నవ విధ భక్తి భగవంతుడిపై భక్తికి మార్గాలు

నవ విధ భక్తి భగవంతుడిపై భక్తికి మార్గాలు. వ్యక్తి పుట్టుకకు ప్రయోజనం భగవంతుడిని చేరడమే అయితే, అందుకు తొమ్మిది భక్తి మార్గాలను పెద్దలు చెబుతూ ఉంటారు.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

తొమ్మిది భక్తి మార్గాలలో దేనిని భక్తితో శ్రద్దతో ఆచరించినా తరించవచ్చు అని అంటారు.

శ్రవణం, కీర్తనము, స్మరణం, పాదసేవనం, అర్చన, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అను తొమ్మిది భక్తి మార్గాలు నారదుడు ధర్మరాజుకు చెప్పినట్టుగా ఐతీహ్యం.

శ్రవణం

శ్రవణము అనగా వినడము… అంటే భగవంతుని గూర్చి చెప్పబడిన గాధలు వినడం. ఇంకా భగవంతుడి గురించిన ప్రవచనాలు వినడం. ఇంకా భగవంతుని భక్తుల గురించి వినడం. భగవంతుడి లీలలు గురించి వినడం. ఏదైనా భగవంతుని గురించి శ్రద్ధాభక్తులతో వినడం శ్రవణభక్తి అంటారు.

ధర్మరాజు, జనమేజేయుడు, పరిక్షత్తు వంటి వారు భగవంతుడి గురించి విని తరించారని పెద్దలు చెబుతారు.

వినడానికి ఇప్పుడు భగవంతుడి కీర్తనలు, పాటలు, కధలు, ప్రవచనలు అన్నీ కూడా ఆడియో రూపంలో అందుబాటులో ఉంటున్నాయి…

కీర్తనం

కీర్తనము అంటే గొప్పగా చెప్పుట… భగవంతుడి గొప్పతనం గురించి చెప్పుట. సుగుణాలను కీర్తిస్తూ ఉండడం. సుగుణాలపై ఆరాధన భావంతో మనసును భగవంతుడిపైనే లగ్నం చేయడం. నిత్యం భగవంతుడి సుగుణాలను మనసులో తలుస్తూ, వాటి గురించి మాట్లాడుతూ ఉండడం వలన మనసు భగవంతుడిపై సులభంగా లగ్నం అవుతుందని అంటారు. పూర్వం భక్తులు చేసిన కీర్తనలు భగవంతుడి యొక్క గొప్ప సుగుణాలను తెలియజేస్తూ ఉంటాయి. వాటిని మనసులో మననం చేసుకుంటూ, భగవంతుడి సంకీర్తనలు పాడుతూ ఉండడం…

త్యాగరాజు, అన్నమయ్య వంటి భక్తులు భగవంతుడిని కీర్తించి తరించారు.

స్మరణం

స్మరణ అంటే తలచుకొనుట. సాదారణంగా ఒక్కోసారి దూరంగా ఉండే, స్నేహితుడిని గుర్తు చేసుకుంటాం. అలాంగే దూరంగా ఉండే బంధువును గుర్తు చేసుకుంటాం. ఏదో ఒక బందం దూరంగా ఉన్నప్పుడూ, గుర్తుకు వచ్చిన ప్రతిసారి వారిని తలచుకుంటూ ఉంటాం… జీవిత భాగస్వామి అయితే దగ్గరగా వచ్చేవరకు తలుస్తూ ఉంటాం… అంతవరకు ఏ పనిలోనూ భాగస్వామి ప్రతిరూపం కళ్లముందు కదలాడుతూ ఉంటుంది. అదే తరహాలో భగవంతుడిని తలుచుకోవడం గురించి కూడా స్మరణ భక్తిగా నవ విధ భక్తిలో చెబుతారు.

భాగవన్నామ స్మరణ చేస్తూ నారదుడు ముల్లోకాలు సంచారం చేస్తూ ఉంటాడు. భగవంతుడి లీలలు వింటూ ఉంటే, స్మరించే స్థాయికి మనసు చేరుకుంటుందని అంటారు.

పాదసేవనం

సేవించడం…. భగవంతుడికి సేవలు చేయడం. ఒక గుడిలో రుసుము చెల్లించి సేవలు చేయడమే కాకుండా, స్వహస్తలతో భగవంతుడి సేవలో పాల్గొనడమని చెబుతారు. ఒక పండుగకు ముందు గుడిని శుభ్రపరుస్తూ ఉంటే, అందులో పాలుపంచుకోవడం. భగవంతుడి పల్లకి మోయడం… శరీరమును భగవంతుడి సేవకు వినియోగించడం వలన భగవంతుడి అనుగ్రహం సులభం అంటారు.

అర్చనం

అర్చన భగవంతుడిని పూజించడం. దూప, దీపా నైవేద్యాలతో భగవంతుడిని పూజించడం. సనాతనధర్మంలో శాస్త్రం సూచించిన మాదిరిగా భగవంతుడికి పూజ ద్రవ్యాలు మనసు పెట్టి సమర్పించడం…. మానసికంగా భగవంతుడికి పూజ చేయగలిగే స్థాయి వచ్చే వరకు పూజా ద్రవ్యములతో భగవంతుడిని నిత్యం పూజించడం… మనసులో పూజా మెదులుతూ ఉంటే, మనసు భగవంతుడి పాదాల వద్దే ఉండడం… పూజలో పరమావధి అంటారు. భగవంతుడిని విగ్రహ రూపంలో కానీ ఫోటో రూపంలో కానీ పూజా ధ్రవ్యములతో పూజ చేస్తూ ఉంటారు.

వందనం.

వందనం భగవంతుడి ముందు వినయంగా ఉండడం. వినయంతో నిత్యం భగవంతుడికి వందనం చేయడం. శిరస్సు వంచి పెద్దలకు గౌరవభావంతో వందనం చేసినట్టు, నిత్యం భగవంతుడి రూపానికి మనసులో వందనం సమర్పిస్తూ, బౌతిక దర్శనంలో భగవంతుడి పాదాలకు నమస్కరిస్తూ ఉండడం అంటారు.

ప్రహ్లాదుడు నిత్యం అన్నింటా శ్రీహరి దర్శిస్తూ, అంతటా నమస్కార భావంతోనే ఉండేవాడు.

దాస్యం

దాస్యం చేయడం కూడా సేవ చేయడం లాంటిదే. అయితే దాస్యంలో ఫలితం ఆశించకుండా యజమానికి లొంగి పని చేస్తాం. అలాగే భగవంతుడు తన చుట్టూ ఉన్న లోకానికి యజమాని అని భావించి, భగవంతుడిని ఆరాదిస్తూ ఉండడం.

భగవంతుడికి తనంతట తానుగా దాసుడిగా మారిన హనుమ. అలాగే లక్ష్మణుడు కూడా ఈశ్వరుని వెంటే నిలిచాడు.

సఖ్యం

సఖ్యంగా ఉండడం అంటే స్నేహం చేయడం. ఒక మంచి స్నేహితుడితో ఎలా నడుచుకుంటామో అలాగే భగవంతుడితో స్నేహభావం పెరిగే విధంగా ప్రయత్నం చేయడం. పాండవులు ఈశ్వరునితో సఖ్యతతో ఉండి, నిరంతరం రక్షింపబడ్డారు…. చివరికి తరించారు.

ఆత్మనివేదనం

ఆత్మనివేదనం తనను ఈశ్వరుడికి అర్పించివేయడమే. ఆత్మను ఈశ్వరుడికి అర్పించడంలో బలి చక్రవర్తిని ఉదాహరణగా చెబుతారు.

నేటి రోజులలో స్మరణ చేయడం సులభం… భగవంతుడి గూర్చి చెప్పబడిన ప్రవచనాలు, పాటలు, కీర్తనలు వింటూ ఉండడం వలన మనసు భగవంతుడిపై లగ్నం కాగలదని అంటారు.

భగవంతుడి వైపు మరలిన మనసు భగవంతుడిని స్మరించడం మొదలు పెడుతుంది.

భాగవతం, రామాయణం, మహా భారతం వంటి పురాణ ప్రవచనాలు వినడం అలవాటు అయితే, అది శ్రేయస్కరమని అంటారు.

నవ విధ భక్తి భగవంతుడిపై భక్తికి మార్గాలు

దేవాలయ దర్శనంకు నియమ నిభందనలు చెబుతారు

తెలుగు భజన పాటలు వింటూ

భగవద్గీత తెలుగులో శ్లోకాలు రీడ్ చేయడం వలన భక్తీ భావం బలపడుతుంది.

భక్తి భావనలు

తెలుగురీడ్స్

భక్తి భావం బలమైనది మనసుకు శాంతిని అందిస్తుంది.

రామనామము రమ్యమైనది శ్రీరామనవమి శుభాకాంక్షలు

భక్తి భావన వృద్దికి భాగవతం వినడం సాధనం కాగలదు.

తెలుగులో వ్యాసాలు

తెలుగులో పిల్లల పేర్లు అచ్చ తెలుగులో బాబు పేర్లు

తెలుగులో శుభాకాంక్షలు కొట్స్