సెలవులు రాగానే ఆనందం ఇష్టారీతిన ఉండడం వలన సెలవులు అని ఆనందించేలోపు కాలం గడిచిపోతుంది. కాని సెలవులలో కూడా ఒక టైం టేబుల్ పెట్టుకుని, ఆ విధంగా రోజుని నడిపిస్తూ ఉంటే, మీకు సమయపాలన(Time Punctuality) వస్తుంది. సమయపాలన(Time Punctuality) వ్యక్తి జీవితంలో చాలా చాలా ప్రధానమైనది. కాబట్టి వేసవి సెలవులలో కూడా మీకు, ఒక సింపుల్ టైమ్‌టేబుల్ ఉండాలి — చదువు, ఆట, విశ్రాంతి అన్నీ బ్యాలెన్స్‌గా ఉండేలా చూసుకోవాలి. ప్రతిరోజు షెడ్యూల్ ప్రకారం నడుచుకోవాలి.
ఆ టైం టేబుల్ ఖచ్చితంగా అమలు చేయాలి. ఎప్పుడైతే మీరు టైం టేబుల్ ఖచ్చితంగా అమలు చేస్తారో? అది జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఇంట్లో అమ్మ స్కూల్ టైం కి టిఫిన్ చేయలేకపోతే, మీకు కోపం వస్తుంది… అలాగే ఏ పనైనా సరైన సమయానికి పూర్తీ చేసి ఇవ్వడానికే సమాజంలో అన్ని వ్యవస్థలు పని చేస్తూ ఉంటాయి. అటువంటి వ్యవస్థలలో పని చేసేవారికి సమయపాలన(Time Punctuality), వారు ఉద్యోగంలో వృద్దిని సాధించలేరు. కాబట్టి సమయపాలన(Time Punctuality) చాలా ప్రధానమైనది అని, మనకు అర్ధం అవుతుంది కాబట్టి… ఈ వేసవి సెలవులలో సమయపాలన(Time Punctuality) పై దృష్టి పెట్టి, దానిపై పట్టు సాధిస్తే, చాలా పెద్ద విజయం అది.
ఒక చిన్న కధ: పరిక్షల ఫలితం అంటే కేవలం మార్కులే కాదు.
యుద్ధం ఫలితాలు : ప్రపంచంపై ప్రభావం
ఎటునుండి చదివినా ఒకే విధంగా ఉండే తెలుగు పదాలు తెలుగు వ్యతిరేక పదాలు అంబుజం అర్ధం + 10 పర్యాయ పదాలు + ఉదాహరణలు
పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?
తెలుగురీడ్స్ హోం పేజి వెళ్ళండి
కథ: “నిజాయితీ నమ్మకం విలువ వెలకట్టలేనిది”
