విద్యను నేర్చుకోవడానికి స్కూల్ కు వెళ్తున్నాం… అక్కడచెప్పే పాఠాలు కాకుండా, ఇంకా మీకు ఏమిటి ఇష్టం అయితే, మన మనసుకు ఒక ఇష్టం ఉంటుంది. సాహిత్య పుస్తకాలు చదవడం, కధలు రాయడం, మ్యూజిక్, పాడడం, డాన్స్, డ్రాయింగ్, ఏదైనా ఆటలో అమితమైన ఆసక్తి, పరిశోధన… ఇలా ఎదో ఒక అంశంలో మనసుకు ఆసక్తి ఎక్కువగా ఉండవచ్చు. మనసుకు ఏదైతే ఇష్టమో, దానిపై మీరు దృష్టి పెడితే, ఆ విషయం మీకు త్వరగా వస్తుంది.
పుస్తకాలు చదివే ఆసక్తి ఉన్నవారు, వివిధ వర్గాలలో ఉన్న బుక్స్ చదవడానికి ఆసక్తి కనబరుస్తారు. కధలు, గాధలు, చరిత్రలు, మనో విజ్ఞానం, తాత్విక విజ్ఞానం, కవితలు… ఇలా ఎదో ఒక అంశంలో పుస్తకాలూ చదవడానికి మనసు ఉత్సాహపడుతుంది. మంచి పుస్తకాలు చదవడం మంచి అలవాటు అంటారు.
ఏదైనా ఆట అంటే బాగా ఆసక్తి ఉంటె, సెలవులలో ఆ ఆటపై బాగా సాధన చేసి, మంచి కోచ్ సాయం పొందడం చేత, క్రీడాకారునికి మారడానికి అవకాశం ఉంటుంది. అలాగే డాన్స్ వంటి విషయాలలో బాగా ఆసక్తి ఉంటె, ఈ రోజుల్లో డాన్సర్ కావడానికి అవకాశాలు ఎక్కువ… వేసవి సెలవులలో మనసుకు నచ్చిన అంశంలో సాధన వలన, అది మనసుకు బలం అవుతుంది.
వేసవి సెలవులు సందర్భంగా, పెద్దలు సరిగ్గా దృష్టిపెడితే, పిల్లల నైపుణ్యాల అభివృద్ధి కొరకు మరియు కొత్త నైపుణ్యాలు సెలవుల్లో నేర్చుకోవడం వలన పిల్లల అభివృద్ధి ఉంటుంది. ఇంకా విద్యార్థుల నైపుణ్యాలు పెరుగుతాయి. సెలవుల్లో స్కిల్స్ పెంపొందించుకునే టిప్స్ పిల్లకు చెప్పాలి… పిల్లల స్కిల్ డెవలప్మెంట్ కోసం సెలవుల్లో కొత్త విషయాలు తెలుసుకోవడం, వేసవి చిట్కాలు అనుసరించడం సెలవుల్లో స్వయం అభివృద్ధికి అవకాశం ఎక్కువ. విద్యార్థుల భవిష్యత్తు కోసం వేసవి శిక్షణలో భాగంగా పిల్లల అభ్యాసం వలన పిల్లల ప్రతిభ పెంపు అవుతుంది. సరిగా వేసవి ప్రణాళిక అవసరం.
ఒక చిన్న కధ: పరిక్షల ఫలితం అంటే కేవలం మార్కులే కాదు.
యుద్ధం ఫలితాలు : ప్రపంచంపై ప్రభావం
ఎటునుండి చదివినా ఒకే విధంగా ఉండే తెలుగు పదాలు తెలుగు వ్యతిరేక పదాలు అంబుజం అర్ధం + 10 పర్యాయ పదాలు + ఉదాహరణలు
పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?
తెలుగురీడ్స్ హోం పేజి వెళ్ళండి
కథ: “నిజాయితీ నమ్మకం విలువ వెలకట్టలేనిది”
