తెలుగురీడ్స్ డాట్ కామ్ ఆర్టికల్: తల్లి తలుచుకుంటే ఫోన్ కూడా పిల్లలకు గురువు అవుతుంది. ఈ ఆర్టికల్ వినడానికి క్రింది బటన్ టచ్ / క్లిక్ చేయండి.

స్మార్ట్ ఫోన్ పిల్లలపై ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది… ఇప్పుడు ఓటు హక్కు ఉన్న, కుటుంబ సభ్యులందరి దగ్గరా, స్మార్ట్ ఫోన్ తప్పనసరి అయ్యింది. అందువలన తల్లి దగ్గరా స్మార్ట్ ఫోన్, తండ్రి దగ్గరా స్మార్ట్ ఫోన్… ఇలా అందరి దగ్గరా స్మార్ట్ ఫోన్ ఉండడం వలన వచ్చే ప్రధాన సమస్య పిల్లలకు అందుబాటులో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ముఖ్యంగా తల్లి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే, పిల్లల దగ్గర స్మార్ట్ ఫోన్ ఉన్నట్టే… కాబట్టి తల్లి తలుచుకుంటే ఫోన్ కూడా పిల్లలకు గురువు అవుతుంది. ఇంకా స్మార్ట్ ఫోన్ నుండి దూరంగా పిల్లలను పెట్టడం అసాధ్యమే… స్మార్ట్ ఫోన్ ఓ అలవాటుగా మారిపోతుంది.. పిల్లలు స్మార్ట్ ఫోన్ కు ఎడిక్ట్ అవుతున్నారు! అంటూ ఆర్టికల్స్ రాసుకోవడానికి అదో సబ్జెక్ట్ గా మారిపోతుంది… ఇంకా ఉపన్యాసాలకే పరిమితం అవుతుంది.

అయితే స్మార్ట్ ఫోన్ పిల్లలకు అలవాటు అవ్వకుండా ఉండాలంటే, తల్లిదండ్రులు కూడా ఇంట్లో స్మార్ట్ ఫోన్ ఉపయోగించుకోవడంలో నియంత్రణ పాటించాలి… ముఖ్యంగా పిల్లలతో ఆడుకునే సమయంలో స్మార్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయాలి… అప్పుడే పిల్లలకు స్మార్ట్ ఫోన్ కొంతవరకు దూరం చేయవచ్చు.

పిల్లల చేతికి ఫోన్ రాకుండా ఉండడం అసాద్యం

ఇక పిల్లలు ఎదిగే కొద్ది, వారి చేతిలోకి స్మార్ట్ ఫోన్ రాకుండా ఉండదు.. కాబట్టి… స్మార్ట్ ఫోన్ పిల్లల చేతికి వచ్చే సమయానికి, వారికి విషయాసక్తిని కలుగజేయాలి..

ఎటువంటి విషయాసక్తి పిల్లలలో పెంచాలి? అంటే, నీతి కధలు, చెడు అలవాట్లు ఉండకూడదు. చదువు ఎందుకు అవసరం? ఇటువంటి ప్రశ్నలతో బాటు, చరిత్రలో ప్రసిద్ది చెందినవారి గురించి తెలియజేసే కంటెంట్ వారికి కనబడే విధంగా ఫోనులో మీ సెర్చింగ్ ఉండాలి.

ఇంకా గొప్ప గొప్పవారు ఏ విధంగా జీవించారు? జీవితంలో పైకి రావడానికి ఎటువంటి ఆలోచన ఉండాలి? చదువులో మంచి ఉత్తీర్ణతకు ఎలా చదువుకోవాలి? వివిధ సబ్జెక్టులలో సందేహాలు స్మార్ట్ ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు… ఇలా పలు రకాల విషయాలు, మంచి విషయాలు స్మార్ట్ ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు, అనే విషయం పిల్లలకు అర్ధం అయ్యేలా చేయాలి..

చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే? ఫోనులో వీడియోలు ఎక్కువసేపు చూడడం, అనారోగ్య లక్షణంగా వస్తుందనె విషయం అమ్మలే వారికి ఆప్యాయంగా చెప్పాలి. మరీ ముఖ్యంగా మొబైల్ లో గేమ్స్ ఆడడం మంచిది కాదు, పిజికల్ గేమ్స్ ఆడడమే ఆరోగ్యదాయకం అని పిల్లలకు తల్లిదండ్రులే వివరించి చెప్పాలి… ఇంకా టీచర్లు కుడా…. ఈ విషయంలో పిల్లలకు ప్రత్యేకంగా చెప్పాలి.

పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రుల ఫోనులో మంచి కంటెంట్ కోసం వెతుకులాట ఉండాలి.

మంచి గుణాలు కలిగిన వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తారు? మంచి గుణాలు ఏ విధంగా వ్యక్తులు జీవితాలను తీర్చిదిద్దుతాయి..? ఇటువంటి విషయాలలో పెద్దలు ఫోన్లో వెతుకుతుంటే, అవే పిల్లలకు కూడా కనబడతాయి… అలా కనబడాలంటే స్మార్ట్ ఫోన్ లో ఎప్పుడూ, ప్రేవేట్ కంటెంట్ కోసం సెర్చ్ చేయకూడదు. స్మార్ట్ ఫోన్ విషయంలో పిల్లలను కంట్రోల్ చేయడం కష్టమని తెలిసినప్పుడు, ఆ ఫొనులో మంచి విషయాలు మాత్రమే కనబడే విధంగా ఫోన్ ఉపయోగిస్తూ ఉండాలి… అంతేకాని ఫోన్ కు పాస్ వర్డ్ పెట్టి, అది వారికి చెప్పకుండా ఉన్నా, అది వారిలో మరింత ఆసక్తి, ఫోన్ పై అనురక్తిని పెంచుతుంది… కావున పిల్లలకు ప్రధమ, ప్రధాన గురువు తల్లి కాబట్టి, తల్లి ఫోన్ వాడుక మంచి విషయాలను మాత్రమే చూడాలి… కావునా తల్లి తలుచుకుంటే ఫోన్ కూడా పిల్లలకు గురువు అవుతుంది. తెలుగురీడ్స్ డాట్ కామ్ విజిట్ చేసినందుకు ధన్యవాదాలు.

జీవితంలో క్రమశిక్షణ అవసరం వ్యాసం వ్రాయండి?

రవికాంత్ మార్నింగ్ వాక్ విత్ సోషల్ మీడియా యాప్స్

అంకణము అంటే అర్ధం ఏమిటి?

పునః పునః అంటే అర్ధం ఏమిటి?


కర్ణుడు జీవితం నుండి ఏం గ్రహించాలి?

దీర్ఘకాలిక ప్రణాళికలు అనేది భవిష్యత్ లక్ష్యాలు

telugu padalu ardhalu paryayapadalu

telugureads, అంబారి అంటే అర్ధం ఏమిటి?, తెలుగురీడ్స్