ఒక చిన్న కథ: ఓర్పు విలువ ఒక చిన్న గ్రామంలో ఓర్పు తక్కువ ఉన్నసోము అనే బాలుడుకి పెద్ద ఆశలు ఉండేవి, పని ప్రారంభానికి ముందే, ఆ పని ఫలితం గురించి ఆలోచనలు, బలమైన కోరికలు ఎక్కువ. ఏ పని చేసినా వెంటనే ఫలితం రావాలని ఆశపడేవాడు. ఒకసారి అతను తన తండ్రి విత్తనాలు నాటడానికి పొలానికి వెళుతుంటే, సోము కూడా తండ్రిని అనుసరించాడు.

సోము తన తండ్రితో, “నాన్నా, ఇవి ఎప్పుడు మొలకెత్తుతాయి?”
తండ్రి నవ్వుతూ “కొన్ని రోజులు పడుతుంది బాబూ, అప్పటివరకు ఓర్పుగా వేచి చూడాలి.”

కానీ ఓర్పు లేని సోముకు ఆత్రం ఆగలేదు. తర్వాతి రోజు పొలానికి పోయి, అక్కడ మట్టి తవ్వి చూసాడు. విత్తనం ఇంకా మొలకెత్తలేదు. వెంటనే “ఇవి పనికిరావు” అని అనుకున్నాడు. ఇక ప్రతిరోజూ అలాగే చేశాడు. అందువల్ల విత్తనాలు పాడయ్యాయి.

కొన్ని రోజులకు పొలంలో సోముకు, ఎక్కడా మొలకలు కనిపించలేదు. సోము బాధపడి తన తండ్రిని అడిగాడు, “నాన్నా, మన పొలంలో ఎందుకు మొలకలు రావడం లేదు?”

అప్పుడు తండ్రి ప్రశాంతంగా చెప్పాడు, “నువ్వు ఓర్పు లేకుండా ప్రతిరోజూ తవ్వి చూడటం వల్ల విత్తనాలు పెరగలేకపోయాయి. కాని ప్రక్క పొలంలో చూడు “ఇప్పటికే మొలకలు వస్తున్నాయి, ఎందుకంటే, వాళ్ళు విత్తనాలు నాటి ఊరుకున్నారు. ప్రతి పనికి సమయం ఉంటుంది. ఓర్పుతో ఎదురుచూస్తేనే ఫలితం వస్తుంది.”

ఆ మాటలు సోము బాగా అర్థమయ్యాయి. తరువాత అతను ఓర్పుతో ఉండడం నేర్చుకున్నాడు. మళ్లీ విత్తనాలు నాటినప్పుడు వాటిని తవ్వకుండా జాగ్రత్తగా చూసుకున్నాడు. కొద్ది రోజులకు చిన్న మొలకలు బయలుదేరాయి. సోము ఆనందంతో నిండిపోయాడు.

ఆ రోజు నుండి సోము ఓర్పు యొక్క విలువను తెలుసుకున్నాడు.
నీతి: ఓర్పు ఉంటేనే జీవితంలో విజయం సాధించగలం.

ఎటునుండి చదివినా ఒకే విధంగా ఉండే తెలుగు పదాలు తెలుగు వ్యతిరేక పదాలు అంబుజం అర్ధం + 10 పర్యాయ పదాలు + ఉదాహరణలు

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

తెలుగురీడ్స్ హోం పేజి వెళ్ళండి