Category Archives: manchi matalu telugulo

మీరు మీ స్నేహితులతో ఎలా ఉంటారో రాయండి

మీరు మీ స్నేహితులతో ఎలా ఉంటారో రాయండి! నేను నా స్నేహితులతో చాలా సన్నిహితంగా ఉంటాను. అయితే చెడు వ్యవహారలలో దూరంగా ఉంటాను. చెడ్డ అలవాట్లకు దూరంగా ఉండమని చెబుతూ ఉంటాను. మంచి పనులకు సహకరిస్తూ ఉంటారు.

వారి అవసరాలకు సహాయపడడానికి ముందుంటారు. వారితో మంచి విషయాలను పంచుకోవడానికి సిద్దంగా ఉంటాను. చెడు విషయాలపై మాటలకు అడ్డుపడతాను. ఎందుకంటే చెడు చెప్పకుండానే చుట్టూ చేరుతుంది. మంచి చెబితే కానీ మనసులోకి చేరదు కావునా మంచి విషయాలను చర్చకు వచ్చినప్పుడు, అందులో ఉత్సాహంగా పాల్గొంటాను.

ఏ సమయంలోనైనా ధైర్యంగా ఉండాలనే ఆలోచనలు పెరిగే విధంగా నేను నాస్నేహితులతో చెబుతూ ఉంటాను. ఎందుకంటే కాలం ఎప్పుడు ఎటువంటి పరిస్థితులను కల్పిస్తుందో తెలియదు కాబట్టి.

ఎట్టి పరిస్థితులలోనూ చెడ్డ అలవాట్లకు బానిస కానని ముందుగానే వారికి చెబుతాను. అందువలన నా వలన నా స్నేహితులకు చెడ్డ అలవాట్ల గురించి తెలిసే అవకాశం ఉండదు.

ఎప్పుడూ చక్కని ఆరోగ్యం రక్షణగా ఉంటుందని చెబుతాను. మా స్నేహితులలో చక్కగా ఆరోగ్య నియమాలు పాటించేవారితో, ఆరోగ్యం గురించి చర్చిస్తూ ఉంటాను.

చక్కని లక్ష్యం గల స్నేహితునితో లక్ష్యం గురించి చేయవలసిన సాధన గురించి సలహాలు స్వీకరిస్తాను. లక్ష్య సాధించడానికి కావాల్సిన విషయ జ్ఙానం గురించి అడిగి తెలుసుకుంటాను.

తల్లిదండ్రులను, గురువులను గౌరవిస్తూ వినయంలో ఆదర్శంతంగా నిలిచే వారితో స్నేహాన్ని ఎప్పటికీ వదులుకోను.

మంచి పుస్తకాలు చదివే నా మిత్రుని దగ్గర ఎప్పుడూ ఏదో ఒక పుస్తకం గురించి తెలుసుకుంటూ ఉంటాను.

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

మీరు మీ స్నేహితులతో ఎలా ఉంటారో రాయండి

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు

ధోరణి అంటే అర్ధం ఏమిటి?

డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు

యాపిల్ ఐఫోన్ 15 తెలుగులో

భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్

మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం

లైఫ్ కొటేషన్స్ తెలుగులో జీవితం సందేశాలు

లైఫ్ కొటేషన్స్ తెలుగులో జీవితం సందేశాలు Real Life Quotes In Telugu కాలంలో మనిషికి కాలం నేర్పే పాఠాలు, జీవితంపై ఏర్పడే అవగాహన మాటలుగా మారతాయి.

పెద్దలు మాట్లాడితే, ఆ మాటలకు అర్ధం మనసుకు జరిగే అనుభవం ద్వారానే తెలుస్తుందని అంటారు.

మాట మనసుని తాకుతుంది. కానీ అన్ని మాటలకు మనసు ప్రతిస్పందించకపోవచ్చును. కొందరి మాటలకు మనసు ప్రేరణ పొందుతుందని అంటారు.

అలాంటి పెద్దల మాటలను పరిశీలన చేయడం ద్వారా మనసు మనసుపై పరిశోధనాత్మకంగా పని చేస్తుందని అంటారు.

ఇక్కడ కొన్ని లైఫ్ కొటేషన్స్ తెలుగులో జీవితం సందేశాత్మకం.

  • ఇష్టపడి పని చేస్తే, పనిపై ప్రేమ పెరుగుతుంది. పనిచేసే చోట గౌరవం పెరుగుతుంది.
  • పరిశీలనా దృష్టితో ఉండడమే పరిశోధనకు మార్గం ఏర్పడుతుంది
  • ఎవరో వేసిన బాటలో అందరూ నడుస్తారు. కానీ ఒక్కరే తాను నడిచిన దారిలో ఎందరినో నడిపించగలరు.

  • సంతోషం మీ చర్యల వలన వస్తే అది ఆనందమయం అవుతుంది. ఇతరుల చర్యల వలన అయితే అది సంతోషం మాత్రమే.
  • ప్రపంచం నిత్య నూతనంగా ఉండడానికి మార్పును కోరుకుంటుంది. అటువంటి ప్రపంచంలో కూడా నీవు నీలాగా ఉండడం నీకు మాత్రమే ఉన్న గొప్పతనం.
  • మీ కృషి మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళగలదు. అయితే మీపై మీకు గల నమ్మకమే సవాళ్ళను సైతం అధిగమించగలదు.

  • ఒక్కప్రశ్న చాలు జీవితంలో మార్పు ప్రారంభం కావాడానికి… నేనెందుకు ఇలా ఉన్నాను?.
  • నాకు తెలుసు. నాకు తెలిసినది ఎలా తెలిసినది. ఎవరో తెలుసుకున్నదే, నేను కూడా తెలుసుకున్నాను. మరి నేను కొత్తగా తెలుసుకున్నది ఏమిటి?
  • ఓటమి వెక్కిరించినా సరే, నా ప్రయత్నం చాలా ప్రధానం అనే బలమైన భావన ఘనవిజయానికి నాంది కాగలదు.

Real Life Quotes In Telugu

  • ప్రపంచం మన చుట్టూ ఒక అద్దం వలె పనిచేస్తుంది. మన ప్రవర్తనను బట్టే, ఇతరుల ప్రవర్తన మనకు ఎదురౌతుంది.
  • ఎదురైన ఓటమిలో గ్రహించిన వాస్తవమే, మరలా ప్రయత్నించడానికి ప్రోత్సాహం అవుతుంది.
  • భవిష్యత్తులో ఎలా ఉండాలో ఆలోచనలకే పరిమితం అయితే, మీ గొప్పతనం మీలోనే. అదే ఆచరణలో పెడితే, మీరేమిటో మీ చుట్టూ ఉన్న ప్రపంచానికి పరిచయం జరుగుతుంది.

  • కంటికి కనబడే మహిమ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అంతరంగంలో ఉండే మహిమను గుర్తిస్తే, అది ఆనందకరం, అద్భుతాలను ఆవిష్కరించగలదు.
  • చేద్దాం, చూద్దాం, వాయిదా కోసం చూడడం… వ్యక్తి ఉన్నతికి ప్రధాన అడ్డంకులు.
  • జీవితాన్ని ఆస్వాదించాలి కానీ అయోమయ్యంలో గందరగోళంగా కాలం వెలిబుచ్చరాదు.

  • సమయం గడిచిపోతుంది. మనసు ఆలోచనలతో పరిగెడుతుంది. సమయాన్ని, ఆలోచనలు సద్వినియోగం చేసుకోవడంలోనే జీవితం వృద్ది ఆధారపడి ఉంటుంది.
  • అవసరానికి మించిన ధనం, అక్కరకు రాని తెలివి వృధా.
  • ఊహకందని విషయాలలో ఊహించకుండానే జరిగే విశేష క్రియ అద్భుతంగా అనిపిస్తుంది.

Real Life Quotes In Telugu

  • ప్రతిసారి ప్రణాళిక వేసుకుని పోరాడలేం. ఒక్కొక్కసారి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మనసుని అందుకు సన్నద్దం చేయడమే తెలివైన పని.
  • చెడుకు ప్రచారం వేగంగా లభిస్తే, మంచికి నీవు అనుమతిస్తేనే నీ దృష్టిలోకి వస్తుంది. మంచి వేచి ఉంటుంది కానీ ఇబ్బంది పెట్టదు.
  • ఆగితే ఆలోచనలు పెరుగుతాయి. ఆగకుండా ఉంటే ఆలోచనలు ఆగుతాయి. కావునా కర్తవ్యం విస్మరించకు.

  • మీకు తెలిసి మీరు లక్ష్యంతో ప్రయాణిస్తున్నారంటే, మీకు జీవితంపై సరైన అవగాహన ఉందని అర్ధం.
  • మనం మాత్రమే సంతోషంగా ఉండడం కాదు. మన చుట్టూ ఉన్నవారు కూడా.
  • ఫలితాన్ని అంచనా వేయడం సహజం. ఆశించిన ఫలితం కోసం పనిచేయడం కర్తవ్యం. ఫలితం పొందలేదని బాధపడడం మూర్ఖత్వం.
  • విఫలం వేయి మార్గములను అన్వేషించగల శక్తిని అందించగలదు.

కొన్ని తెలుగు బ్లాగు పోస్టులు

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

లైఫ్ కొటేషన్స్ తెలుగులో జీవితం సందేశాలు

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు

ధోరణి అంటే అర్ధం ఏమిటి?

డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు

యాపిల్ ఐఫోన్ 15 తెలుగులో

భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్

మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం

Real Life Quotes In Teluguలైఫ్ కొటేషన్స్ తెలుగులో జీవితం సందేశాలు

మనసుకు నచ్చే మంచి మాటలు

మనసుకు నచ్చే మంచి మాటలు. జీవితం చాలా విలువైనది. సాధన చేసేవారికి సమయం సరిపోదు. ఒక్కసారి గడిచిన కాలం తిరిగి రాదు. గడుస్తున్న కాలంలో ఎలా జీవిస్తున్నామో అదే ఓ జ్ఙాపకంగా మారిపోతుంది. అది సంతోషం కావచ్చు… లేదా బాధ కావచ్చును.

జీవితంలో వ్యక్తికి వ్యక్తులు ఎదురౌతూ ఉంటారు. మాటతీరు చక్కగా ఉండేవారు మనసుకు నచ్చే మంచి మాటలు మాట్లాడగలిగితే, కొందరు మనసుకు నచ్చని మాటలు మాట్లాడతారు. కానీ ఎదుటివారు ఎలా మాట్లాడినా మన మాటతీరు ఎదుటివారికి ఓదార్పుగా ఉండాలని అంటారు.

ఒక చోట వ్రాసిపెట్టినట్టుగా ఉండే మంచి మాటలు చెప్పడం తేలిక, కష్టకాలంలో మనసుకు నచ్చే విధంగా మంచి మాటలు మాట్లాడడం కష్టం. కాబట్టి ఎప్పుడూ మంచి మాటలు మాట్లాడుతూ ఉండడం చేత కష్టకాలంలో చక్కని మాటలు మాట్లాడవచ్చని అంటారు.

ప్రతి బంధం వ్యక్తి నమ్మకం బట్టి బలంగా ఉంటే, వ్యక్తి స్వభావాన్ని బట్టి మంచి సంబంధాలు కొనసాగుతాయి. మంచి వ్యక్తులు మంచి మాటలు మాట్లాడుతూ తమ చుట్టూ ఉండేవారిపై ప్రభావం చూపగలరు. అటువంటి మంచి వ్యక్తుల మాటలను దూరం చేసుకోకుండని పెద్దలు చెబుతూ ఉంటారు.

సాదారణ పరిస్థితులలో మనసు ధృఢంగా ఉంటుంది. అసాధారణ పరిస్థితులలో మనసు చలిస్తుంది. కాబట్టి కష్ట కాలంలో మనసుకు శాంతి కలిగే విధంగా మనసుకు నచ్చే నాలుగు మంచి మాటలు చెప్పే బంధం మనిషి అవసరం.

ఒక వ్యక్తికి చాలా దగ్గరగా ఉండే వ్యక్తులే, ఒక వ్యక్తికి మనసుకు నచ్చే నాలుగు మంచి మాటలు చెప్పగలరు. కాబట్టి జీవితంలో ఎదురయ్యే వ్యక్తితో మొదటగా మనమే మంచి మాటలు మాట్లాడడం మేలని అంటారు. శ్రీరామాయణంలో తనకు ఎదురపడే వ్యక్తులతో, రాముడే మొదటగా పలకరించేవాడు అంటే, మాట ప్రభావం ఎలా ఉంటుందో? అర్ధం చేసుకోవాలి.

అలా మన జీవితంలో మన మనసుకు నచ్చేటట్టుగా మంచి మాటలు మాట్లాడేవారిని దూరం చేసుకోకూడదు. అలాంటి బంధాలలో మొదటిగా ఉండే బంధం…. జీవితభాగస్వామి. వీరు జీవితంలో సగమై ఉంటారు. జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేసే బంధం ఇదే. తల్లిదండ్రులు కూడా మేము తోడు ఉండడానికి ప్రయత్నిస్తారు కానీ ప్రమాణం చేయరు… కానీ జీవితపు భాగస్వామి మాత్రం జీవితాంతము తోడుంటానని బంధానికి పూనుకుంటారు. కాబటి అటువంటి జీవిత భాగస్వామితో ఎప్పటికీ సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి.

తర్వాత ఇతర బంధాలు, స్నేహితులు… మన మనసుకు నచ్చేవిధంగా నాలుగు మంచి మాటలు మాట్లాడుతారు.

మనసుకు నచ్చే మంచి మాటలు మాట్లాడగలిగితే

మనం మంచి మాటలు మాట్లాడగలిగితే, మన మాటల ప్రభావం, మన చుట్టూ ఉండేవారి మనసులో దాగి ఉంటుంది. కడుపుకు తిన్నది కడుపులో ఉండదు కానీ మనసులోకి చేరిన మాటల ప్రభావం అలానే ఉండిపోతుంది. కాబట్టి మంచి మాటలు మాట్లాడగలిగితే మాత్రం ఆ మనిషి చుట్టూ మంచి బంధాలు బలపడుతూ ఉంటాయి.

అవసరాన్ని బట్టి ఆసక్తికరంగానో, ఆకట్టుకునే విధంగానో లోకంలో మాటలు వినబడుతూనే ఉంటాయి.

సినిమా మాటలలో మాటలు

ఇప్పుడొస్తున్న సినిమాలలో మనసుకు నచ్చే మంచి మాటలు కన్నా ఆకట్టుకునే తీరులో మాటలు పోకడ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువమందికి నచ్చే నాలుగు మాటలు, ఎక్కువమందిని రంజింపచేసే మాటల వలన సినిమా కలెక్షన్లు ఉంటాయి. కాబట్టి సినిమా మాటలలో మంచి మాటలతో పాటు ఆసక్తిని పెంచే మాటలు, ఆకర్షణను తీసుకువచ్చే మాటలు… వివిధ విషయాలను పరిచయం చేసే మాటలు ఉంటాయి.

మన ఏది గ్రహిస్తున్నామో అదే తిరిగి మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు, మంచి మాటలు వినడం ప్రధానం అంటారు. మంచి పుస్తకాలు చదవడం మేలు అంటారు. మంచి పుస్తకాలు చదవడం వలన మాట యొక్క విలువ తెలియబడుతుంది. మాటతీరు మారుతుందని అంటారు.

సోషల్ మీడియాలో మంచి మాటలు చాలానే ఉంటాయి. బంధాల గురించి వారి వారి జీవితంలో అనుభవం ఆధారంగా ఈ సోషల్ మీడియా పోస్టులు ఉండవచ్చును. లేక ఒకచోట చదివినవి వారికి నచ్చితే, వాటిని పోస్ట్ చేయవచ్చును. సోషల్ మీడియాలో కూడా మనసుకు నచ్చే మాటలు హల్ చల్ చేస్తూ ఉంటాయి.

కత్తికంటే కలం గొప్పది ఎందుకంటే అది తూటా కన్నా శక్తివంతమైన మాటను వ్రాయగలదు. అలా వ్రాసిన మాట మందిలో మార్పుకు నాంది కాగలదు. కాబట్టి మాట చాలా శక్తివంతమైనది అయితే మంచి మాట అమృతము వంటిది అంటారు.

కావునా తొలుత మనం మంచి మాటలు మాట్లాడడం వలన చెడుగా మాట్లాడేవారు కూడా మంచి మాటలు వినడానికి ప్రయత్నిస్తారని, ఆపై వారు కూడా మంచి మాటలనే మాట్లాడే అవకాశం ఉంటుందని అంటారు. మంచిని పెంచడానికి మాటే ఆయుధం అయితే, అటువంటి మంచి మాటలు మాట్లాడడానికి మంచి బంధం ఉండాలి. అది మంచి పుస్తకం చదివితే ఎలాంటి భావన కలుగుతుందో, మంచి మిత్రుడితో మాట్లాడిన తరువాత అదే భావన కలుగుతుందని అంటారు.

రీడింగ్ ఏ ఫ్యాషన్ ఆఫ్ మైండ్