ఒక చిన్న కధ: పరిక్షల ఫలితం అంటే కేవలం మార్కులే కాదు. అది విద్యార్ధి తెలుసుకున్న విషయ పరిజ్ఞానానికి పరిక్ష, తనకు తెలిసినది తను సరిగ్గా పరీక్షా పేపర్లో రాయగలగడమే…. కేవలం ఒక్క పరీక్షలో ఫెయిల్ అయితే కాదు తర్వాతి పరిక్షలలో ఎలా సిద్దం అవ్వాలనే ఆలోచన ప్రధానం.

చిన్న కధ : పరిక్షల ఫలితం

రవి చాలా తెలివైన బాలుడు, అతను బాగా చదివేవాడు కానీ ఎవరైనా విమర్శిస్తే, విశ్వాసం లోపిస్తుంది. ఆ విధంగా విశ్వాసం లేదనే ముద్రను పొందాడు..

తర్వాత కాలంలో అతనికి పరీక్షలు ఎదురయ్యాయి. రవి ప్రతిరోజూ చదువుకుంటూ, పరిక్షలకు సిద్దం అయ్యాడు.
“అతనికి టాప్ మార్కులు వస్తాయని నమ్మకం కన్నా… ఎన్ని మార్కులు వస్తే, తన తోటివారి వద్ద ఎలా?… ఇంట్లో ఏమంటారు? అనే ఆలోచనలు ఎక్కువ.”

పరీక్షలు వచ్చాయి. రవి పరీక్షలు రాసాడు. తర్వాత ఫలితాలు వచ్చాయి, కాని అతను అనుకున్న ఫలితం రాలేదు.

రవి దిగాలుగా కూర్చొని బాధపడుతున్నాడు. అప్పుడు అతని దగ్గరకు తాత వచ్చి ఇలా అన్నాడు:
“రవి…  ఎప్పుడైనా సరే, మనము చేయగలిగేది చేయాలి. కానీ చేసేదాని గురించి అనవసర ఆలోచనలు చేయకూడదు. ఎంత చేయగలమో అంతవరకే అలోచన చేయడం ద్వారా పనిలో క్వాలిటీ ఉంటుంది… ఎంత ఎక్కువగా ఆలోచనలు పెరిగితే, పనిలో క్వాలిటీ కూడా తగ్గిపోతుంది… కావున ఇప్పుడు  మార్కులు నీ జీవితానికి గీటురాయి కావు. అవి నువ్వు ఎంత తెలుసుకున్నావో చెప్పే ఒక చిన్న సూచిక మాత్రమే. నిజమైన విజయానికి ఆత్మ విశ్వాసం అవసరం. మరలా తర్వాత నీవు ఎదుర్కొనే పరిక్షలలో అతి ఆలోచనలు తగ్గించి, మనసు స్థిమితం చేసుకుని చదువుకో… నీవు అనుకున్న ఫలితం వస్తుంది.”

ఆలోచన తీరు మార్చుకుంటే మంచి ఫలితం

తాత మాటలు విన్న రవి ఆలోచించాడు.

ఆ రోజు నుంచి అతను తన ఆలోచన మార్చుకున్నాడు:
“నేను చేయగలను… నేను నేర్చుకుంటాను… నేను ఎదుగుతాను.”

అతను చదువుతో పాటు కొత్త విషయాలు నేర్చుకోవడం మొదలుపెట్టాడు. కొద్ది రోజుల్లోనే అతనిలో మార్పు కనిపించింది. స్కూల్‌లో టీచర్లు కూడా అతని ఆత్మవిశ్వాసాన్ని గమనించారు.

కొన్ని సంవత్సరాల తర్వాత, రవి మంచి స్థాయికి చేరుకున్నాడు. అతను అర్థం చేసుకున్నాడు — విజయం మార్కుల వల్ల కాదు, మనలో ఉన్న నమ్మకం వల్ల వస్తుంది.

నీతి:
అతి ఆలోచన కన్నా ఆత్మ విశ్వాసం ప్రధానం. అది కోల్పోకుండా, తన మీద తనకు విశ్వాసం ఉంటే, మార్కులు కాదు… మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్ణయిస్తాయి.

అందలం అర్ధం : పర్యయ పదాలు

ఈరోజు పది పర్యాయపదాలు

యుద్ధం ఫలితాలు : ప్రపంచంపై ప్రభావం

ఎటునుండి చదివినా ఒకే విధంగా ఉండే తెలుగు పదాలు తెలుగు వ్యతిరేక పదాలు అంబుజం అర్ధం + 10 పర్యాయ పదాలు + ఉదాహరణలు

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

తెలుగురీడ్స్ హోం పేజి వెళ్ళండి

కథ: “నిజాయితీ నమ్మకం విలువ వెలకట్టలేనిది”

కొన్ని అసందర్భ పదాలు + వ్యాక్యాలు

చిన్న కథ: ఓర్పు విలువ

కథ: అంతులేని ఆలోచనలు అడ్డంకి అవుతాయి.

Leave a Reply