శ్రీరాముని పరిపాలన ఎలా ఉండేది

శ్రీరాముని పరిపాలన ఎలా ఉండేది

ప్రభుత్వ పాలన శ్రీరామ పరిపాలనతో పోలుస్తారు. గతంలో గొప్పవారు శ్రీరామరాజ్యం రావాలని ఆకాక్షించారు. ఎన్నికలలో కూడా శ్రీరాముడు గురించి ప్రస్తావన చేస్తూ ఉంటారు. శ్రీరాముని పరిపాలన ఎలా ఉండేది చూసే ముందు శ్రీరాముడు రాజ్యానికి సర్వాధికారి. మరి ఇప్పుడు దేశానికి రాజు రాష్ట్రపతి, కానీ అధికారాలు పరిమితం. అలాగే రాష్ట్రానికి అధిపతి గవర్నర్, అధికారాలు పరిమితం. కానీ వారి సంతకం లేనిదే ఏవిధమైన చట్టం పాస్ కాదు. అలాగే బిల్లులు కూడా.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

దేశంలో ఉన్న అధికార వ్యవస్థలో ప్రభుత్వ ఉద్యోగులు పాలనలో భాగమై ఉంటే, వారిపై పెత్తనం చేసేది ప్రజలు ఎన్నుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. రాజులుగా రాష్ట్రపతి, గవర్నర్ లు ఉంటారు. ప్రభుత్వంలో వివిధ శాఖల మంత్రులు, మంత్రులకు నాయకత్వం వహించే ముఖ్యమంత్రి…. వీరి నిర్ణయాలు కీలకం. వాటినే రాష్ట్రపతి, గవర్నర్లు అమోదిస్తూ ఉంటారు.

అయితే అత్యవసర సమయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు విశేషాధికారాలు రాజ్యాంగం ఇచ్చింది. అప్పుడు వారి నిర్ణయాలను ఆపే శక్తి ముఖ్యమంత్రికి, ప్రధాన మంత్రికి కూడా ఉండదు. కానీ అది ప్రజాస్వామ్యం కాదు. కాబట్టి అటువంటి స్థితికి రాకుండా ప్రభుత్వంలో ఆమాత్యులు చూసుకుంటూ ఉంటారు.

మరి మంత్రి మండలిలో పెద్దలు చేసే నిర్ణయాలను రాష్ట్రపతి లేదా గవర్నర్ ఆమోదిస్తూ, శ్రీరాముడు వలె ఉంటున్నారు. అంటే మనకు శ్రీరాముడి వలె పాలన జరిగిపోతుందని అనుకోవచ్చా?

ఎందుకంటే, మనం ప్రవచనాలలో వింటూ ఉంటాము. శ్రీరాముడికి సర్వశాస్త్రములు తెలుసు. శాస్త్రప్రకారం నడుచుకునేవాడు. ఏదైనా మాట్లాడినా, ఫలానా శాస్త్రంలో ఇలా చెప్పబడింది. కాబట్టి నేను దానిని మీ ముందు చెబుతున్నాను. మీ అభిప్రాయం తెలియజేయండి. అంటూ సభలో పండితులను అడిగేవారట… శాస్త్రం బోధించిన ధర్మాన్ని ఆచరించేవాడట.

ఇప్పుడు రాష్ట్రపతి, గవర్నర్ కూడా అదే విధంగా ప్రజలు ఎన్నుకున్న మంత్రిమండలి చేసిన నిర్ణయాలనే ఆమోదిస్తుంటే, మనకు దేశానికి శ్రీరాముడి వలె ఆచరణ ఉన్నట్టే కదా. చట్టం చేయడం కానీ, బిల్లులు పాస్ చేయడం కానీ రాష్ట్రపతి ఆమోదం వలననే సాద్యపడుతుంది. ఆచరణ శ్రీరాముని వలె రాజ్యాంగంలోనే ఉంది. కానీ నిర్ణయాలు రాముని పరిపాలనలో ప్రజలకు జరిగిన మేలు వలె ఇప్పటి ప్రజలకు జరుగుతుందా? ఇదే పెద్ద ప్రశ్న.

శ్రీ రాముని పరిపాలన ఎలా ఉండేది in telugu,

రాముని పాలన ఆదర్శవంతమైనది. శ్రీరాముని పరిపాలనలో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించేవారు. శ్రీరాముని ధర్మము వలన ప్రకృతిలో ప్రశాంతమైన వాతావరణం ఉండటం. ప్రకృతిని దైవంగా భావించి చేసే కార్యములు ప్రకృతిలో పర్యావరణ సమతుల్యతను కాపాడే విధంగా ఉండడం. శ్రీరాముని పాలనలో ప్రజలే కాదు ప్రకృతి కూడా పులకించిందని అంటారు.

శ్రీరాముని గొప్పతనం ఏమిటి?

దశరధుడి కుమారుడు శ్రీరాముడు. అప్పట్లో తండ్రి మాటను ఆచరించడం. తండ్రి మాటకు కట్టుబడి ఉండడం ధర్మము అయితే… శ్రీరాముడు ఎప్పుడూ తండ్రికి చెడ్డపేరు రాకుండా ఉంటూ, గొప్ప కొడుకుగా అందరిచేత కీర్తింపబడ్డాడు.

శ్రీరాముడు ఎందుకు కీర్తింపబడ్డాడు?

తండ్రి చెప్పాడని, విశ్వామిత్రుని వెంట శ్రీరాముడు అడవులకు వెళ్లాడు.

ఒక రాక్షసిని సంహరించమని విశ్వామిత్రుడు, శ్రీరామునికి చెబితే, అప్పుడు శ్రీరాముడు ”నా తండ్రి మిమ్మల్ని అనుసరించమన్నారు, కాబట్టి మీ మాటే, నా తండ్రి మాట…” అంటూ రాక్షసిని సంహరిస్తాడు. ఇంకా శ్రీరాముడు ఒక రాజపుత్రునిగా కాకుండా ఒక సేవకుడి వలె విశ్వామిత్రుడిని సేవిస్తాడు.

శివధనుస్సుని ఎక్కుపెట్టిన శ్రీరాముడు, సీతమ్మను గెలుచుకుంటాడు. కానీ దశరధుడి ఆజ్ఙ అనంతరం సీతమ్మను శ్రీరాముడు వివాహమాడతాడు.

రాజ్య పట్టాభిషేకం చేసేటప్పుడు, శ్రీరాముడికి అడవులకు వెళ్ళమని దశరధుడు చెప్పడు. దశరధుడి వరం ఆధారంగా కైకేయి శ్రీరాముడికి చెబుతుంది. తండ్రి తనకు ప్రత్యక్షంగా చెప్పకపోయినా, తండ్రి మాటను నిలబెట్టడానికి శ్రీరాముడు 14 సంవత్సరాలు వనవాసం చేయడానికి వెళతాడు.

తరువాత వరాలు పొందిన కైకేయి కూడా అడవులకు వెళ్లొద్దు.. రాజ్యానికి వచ్చేయమంటే, లోకం తన తండ్రిని తప్పు పడుతుంది. తన తండ్రికి మచ్చ రాకూడదని, 14 సంవత్సరాలు వనవాసం పూర్తి చేస్తాడు.

సీతాన్వేషణలో శ్రీరాముడు ధర్మబద్దంగా జీవించే సుగ్రీవునితో స్నేహం చేశాడు కానీ అక్రమంగా జీవించే వాలితో కాదు.

శ్రీరాముడు కష్టమైనా, సుఖమైనా ధర్మబద్దంగానే నడుచుకున్నాడు. వ్యక్తిగతంగా తన వ్యక్తిత్వంపై కానీ తన తండ్రి మాటపై కానీ మచ్చ పడకుండా అన్ని కష్టాలను భరించాడు.

పాలనను రామరాజ్యంతో పోలుస్తారు, కదా శ్రీరాముని పరిపాలన ఏ విధంగా ఉండేదో నివేదిక వ్రాయండి

పరిపాలన చేసేటప్పుడు కానీ, వ్యక్తిగతంగా ప్రవర్తించేటప్పుడు కానీ శ్రీరాముడు ధర్మం తప్పలేదు. శాస్త్రాలు బోధించిన ధర్మాలనే అనుసరించేవాడట.

ఏదైన మాట చెప్పేటప్పుడు…

శాస్త్రంలో ఇలా చెప్పబడింది. శాస్త్రం చెబుతుంది కాబట్టి, ఆ ప్రకారం ఇప్పుడు ఇలా చేస్తున్నాను చెప్పి పరిపాలన చేయడం శ్రీరాముడికి అలవాటు అంటారు.

మరి ఇప్పుడు రాజ్యంగ వ్యవస్థలో రాజులుగా ఉన్న రాష్ట్రపతి, గవర్నర్లు కూడా కేవలం సభా పెద్దలు చేసిన నిర్ణయాలను ఆమోదించడం వరకే… వ్యవస్థ శ్రీరాముడి ఆచరణ వలె ఉంటే, వ్యవస్థలో పాలనా యంత్రాంగం ఎలా ఉందో చూసుకోవాలి.

శ్రీ రాముని పరిపాలన matter in తెలుగు,
About శ్రీ రాముని పరిపాలన,
పాలనను రామరాజ్యంతో పోలుస్తారు, కదా శ్రీరాముని పరిపాలన ఏ విధంగా ఉండేదో నివేదిక వ్రాయండి
రాముని గొప్పతనం, రామ రాజ్యం అంటే

తెలుగులో వ్యాసాలు

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

తెలుగు వ్యాసం పండుగలు ప్రాముఖ్యత అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ఇంటర్నెట్ ఉపయోగాలు నేడు నెట్ లేకపోతే జీవితం ముందుకు సాగదు

ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? తెలుగులో వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

సమాజం కోసం రాజకీయ నాయకుల నైతికత

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

ధోరణి అంటే అర్ధం ఏమిటి?