Category Archives: తెలుగు సమాచార విషయాలు

తెలుగు సమాచార విషయాలు తెలుగులో తెలియజేసే ప్రయత్నం తెలుగురీడ్స్ పోస్టులలో… సమాచారం మనకుండే అవకాశాలకు అనుగుణంగా ఆలోచనలు స్ఫురించే విధంగా ఉండవచ్చును. అందుబాటులో ఉండే అవకాశాలు గురించి, మనకు తెలిసిన సమాచారాన్ని బట్టే అవగాహన ఉంటుంది.
తెలుగు సమాచార విషయాలు తెలిసి ఉంటే,
తెలుగువారం కాబట్టి తెలుగులో గల విషయాలు త్వరగా అవగాహన చేసుకుంటాం. కాబట్టి తెలుగులో సమాచారం వలన తెలుగువారికి గల అవకాశాల తెలియబడే అవకాశం ఉంటుంది. తెలుగు మాత్రమే తెలిసినవారికి సమాచారం అందించే విషయాల వలన ప్రయోజనకర సమాచారమే అందే అవకాశం ఉంటుంది.
తెలిసిన తెలుగు విషయాలను తెలియజేస్తూ ఉంటే, తెలియనివారికి అది సాయపడవచ్చును. కనుక తెలిసిన సమాచారం తెలుగురీడ్స్ సమాచారంలో విషయాలు వర్గములో తెలుగు పోస్టులు రీడ్ చేయండి.
సమాచారమే మనకు సరికొత్త ఆలోచనకు నాంది కావచ్చును. అవసరానికి అవకాశం ఉందనేది తెలిసిని సమాచారాన్ని బట్టి ఆలోచనలు స్ఫురిస్తాయని అంటారు.
వివిధ విషయాలలో సమాచార విషయాలు గురించి
వివిధ విషయాలలో తెలిసిన సమాచారం గురించిన విషయాలు తెలుగులో రీడ్ చేయండి. తెలుగురీడ్స్ నుండి తెలుగు బ్లాగ్ పోస్టుల ద్వారా బ్లాగింగ్ విషయాలు తెలుగులో, డబ్బులు సంపాదన విషయాలు, పెట్టుబడి ద్వారా ఆదాయ అవకాశాలు… వివిధ రకాల విషయాలలో వివిధ తెలుగులో సమాచారముపై తెలుగు విషయాల పోస్టులు…

మొబైల్ ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు

మొబైల్ ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు మన సమాజం వేగవతంగా డిజిటలైజ్ అవుతుంది. అందులో భాగంగా స్మార్ట్ ఫోన్ అందరికీ అవసరమే… అది ఎంత ప్రయోజనమే, దాని వలన అంతే నష్టం కూడా లేకపోలేదు అనే వాదన కూడా ఉంది.

ఇటీవలి కాలంలో ప్రపంచంలో మొబైల్ ఫోన్లు బాగా వృద్ధి చెందాయి. ప్రజలంతా మొబైల్ ద్వారా సంప్రదింపులు జరుపుకుంటున్నారు. వేరు వేరు చోట్ల నివాసం ఉండే ప్రజలు, కేవలం మొబైల్ ఫోన్ ద్వారా సంభాషించుకోవడానికి బాగా అలవాటు పడ్డారు. మొబైల్ ఫోన్లు వ్యక్తుల జీవితాలపై ఎక్కువ ప్రభావం చూపుతాయని అర్ధం అవుతుంది. అయితే మొబైల్ వలన ప్రజలకు లాభాలు ఉన్నట్టే, నష్టాలు కూడా ఉంటాయి.

మొబైల్ ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు
మొబైల్ ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు

అరచేతిలో ప్రపంచం గురించి తెలుసుకోవడానికి… అరచేతి నుండే ప్రపంచానికి పరిచయం కావడానికి స్మార్ట్ ఫోన్ దోహదపడుతుంది.

సెల్ ఫోన్ వల్ల లాభాలు ఏమిటి? – మొబైల్ ప్రయోజనాలు

సుదూర ప్రాంతాలలో నివసించే స్నేహితులతో, బంధువులతో వెను వెంటనే సంభాషణలు చేయవచ్చును. వీడియో కాలింగ్ ద్వారా కూడా ఒకరినొకరు చూసుకుంటూ సంభాషించుకోవచ్చును. ఈ విధంగా స్మార్ట్ ఫోన్ ప్రజల మద్య కమ్యూనికేషన్ కు బాగా ఉపయోగపడుతుంది.

వ్యాపారస్తులకు కూడా స్మార్ట్ ఫోన్ చాలా ఉపయోగం. ఇంటర్నెట్ ద్వారా అనేక విషయాలను స్మార్ట్ ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చును. పాటలు వినవచ్చును. వీడియోలు చూడవచ్చును. వివిధ అప్లికేషన్స్ ద్వారా కొన్ని కంప్యూటర్ లో చేయగలిగే పనులు కూడా స్మార్ట్ ఫోన్ ద్వారా చేసుకోవచ్చును.

మొబైల్ ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు
మొబైల్ ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు

చెప్పాలంటే రాబోయే రోజులలో స్మార్ట్ ఫోన్ లేకుండా వ్యక్తి జీవితం గడవడం కష్టమేనని చెప్పవచ్చును.

సెల్ ఫోన్ వల్ల నష్టాలు – మొబైల్స్ వలన అప్రయోజనాలు

అవును మొబైల్స్ మన జీవితంలో భాగమైపోతున్నాయి. స్మార్ట్ ఫోన్ ప్రయోజనకారిగా ఉంటూ, మనకు నష్టం కూడా చేస్తుంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ నుండి వచ్చే రేడియేషన్ వ్యక్తి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని వైద్యులు సూచిస్తారు. ఇంకా పిల్లలకు స్మార్ట్ ఫోన్ అలవాటుగా మారుతూ, వారిని బౌతిక ఆటలకు దూరం చేయడంలో స్మార్ట్ ఫోన్ ప్రభావం చూపుతుంది. అంతే కాదు కొందరికి స్మార్ట్ ఫోన్ వ్యసనంగా మారుతుంది. కొందరు ఆటలు ఆడుతూ స్మార్ట్ ఫోనుతోనే ఎక్కువగా కాలం గడిపేస్తూ ఉంటారు. కొందరు ఏదో వీడియోలు చూస్తూ స్మార్ట్ ఫోనుతోనే సన్నిహితంగా ఉంటారు. ఏదో ఒక అంశం స్మార్ట్ ఫోను వ్యక్తిని ఆకర్షిస్తూ, అతనిని అతని బౌతిక సమాజం నుండి దూరం చేయడంలో స్మార్ట్ ఫోన్ కీలక పాత్ర పోషిస్తుంది. స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగాకా కుటుంబ జీవనంలో కూడా వ్యత్యాసాలు వస్తున్నాయని అంటారు.

ఉపయోగించుకుంటే, స్మార్ట్ ఫోన్ ద్వారా అనేక విద్యా విషయాలను తెలుసుకోవచ్చును. అలాగే అనవసర విషయాల వైపు కూడా ఆకర్షితులయ్యే అవకాశం స్మార్ట్ ఫోన్ వలన అధికంగా ఉంటుంది. ఇంకా స్మార్ట్ మోసాలు కూడా పెరుగుతూ, డబ్బులు పోగొట్టుకునేవారు కూడా మనకు వార్తాసమాచారంలో కనబడుతూ ఉంటారు. ఏదైనా ఒక వస్తువుని ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే ఉపయోగిస్తే, ఆ వస్తువు అతనికి ఉపకారిగా మారుతుంది. అదే వస్తువుతో ఎక్కువసేపు గడిపితే, ఆ వస్తువు అతనికి లాభం కన్నా నష్టం ఎక్కువ చేస్తుంది. ఈ విధంగా ఆలోచన చేసినప్పుడు స్మార్ట్ ఫోన్ ముందుగా నష్టపరిచేది, వ్యక్తిని ఒంటరిని చేయడమే….

విద్యార్థులపై సెల్ ఫోన్ ప్రభావం

చదువుకున్న తల్లిదండ్రుల చేతిలో స్మార్ట్ ఫోన్ ఖచ్చితంగా ఉంటుంది. వారు వారి పిల్లలను పెంచే కాలంలో, పిల్లలకు స్మార్ట్ ఫోన్లు అలవాటు చేయడం జరుగుతుంది. ఇదే ప్రధానంగా పిల్లలకు స్మార్ట్ ఫోన్ వాడుకకు మక్కువ చూపుతున్నారు. ఎలాగంటే?

సెల్ ఫోన్ వల్ల నష్టాలు - మొబైల్స్ వలన అప్రయోజనాలు
సెల్ ఫోన్ వల్ల నష్టాలు – మొబైల్స్ వలన అప్రయోజనాలు

పిల్లలు అన్నం తినడానికి, పేచి పెడుతుంటే, చందమామను చూపిస్తూ, వారికి ఊసులు చెబుతూ అన్నం తినిపించేవారు. కానీ ఈ స్మార్ట్ కాలంలో ఉన్న అమ్మలు… పిల్లలకు స్మార్ట్ ఫోనులో చందమామ లేకపోతే, స్మార్ట్ ఫోనులో పిల్లల వీడియోలు పెడుతూ, అన్నం తినిపించడం జరుగుతుంది. దీని వలన రేడియేషన్ కలిగిన ఫోన్ చిన్ననాటి నుండే పిల్లలతో మమేకం అవుతుంది. రేడియేషన్ ఎంత హానికరమో? వైద్యులు చెబుతూనే ఉంటారు. కానీ కొందరు చేసే ఈ పనుల వలన పిల్లలకు చిన్ననాటి నుండే స్మార్ట్ ఫోనే అంటే ఆసక్తి పెరుగుతుంది.

చదువుకునే వయస్సులో టీచర్ ద్వారా చెప్పబడే పాఠాలు వినడం వలన విద్యార్ధికి ఊహా శక్తి పెరుగుతుంది. కానీ స్మార్ట్ ఫోన్ ద్వారా తెలుసుకోవడం వలన ప్రయోజనం కన్నా స్మార్ట్ ఫోన్ పై ఆధారడడానికి అలవాటు పడే అవకాశం ఎక్కువ అంటారు.

విద్యార్ధులకు వయసుకు మించిన విషయాలలో అనవసర పరిజ్ఙానం కూడా స్మార్ట్ ఫోన్ల ద్వారా తెలియబడే అవకాశం ఉండడంతో విద్యార్ధులపై స్మార్ట్ ఫోన్ నెగటివ్ ప్రభావం చూపే అవకాశం ఉంటుందని అంటారు.

ఈ విధంగా మనపై మొబైల్ ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు కూడా ఉన్నాయని చెబుతారు.

ధన్యవాదాలు

తెలుగురీడ్స్

ఏపీ టెట్ 2022 గురించి సమాచారం

ఏపీ టెట్ 2022 గురించి సమాచారం తెలుగులో… ఉపాధ్యాయ వృత్తిలో ఉండి, ప్రభుత్వం తరపు పాఠశాలలో ఆధ్యాపక పాత్రను పోషించడానికి అవకాశం వచ్చింది. ఇప్పుడు ఈ అవకాశం వినియోగించుకోవడానికి ఆన్ లైన్ ద్వారా ఏపీ టెట్ 2022 కు అప్లై చేసుకోవాలి. ఫీ పేమెంట్ చేయాలి. ఎగ్జామ్ వ్రాయాలి. ఆపై క్లాలిఫై అయితే, తర్వాతి నియామాకాలు జరిగినప్పుడు ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది.

ఈ క్రింది బటన్లలో ఏపి టెట్ సిలబస్ లింక్, టెట్ నోటిఫికేషన్, షెడ్యూల్, పేమేంట్, అప్లికేషన్ డౌన్ లో లాగిన్ బటన్లు ఉన్నాయి. వాటిపై క్లిక్ చేస్తే సదరు లింకుల వెబ్ పేజిలు ఓపెన్ అవుతాయి.

AP TET Syllbus AP TET Notification aptet_2022_schedule aptet_payment aptet_login

రేపటి నుండి 16-06-2022 తేదీ నుండి ఏపి టెట్ ఆన్ లైన్లో అప్లై చేయవచ్చును.

ఆఖిరి తేది 16.07.2022 తేదీ ఉంది.

విజయవంతంగా ఆన్ లైన్ అప్లికేషన్ అమోదం పొందినవారు, జులై 25వ తేదీ నుండి హాల్ టిక్కెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చును

ఏపీ టెట్ 2022 గురించి పరీక్షల తేదీ

2022 ఆగష్టు 6వ తేదీ నుండి ఆగష్టు 21వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

ఏపీ టెట్ 2022 ఫైనల్ రిజల్ట్ 14.09.2022.

మరి కొన్ని తెలుగురీడ్స్ పోస్టులు

కేంద్ర ప్రభుత్వ అటల్ పెన్షన్ యోజన పథకం

గూగుల్ యాడ్ సెన్స్ బదులుగా యాడ్ నెట్ వర్క్

బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం

ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా

తెలుగురీడ్స్

10th క్లాస్ రిజల్ట్స్ ఏపి2022

బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు ఎవరితో

యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబర్లను పెంచుకోండి!

ఇమెయిల్ మార్కెటింగ్ టూల్స్ 2022

తెలుగులో వర్డ్ ప్రెస్ బ్లాగింగ్ గురించి

పద్దెనిమిది నెలల్లో పదిలక్షల ఉద్యోగాలు

పద్దెనిమిది నెలలో పదిలక్షల ఉద్యోగాలు అంటూ వార్తా సమాచారం ఉంది. ప్రచారంలో ఉన్న ఈ సమాచారంలో ఏడాదిన్నర కాలంలో పదిలక్షల ఉద్యోగాల నియామాకాలు జరగాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీగారి ఆదేశాలు. ఈ సమాచారం యువతకు సంతోషకరమైన సమాచారమే. ఎందుకంటే పదిలక్షల అర్హులైన యువతికి ఉద్యోగాలు రాబోయే పద్దెనిమి నెలల్లో పొందే అవకాశం ఉంటుంది. ఎంతో కాలంగా వేచి ఉంటున్న యువతకు ఉద్యోగావకాశాలు రాబోతున్నాయి.

పద్దెనిమిది నెలల్లో పదిలక్షల ఉద్యోగాలు నియామాకాలు జరగాలని

దాదాపుగా పది లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని మోదీ ఆదేశించారు. ఇంకా పనిని పూర్తి చేయడానికి పద్దెనిమిది నెలల గడువు విధించారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో గల వివిధ మంత్రిత్వ శాఖల విభాగాలలో మానవ వనరుల పరిస్థితిని సమీక్షించి, వచ్చే 18 నెలల్లోనే 10లక్షల ఉద్యోగాల నియామకాలు జరగాలని మోదీ నిర్దేశించినట్టు కేంద్ర ప్రభుత్వం కార్యాలయం ట్విట్టర్ ట్వీట్ ద్వారా ప్రకటించింది.

నిరుద్యోగం దేశం ఎదుర్కొంటున్న సమస్యలలో పెద్ద సమస్య అయితే, ఈ ప్రక్రియ పూర్తయితే, కొంతవరకు నిరుద్యోగులకు ఉపశమనం కలుగుతుంది.

రెండేళ్ళకు పూర్వమే గ్రూప్ – A, గ్రూప్ – B, గ్రూప్ – C విభాగాలలో దాదాపు 9 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు సమాచారం. మరి ఈ రెండేళ్ళ పదవీ విరమణలు జరిగాయి. అవి కూడా ఖాళీనే కాబట్టి… ప్రభుత్వం ప్రకటించిన ప్రకటన అమలు అయితే, పదిలక్షల ఉద్యోగాల నియామకం పూర్తవుతుంది.

ప్రకటనల వలన యువతలో ఆశలు పెరుగుతాయి. అవి అమలు అయితే పది లక్షల మందికి ఉపాధి లభించినట్టవుతుంది. వారిపై ఆధారపడినవారికి కూడా మేలు జరుగుతుంది. వారి ద్వారా చదువులు చదువుకునేవారికి కూడా మేలు. కాబట్టి మోదీ గారి ఈ నిర్ణయం సక్రమంగా అమలు కావాలి… ఆశిద్దాం.

మద్య తరగతి జీవితాలలో ప్రభుత్వ ఉద్యోగం పెద్ద ఆధారం. అటువంటి ఆధారపడదగిన ఉద్యోగాలు అర్హులైనవారికి లభిస్తే, అది సంతోషకరం.

మరి కొన్ని తెలుగురీడ్స్ పోస్టులు

కేంద్ర ప్రభుత్వ అటల్ పెన్షన్ యోజన పథకం

గూగుల్ యాడ్ సెన్స్ బదులుగా యాడ్ నెట్ వర్క్

బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం

ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా

తెలుగురీడ్స్

10th క్లాస్ రిజల్ట్స్ ఏపి2022

బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు ఎవరితో

యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబర్లను పెంచుకోండి!

ఇమెయిల్ మార్కెటింగ్ టూల్స్ 2022

తెలుగులో వర్డ్ ప్రెస్ బ్లాగింగ్ గురించి

కేంద్ర ప్రభుత్వ అటల్ పెన్షన్ యోజన పథకం

తక్కువ వయస్సు ఉన్నవారికి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం అందించే కేంద్ర ప్రభుత్వ అటల్ పెన్షన్ యోజన పథకం గురించి ఈ తెలుగు సమాచార విషయాలలో తెలుగురీడ్స్ పోస్టు.

ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు కాబట్టి ఇన్సూరెన్స్ చేస్తాం. ఇన్సూరెన్స్ ఉంది కదా అని మిగిలిన వాటి గురించి ఆలోచన చేయకపోవచ్చును. ఇన్సూరెన్స్ మనపై ఆధారపడినవారికి బెనిఫిట్ చేస్తే, వృద్ధాప్యంలో మనకు బెనిఫిట్ చేసే పధకం ఉంటే, అది వృద్ధాప్యంలో అక్కరకు వస్తుంది. అదే…

ప్రభుత్వ ఉద్యోగులకు పెన్సన్ వస్తుంది. ప్రవేటు ఉద్యోగులకు పిఎఫ్ ఉంటే, వారికి పెన్సన్ పధకం ఉంటుంది. అటువంటి అవకాశం లేని ఇతరులకు పెన్సన్ వచ్చే అవకాశం ఉందా? అంటే అందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అటల్ పెన్సన్ పధకం.

అలాంటి ఒక పధకం కేంద్ర ప్రభుత్వ అటల్ పెన్షన్ యోజన పథకంలో ఎవరు చేరవచ్చును?

  • వయస్సు పరిమితి: 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు.
  • పైన చెప్పబడిన వయస్సుగల వారు విద్యార్ధులు కూడా ఈ పెన్సన్ పధకంలో చేరవచ్చును.

ఎవరికి అర్హత లేదు?

40 సంవత్సరాల వయస్సు దాటినవారు ఈ పెన్సన్ పధకంలో చేరడానికి అనర్హులు.

ఈ పధకంలో నెలవారీ చెల్లించవలసిన మొత్తము ఎంత? లభించే పెన్సన్ ఎంత?

తక్కువ వయస్సువారికి అటల్ పెన్షన్ యోజన పథకం ప్రీమియం ఎంత?

18 ఏళ్ళ వయస్సు వ్యక్తి నెల నెలా 42 రూపాయిలు చెల్లిస్తే, 60 ఏళ్ళ తర్వాత అతనికి 1000 రూపాయిల పెన్సన్ లభిస్తుంది. అదే వయస్సు గల వ్యక్తి నెలకు 84 రూపాయిలు చెల్లిస్తే, 60 ఏళ్ళ తర్వాత అతనికి 2000 రూపాయిల పెన్సన్ లభిస్తుంది. అంతకన్నా ఎక్కువ నెలకు 126 రూపాయిలు చెల్లిస్తే, 60 ఏళ్ళ తర్వాత అతనికి 3000 రూపాయిల పెన్సన్ లభిస్తుంది. ఇంకా ఎక్కువగా నెలకు 168 రూపాయిలు చెల్లిస్తే, 60 ఏళ్ళ తర్వాత అతనికి 4000 రూపాయిల పెన్సన్ లభిస్తుంది. చివరగా నెలకు 210 రూపాయిలు చెల్లిస్తే, 60 ఏళ్ళ తర్వాత అతనికి 5000 రూపాయిల పెన్సన్ లభిస్తుంది.

ఎక్కువ వయస్సువారికి కేంద్ర ప్రభుత్వ అటల్ పెన్షన్ యోజన పథకం నెలవారీ చెల్లింపు

40 ఏళ్ళ వయస్సు గల వ్యక్తి నెలకు 291 రూపాయిల చొప్పున చెల్లిస్తే, 60 ఏళ్ళ అనంతరం అతనికి 1000 రూపాయిల పెన్సన్ లభిస్తుంది. అదే వయస్సు గల వ్యక్తి నెలకు 582 రూపాయిలు చొప్పున చెల్లిస్తే, 60 ఏళ్ళ అనంతరం అతనికి 2000 రూపాయిల పెన్సన్ లభిస్తుంది. అంతకన్నా ఎక్కువ నెలకు 873 రూపాయిలు చొప్పున చెల్లిస్తే, 60 ఏళ్ళ అనంతరం అతనికి 3000 రూపాయిల పెన్సన్ లభిస్తుంది. ఇంకా ఎక్కువగా నెలకు 1164 రూపాయిలు చొప్పున చెల్లిస్తే, 60 ఏళ్ళ అనంతరం అతనికి 4000 రూపాయిల పెన్సన్ లభిస్తుంది. చివరగా నెలకు 1454 రూపాయిలు చొప్పున చెల్లిస్తే, 60 ఏళ్ళ అనంతరం అతనికి 5000 రూపాయిల పెన్సన్ లభిస్తుంది.

కేంద్ర ప్రభుత్వ అటల్ పెన్షన్ యోజన పథకం వలన ఏ వయస్సు వారికి ఎక్కువ ప్రయోజనం?

ఒక వ్యక్తి వయస్సుని బట్టి, నెలవారీ చెల్లించవలసిన చెల్లింపు ఉంటుంది. 18ఏళ్ళ వయస్సుగలవారు కనిష్ట చెల్లింపులలో 42, 84, 126, 168, 210 ఈ ధరలలో ఎంపిక చేసుకుని చెల్లించవలసి ఉంటుంది. వయస్సు 25 ఏళ్ళు ఉంటే, 76, 151, 226, 301, 376 ధరలలో ఒక దానిని ఎంపిక చేసుకుని చెల్లింపులు పూర్తిచేసిన దానిని అనుసరించి, చేస్తే 60ఏళ్ళ అనంతరం అతనికి ఈ నెల నెలా 76 చెల్లింపు పూర్తి చేసి ఉంటే 1000/-, 151 చెల్లింపు పూర్తి చేసి ఉంటే 2000/-, 226 చెల్లింపు పూర్తి చేసి ఉంటే 3000/-, 301 చెల్లింపు పూర్తి చేసి ఉంటే 4000/-, 376 చెల్లింపు పూర్తి చేసి ఉంటే 5000/- పెన్సన్ లభిస్తుంది.

అలా వయస్సు ఎక్కువ ఉన్న కొలది నెలవారీ చెల్లింపు ఎక్కువగా ఉంటుంది. తక్కువ వయస్సు ఉన్నవారు ఎక్కువ సంవత్సరాలలో తక్కువ చెల్లింపు చేస్తారు. ఎక్కువ వయస్సు ఉన్నవారు తక్కువ సంవత్సరాలో ఎక్కువ చెల్లింపులు చేస్తారు. నెలకు 1000 రూపాయిల పెన్సన్ ఎంచుకున్నవారికి 18 ఏళ్ళ వయస్సు అయితే అతను 42 సంవత్సరములలో నెలకు 42 రూపాయిల చొప్పున 504 నెలలకు 21,168 రూపాయిలు చెల్లిస్తారు. అనంతరం అతనికి నెలకు 1000 రూపాయిల పెన్సన్ లభిస్తుంది.

అదే 40ఏళ్ళ వయస్సు గల వ్యక్తి నెలకు 1000 రూపాయిల పెన్సన్ ఎంచుకుంటే, అతను నెలకు 291 రూపాయిల చొప్పున 504 నెలలకు 69840 రూపాయిలు చెల్లిస్తే, 60ఏళ్ళ అనంతరం అతనికి నెలకు 1000రూపాయిల పెన్సన్ లభిస్తుంది.

కేంద్ర ప్రభుత్వ అటల్ పెన్షన్ యోజన పథకం చేరినవారికి మార్పులు అవసరం అయితే

తక్కువ చెల్లింపు పధకంలో చేరి, తర్వాత ఎక్కువ చెల్లింపు పధకానికి మార్పులు చేసుకోవచ్చును. అలాగే ఎక్కువ చెల్లింపు పధకంలో చేరినా, తరువాత తక్కువ చెల్లింపు పధకంలోకి మార్పు చేయించుకునే అవకాశం ఉంది.

ప్రభుత్వ గుర్తింపు కలిగిన బ్యాంకు ఖాతా కలిగి ఉంటే, ఆ బ్యాంకు ఖాతా నుండి నెల నెలా ఈ పెన్సన్ పధకానికి చెల్లింపు జరిగే విధంగా చూసుకోవచ్చును. ఇంకా పోస్టాఫీసు ద్వారా కూడా ఈ పధకంలో చేరవచ్చును.

పెన్సన్ పధకంలో చేరిన వ్యక్తి మరణిస్తే, చెల్లింపులు పూర్తయ్యాక మరణిస్తే, ఆ వ్యక్తి జీవిత భాగస్వామికి పెన్సన్ వస్తుంది. ఆ వ్యక్తి కూడా లేకపోతే, నామినీగా చేర్చబడిన వ్యక్తికి చెల్లిస్తారు.

పధకంలో చెల్లింపులు పూర్తి కాకుండానే పెన్సన్ పధకం గల వ్యక్తి మరణిస్తే, అ వ్యక్తి జీవిత భాగస్వామి ఈ పెన్సన్ పధకం చెల్లింపులు చేయవచ్చును. పూర్తయ్యాక పెన్సన్ పొందవచ్చును.

మధ్యలోనే పధకం నుండి నిష్క్రమిస్తే, కేవలం చెల్లించిన చెల్లింపుల మొత్తం నుండి నిర్వహణ చార్జీలు, వర్తించే చార్జీలు తగ్గించి, మిగిలిన మొత్తమును చెల్లిస్తారు.

సకాలంలో చెల్లింపులు చేయకపోతే, ఫెనాల్టీ కూడా ఉంటుంది.

సెంట్రల్ గవరన్నమెంట్ పెన్సన్ ప్లాన్

ధన్యవాదాలు

మరి కొన్ని తెలుగురీడ్స్ పోస్టులు

గూగుల్ యాడ్ సెన్స్ బదులుగా యాడ్ నెట్ వర్క్

బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం

ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా

తెలుగురీడ్స్

10th క్లాస్ రిజల్ట్స్ ఏపి2022

బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు ఎవరితో

యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబర్లను పెంచుకోండి!

ఇమెయిల్ మార్కెటింగ్ టూల్స్ 2022

తెలుగులో వర్డ్ ప్రెస్ బ్లాగింగ్ గురించి