగా ఉండే దారిని బాట అంటారు

బావ – ఇది ఒక బంధం. అత్త కొడుకు లేక మేనమమ కొడుకుని బావ అని సంభోదిస్తారు.

బావి – భూమిలో నీరు నిల్వ ఉండడం కొరకు లోతుగా తీయబడి, నీరు వాడుకోవడానికి ఉపయుక్తంగా నిర్మించబడినది…

టపా – ఒకరి నుండి వేరొకరికి సందేశం అందించేది.

ఆభరణము – అలంకారంగా మనిషి శరీరంపై ధరించేది.

నాగ – ఒక జాతి పాముకు గల పేరు… పాము స్వరూపంలో ఉండే దైవమును నాగదేవతగా పిలుస్తారు. వ్యక్తుల పేర్లకు కూడా ఈ పదం ఉపయోగిస్తారు.

నగ – బంగారం వంటి లోహాలతో చేయబడిన ఆభరణం

నగిషీ – నగకు మెరుగు పెట్టడం.

డబ్బా – లోహముతో చేయబడిన పనిముట్టు

డబ్బు – మనిషి జీవనవిధానంలో మారకముగా ఉపయోగపడునది.

ధనం – డబ్బుకు పర్యాయ పదం

కోశాగారము – ధనము, నగలు వాటి విలువైన వస్తువులను నిల్వ చేయు గది

వంట – తినే పదార్ధాలను తయారు చేయు ప్రక్రియ

గాడి – ఒక పని విధానం పూర్తి చేయడానికి ఏర్పడి ఉన్న మార్గము.. నీరు ప్రవహించడానికి…

గాడిద – ఒక జంతువుకు సంభోదన

తెలుగు పదాలు సంభోదించే బంధం కావచ్చు

క్షేమంగా=సురక్షితంగా .
సాహసం=తెగింపు(ధైర్యంగా)చేసే పని
ఊపిరి=గాలిపీల్చడం
పతకం=గుర్తింపుగా ఇచ్చే బిళ్ళ.
అవార్డు=బహుమతి,పురస్కారం
కృతజ్ఞతా=ధన్యావాదాలు.
నర్తకి= నృత్యంచేసే స్త్రీ.
నిర్మించుట=కట్టుట.
శతాబ్ది=నూరు సంవత్సరాలు.
ఆలయం=గుడి.
విగ్రహం=దేవుని బొమ్మ.
వ్యాపించు=విస్తరించు.
ప్రమాదం =ఆపద.
అచేతనం =కదలకుండా ఉండు.
పినతండ్రి =తండ్రితమ్ముడు,బాబాయి.
పద్మం=కమలం,తామరపువ్వు.

గారు – వ్యక్తి గౌరవ సూచకంగా పేరు చివరలో వాడు పదము

రధము – మనిషి ప్రయాణం చేయడానికి గుర్రాలతో లాగబడే ఒక వాహనం.

దండ – మెడలో వేయడానికి ఒక తడుకు ఎక్కువ పూలను గుచ్చబడినది.

ధనుస్సు – బాణం సంధించడానికి ఉపయోగించు సాధనం వంగే గుణం కలిగిన కర్ర వంటి వస్తువును కొంతవరకు వంచి, అలా వంచిన కర్రకు రెండు చివరలు కలుపుతూ ఒక తాడును కట్టి తయారు చేసే సాధనమును విల్లు, ధనుస్సు అంటారు.

బాణం – గుచ్చుకోవడానికి వీలుగా ఒక చివర త్రికోణాకృతిలో సూదిగా, రెండవవైపు విల్లుతాడుకు అనుసంధానించే విధంగా లోహముతో తయారుచేయబడి ఉంటుంది. ఒక చోట నిలబడి బాణమును లక్ష్యంవైపు సంధించవచ్చు.

శరం – బాణమునకు మరొక పేరు శరం… అంటే ఇది పర్యాయపదం..

నత్త – సముద్రపు నీటిలో జీవించే జీవి.

పలక – అక్షరాలు దిద్దాడానికి లోహంతో కానీ మట్టితో కానీ చేయబడిన సాధనం.

పాలకులు – అధికారం కలిగి ఉన్నవారిని పాలకులు అంటారు.

పరిపాలన – అధికార వినియోగం

వ్యవస్థ – వ్యక్తులతో ఏర్పడిన ఒక విధానం

వైశాల్యం=ఒక వస్తువు విస్తరించిన ప్రదేశం.
జలకం = స్నానం
సేనాని=సేనలకు అధికారి,సైన్యాధికారి.
తీరం = ఒడ్డు
సర్పం = పాము
తోట = వనము
శిల్పం=రాతిలో చెక్కిన బొమ్మ.
యుక్తి = ఉపాయం
పచ్చిక = గడ్డి
కొలను = సరస్సు
మింటికి = ఆకాశానికి
కుమిలి = బాధపడి
డబ్బు = ధనము
నిశ్శబ్దం = మౌనము
గొప్ప = ఘనము
పాట – గానము
కాల్చు = దహనము
మురికి = మలినము
పిలుపు = ఆహ్వానము

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

తపన = కోరిక
పరంపర = వరుస
మన్నన = మర్యాద
ఆకాశం = గగనము
అర్భకుడు = బక్కపలచటి వాడు, చేతకాని వాడు
కదలిక = చలనము
స్వానుభవం = స్వయంగా అనుభవించినది
సింధువు = సముద్రం
పరిశీలన = వివరంగా తెలుసుకొనటం
ప్రోత్సహం = పురికొల్పటం
నిరంతరం = ఎల్లప్పుడు
అరయు = చూచు, తెలుసుకొను
ఆర్తి = ఆతురత
ఉల్లాసంగా = సంతోషముగా
అమాయకముగా = మోసము తెలియని
అర్చన = పూజ
ఋణం = అప్పు
ఆచరించుట = చేయుట
ఏక = ఒకటి
ఆడంబరము = డంబము, బింకము
ఆవేశము = కోపము
ఇల = భూమి
ఊహ = ఆలోచన
ఋషి = ముని

ఔషధం = మందు
ఏకరువు = నిలుపుదల లేకుండా చెప్పటం
కంటకం = ముల్లు
ఒప్పందం = కట్టుబాటు
కంపం = కదలిక, వణుకు
కథానిక = చిన్నకథ
కలిసి మెలిసి = ఇకమత్యం
కఠోరం = కఠినం
కమఠము = తాబేలు
అనువు = ఉపాయము
ఏరువాక = తొలకరిలో పొలం పనులు మొదలు పెట్టుట
కనకము = బంగారము
వాచికము = వక్కాణము, సమాచారము
కల్ల = అబద్ధం, అసత్యం
కర్తవ్యం = చేయవలసిన పని
అభిరామ = అందమైన, మనోహరమైన
అపహరించు = దొంగలించు
కలప = కట్టె, కర్ర
అమిత = ఎక్కువైన
అపాయం = ప్రమాదం, ఆపద
కునుకు = చిన్నపాటి నిద్ర
అశ్రువు = కన్నీరు
ప్రవాహము = పరంపర, వెల్లువ
అర్పించు = ఇచ్చు
అపరాధం = తప్పు, నేరము
అపహసించు = వెక్కిరించు, ఎగతాళి చేయు
అప్రియం = ఇష్టం కానిది
అహం = నేను అనే భావం
అలుక = కోపం
అమాంతముగా = అకస్మాత్తుగా, ఒక్కసారిగా
అర్థమత్తుడు = ధనం చేత పొగరెక్కినవాడు
అరుగు = వెళ్ళిపోవు
అవధి = హద్దు
అసంఖ్యాక = లెక్కలేనన్ని

లోభి = పిసినారి సౌరభం = సువాసన
నీహారం = మంచు
ఉత్సుకత = కుతూహలం
సౌమ్యం = శాంతం
లయం = వినాశం
అట్టహాసం = పెద్దనవ్వు
తావి = పరిమళం
క్లిష్టం = కష్టమైన
సమగ్రం = సంపూర్ణం
కృపాణం = కత్తి
కళంకం = మచ్చ, గుర్తు
మహి = భూమి
ఊత = ఆధారం
పైకం = డబ్బు
నింగి = ఆకాశం
హారం = దండ
ఇల = నేల
దండు = సేన
నవల = స్త్రీ, ఒక సాహితీ ప్రక్రియ
కోమలి = స్త్రీ
అడచు = తగ్గించు, అణగకొట్టు
స్వప్నం = కల
భీతి = భయం
క్షామం = కరువు
ప్రసూనం = పువ్వు
ఆకాంక్ష = కోరిక

తెలుగు పదాలు వాటి అర్ధాలు

మోతుబరి = ఎక్కువ భూమిని సేద్యం చేసే రైతు(భూస్వామి)
అరమరికలు = తేడాలు
అవసానకాలం = చివరి కాలం
యోగ్యులు = మర్యాదస్తులు
అహంకృతుడు = గర్వం చూపేవాడు
దక్కు = లభించు
కుశలత = నేర్పు
తగాదా = పోట్లాట
వృద్దాప్యం = ముసలి వయస్సు
అవరోధం = అడ్డు
జగడం = పోరు
సమీపించు = వచ్చు
వ్యవహారాలు = పనులు
విషమించు = చేయి దాటిపోవు
భంగ పడు = అవమానపడు
శీతలం = చల్లని, చందనం
తగాదా = తగువు
తకతకలాడు = తొందరపడు
ఉపకరణములు = సాధనాలు
నిశ్చింత = చింతలేకుండా
ప్రీతి = ఇష్టం
ఖరవు = గర్వం
తరణం = దాటడం
లుబ్దత్వం = పిసినారితనం
మంకు = మొండి
ధరిత్రి = భూమి
ఉక్తి = మాట
అన్యం = ఇతరమైన
అమాత్య పీఠం = మంత్రి కూర్చునే స్థానం
వ్యాఘ్రము = పులి
వైనం = విధం
పికం = కోయిల
ఎఱుక = తెలుసు
స్నేహితులు = మిత్రులు
మోదం = సంతోషం
పోరితము = యుద్ధము
అనాలం = నిప్పు
దామం = హారం
కపి = కోతి
పరిపాటి = క్రమం
మైకం = మత్తు
కుటిలం = మోసం
అనంతం = అంతం లేనిది
అరుదెంచి = వచ్చి
సలిలం = నీరు
కౌశలం = నేర్పు
జాయువు = మందు, ఔషధం
సాటి = సమానం
ఠీవి = గాంభీర్యం
ఉద్ది = జత

నమ్రత = వినయం
అంబరం = ఆకాశం
తరుణి = స్త్రీ
పానీయము = నీరు
కలిమి = సంపద
కరము = చేయి
జిత్తు = మాయ
మదం = గర్వం
విమర్శ = సమీక్ష, అవలోకనము
మాసము = నెల
క్షణము = లిప్త, త్రుటి, ముహూర్తం
ధారణ = జ్ఞాపకం
వ్యవహారాలు = పనులు
అపరంజి = బంగారం
కనికరం = దయ
అగ్గువ = చౌకగా
అర్కుడు = సూర్యుడు
దోషము = పొరపాటు
విస్తృతం = విరివిగా
కుములు = బాధపడు
భంగము = ఆటంకం
భానుడు = సూర్యుడు
తమస్సు = చీకటి
పావనము = పవిత్రం
కడుపు = ఉదరం, పొట్ట
తామర = పద్మము, అంబుజము
పావడము = వస్త్రం
పాటవం = నైపుణ్యం
సొంపు = సౌందర్యము
కేళి = ఆట
మూక = సమూహం
శౌర్యం = పరాక్రమం
వల్లి = భూమి, తీగ
పస = సారము, సమృద్ధి
కంక = వెదురు, కోడె
పిరం = ఎక్కువ ధర

మరి కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

అక్కెర = అవసరం
అనర్గళం = ఎడతెరిపిలేకుండా, ఆగకుండా మాట్లాడడం
పిసరు = చిన్నముక్క
అపహరించు = దొంగిలించు
అతిశయిల్లు – పెరుగుతూ ఉండటం
కైకిలి = కూలి
పిడాత = అకస్మాత్తుగా
ఆయిల్ల = గత రాత్రి
అద్భుతం = ఆశ్చర్యం
అభిమానం = ప్రేమ, గౌరవం
మడిగె = దుకాణం
గత్తర = కలరా
తత్తర = తడబాటు
అధికం = ఎక్కువ
అనంతరం = తర్వాత
అనుభవించు = సొంతం చేసుకొను
ఇల = భూమి
ఆడంబరము = డంబము, బింకము
ఆవేశం = కోపం, ఒళ్లు తెలియనికోపం
అభినందించు = ఒక మంచిపని చేసినందుకు కాని,
అలజడి = మనస్సులో బాధ, కలత, గొడవ
ఋషి = ముని
ఏకరువు = నిలుపుదల లేకుండా చెప్పడం
ఒప్పందం = కట్టుబాటు
అమాయకంగా = మోసం తెలియని
అర్చన = పూజ
ఆచరించుట = చేయుట
ఆర్తి = ఆతురత
ఆహ్వానం = పిలుపు
కథానిక = చిన్నకథ
ఉల్లాసంగా = సంతోషంగా
ఋణం = అప్పు
ఏక = ఒకటి
ఏరువాక = తొలకరిలో పొలం పనులు మొదలు పెట్టుట
ఔషధం = మందు
కఠోరం = కఠినం
కంపం = కదలిక, వణుకు
కొంటెపనులు = చిలిపి పనులు
ఖగం = పక్షి
కుదురు = కదలకుండా ఉండటం,
కొలువు = ఉద్యోగం
ఖుషీ = సంతోషం
పిన్నలు = చిన్నవాళ్ళు
కనకము = బంగారము
కర్తవ్యం = చేయాల్సిపని
కల్ల = అబద్ధం, అసత్యం
పూరిగుడిసె = గడ్డిపాక
కుండపోత = కుండముంచినట్లుగా పెద్ద ధారగా పడుతూండటం
కునుకు = చిన్నపాటి నిద్ర
బృందగానం = జట్టుగా పాడుట
కొలను = చెరువు
భాగ్యం = డబ్బు, ధనం, సంపద
కోవెల = గుడి
ఖరం = గాడిద
పింఛం = నెమలిపురి
ప్రీతి = ఇష్టం , ప్రేమ
పేడ = పెండ ఫలం = పండు
బంక = జిగురు
బహుమానం = కానుక, ప్రైజు, ఇనాము
భవనం = ఇల్లు, మేడ

మరిన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు జతచేయబడతాయి….

తెలుగు వ్యతిరేక పదాలు

ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు వర్డ్స్

తెలుగురీడ్స్.కమ్

తెలుగు పర్యాయ పదాలు వివిధ రకాలు

ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా

స్వీయ రచన ఎలా చేయాలి వ్యాసం

telugureads

telugureads blog