మనపై మొబైల్ ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు కూడా ఉన్నాయని చెబుతారు

మొబైల్ ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు

మొబైల్ ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు మన సమాజం వేగవతంగా డిజిటలైజ్ అవుతుంది. అందులో భాగంగా స్మార్ట్ ఫోన్ అందరికీ అవసరమే… అది ఎంత ప్రయోజనమే, దాని వలన అంతే నష్టం కూడా లేకపోలేదు అనే వాదన కూడా ఉంది.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

ఇటీవలి కాలంలో ప్రపంచంలో మొబైల్ ఫోన్లు బాగా వృద్ధి చెందాయి. ప్రజలంతా మొబైల్ ద్వారా సంప్రదింపులు జరుపుకుంటున్నారు. వేరు వేరు చోట్ల నివాసం ఉండే ప్రజలు, కేవలం మొబైల్ ఫోన్ ద్వారా సంభాషించుకోవడానికి బాగా అలవాటు పడ్డారు. మొబైల్ ఫోన్లు వ్యక్తుల జీవితాలపై ఎక్కువ ప్రభావం చూపుతాయని అర్ధం అవుతుంది. అయితే మొబైల్ వలన ప్రజలకు లాభాలు ఉన్నట్టే, నష్టాలు కూడా ఉంటాయి.

మొబైల్ ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు
మొబైల్ ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు

అరచేతిలో ప్రపంచం గురించి తెలుసుకోవడానికి… అరచేతి నుండే ప్రపంచానికి పరిచయం కావడానికి స్మార్ట్ ఫోన్ దోహదపడుతుంది.

సెల్ ఫోన్ వల్ల లాభాలు ఏమిటి? – మొబైల్ ప్రయోజనాలు

సుదూర ప్రాంతాలలో నివసించే స్నేహితులతో, బంధువులతో వెను వెంటనే సంభాషణలు చేయవచ్చును. వీడియో కాలింగ్ ద్వారా కూడా ఒకరినొకరు చూసుకుంటూ సంభాషించుకోవచ్చును. ఈ విధంగా స్మార్ట్ ఫోన్ ప్రజల మద్య కమ్యూనికేషన్ కు బాగా ఉపయోగపడుతుంది.

వ్యాపారస్తులకు కూడా స్మార్ట్ ఫోన్ చాలా ఉపయోగం. ఇంటర్నెట్ ద్వారా అనేక విషయాలను స్మార్ట్ ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చును. పాటలు వినవచ్చును. వీడియోలు చూడవచ్చును. వివిధ అప్లికేషన్స్ ద్వారా కొన్ని కంప్యూటర్ లో చేయగలిగే పనులు కూడా స్మార్ట్ ఫోన్ ద్వారా చేసుకోవచ్చును.

మొబైల్ ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు
మొబైల్ ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు

చెప్పాలంటే రాబోయే రోజులలో స్మార్ట్ ఫోన్ లేకుండా వ్యక్తి జీవితం గడవడం కష్టమేనని చెప్పవచ్చును.

సెల్ ఫోన్ వల్ల నష్టాలు – మొబైల్స్ వలన అప్రయోజనాలు

అవును మొబైల్స్ మన జీవితంలో భాగమైపోతున్నాయి. స్మార్ట్ ఫోన్ ప్రయోజనకారిగా ఉంటూ, మనకు నష్టం కూడా చేస్తుంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ నుండి వచ్చే రేడియేషన్ వ్యక్తి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని వైద్యులు సూచిస్తారు. ఇంకా పిల్లలకు స్మార్ట్ ఫోన్ అలవాటుగా మారుతూ, వారిని బౌతిక ఆటలకు దూరం చేయడంలో స్మార్ట్ ఫోన్ ప్రభావం చూపుతుంది. అంతే కాదు కొందరికి స్మార్ట్ ఫోన్ వ్యసనంగా మారుతుంది. కొందరు ఆటలు ఆడుతూ స్మార్ట్ ఫోనుతోనే ఎక్కువగా కాలం గడిపేస్తూ ఉంటారు. కొందరు ఏదో వీడియోలు చూస్తూ స్మార్ట్ ఫోనుతోనే సన్నిహితంగా ఉంటారు. ఏదో ఒక అంశం స్మార్ట్ ఫోను వ్యక్తిని ఆకర్షిస్తూ, అతనిని అతని బౌతిక సమాజం నుండి దూరం చేయడంలో స్మార్ట్ ఫోన్ కీలక పాత్ర పోషిస్తుంది. స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగాకా కుటుంబ జీవనంలో కూడా వ్యత్యాసాలు వస్తున్నాయని అంటారు.

ఉపయోగించుకుంటే, స్మార్ట్ ఫోన్ ద్వారా అనేక విద్యా విషయాలను తెలుసుకోవచ్చును. అలాగే అనవసర విషయాల వైపు కూడా ఆకర్షితులయ్యే అవకాశం స్మార్ట్ ఫోన్ వలన అధికంగా ఉంటుంది. ఇంకా స్మార్ట్ మోసాలు కూడా పెరుగుతూ, డబ్బులు పోగొట్టుకునేవారు కూడా మనకు వార్తాసమాచారంలో కనబడుతూ ఉంటారు. ఏదైనా ఒక వస్తువుని ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే ఉపయోగిస్తే, ఆ వస్తువు అతనికి ఉపకారిగా మారుతుంది. అదే వస్తువుతో ఎక్కువసేపు గడిపితే, ఆ వస్తువు అతనికి లాభం కన్నా నష్టం ఎక్కువ చేస్తుంది. ఈ విధంగా ఆలోచన చేసినప్పుడు స్మార్ట్ ఫోన్ ముందుగా నష్టపరిచేది, వ్యక్తిని ఒంటరిని చేయడమే….

విద్యార్థులపై సెల్ ఫోన్ ప్రభావం

చదువుకున్న తల్లిదండ్రుల చేతిలో స్మార్ట్ ఫోన్ ఖచ్చితంగా ఉంటుంది. వారు వారి పిల్లలను పెంచే కాలంలో, పిల్లలకు స్మార్ట్ ఫోన్లు అలవాటు చేయడం జరుగుతుంది. ఇదే ప్రధానంగా పిల్లలకు స్మార్ట్ ఫోన్ వాడుకకు మక్కువ చూపుతున్నారు. ఎలాగంటే?

సెల్ ఫోన్ వల్ల నష్టాలు - మొబైల్స్ వలన అప్రయోజనాలు
సెల్ ఫోన్ వల్ల నష్టాలు – మొబైల్స్ వలన అప్రయోజనాలు

పిల్లలు అన్నం తినడానికి, పేచి పెడుతుంటే, చందమామను చూపిస్తూ, వారికి ఊసులు చెబుతూ అన్నం తినిపించేవారు. కానీ ఈ స్మార్ట్ కాలంలో ఉన్న అమ్మలు… పిల్లలకు స్మార్ట్ ఫోనులో చందమామ లేకపోతే, స్మార్ట్ ఫోనులో పిల్లల వీడియోలు పెడుతూ, అన్నం తినిపించడం జరుగుతుంది. దీని వలన రేడియేషన్ కలిగిన ఫోన్ చిన్ననాటి నుండే పిల్లలతో మమేకం అవుతుంది. రేడియేషన్ ఎంత హానికరమో? వైద్యులు చెబుతూనే ఉంటారు. కానీ కొందరు చేసే ఈ పనుల వలన పిల్లలకు చిన్ననాటి నుండే స్మార్ట్ ఫోనే అంటే ఆసక్తి పెరుగుతుంది.

చదువుకునే వయస్సులో టీచర్ ద్వారా చెప్పబడే పాఠాలు వినడం వలన విద్యార్ధికి ఊహా శక్తి పెరుగుతుంది. కానీ స్మార్ట్ ఫోన్ ద్వారా తెలుసుకోవడం వలన ప్రయోజనం కన్నా స్మార్ట్ ఫోన్ పై ఆధారడడానికి అలవాటు పడే అవకాశం ఎక్కువ అంటారు.

విద్యార్ధులకు వయసుకు మించిన విషయాలలో అనవసర పరిజ్ఙానం కూడా స్మార్ట్ ఫోన్ల ద్వారా తెలియబడే అవకాశం ఉండడంతో విద్యార్ధులపై స్మార్ట్ ఫోన్ నెగటివ్ ప్రభావం చూపే అవకాశం ఉంటుందని అంటారు.

ఈ విధంగా మనపై మొబైల్ ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు కూడా ఉన్నాయని చెబుతారు.

ధన్యవాదాలు

తెలుగురీడ్స్

తెలుగువ్యాసాలు

జనవేదం